ప్రకటించడంలో పట్టుదలతో కొనసాగండి
1 నేటి పరిస్థితులు అపాయకరంగా ఉన్నాయి. అంతర్యుద్ధాలు, జాతి విద్వేషాల కారణంగా యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఘోర ఘటనలు సర్వసాధారణం అయ్యాయి. మునుపెన్నటి కన్నా ఇప్పుడు, మానవ కుటుంబానికి సువార్త అవసరం. అయితే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఉదాసీనత ఎక్కువగా విస్తరించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలను ఇళ్ళవద్ద కలుసుకోవడం కష్టం కావచ్చు, మనం చెప్పేవాటిని వినేవారిని లేక బైబిలు అధ్యయనం చేయాలనుకొనేవారిని కనుగొనడం ఇంకా కష్టంగా ఉండవచ్చు. అయినా, మనం దేవుని స్థాపిత రాజ్యం గురించిన సువార్తను ప్రకటించడంలో పట్టుదలతో కొనసాగడం ప్రాముఖ్యం.—మత్త. 24:14.
2 ప్రజలపట్ల ప్రేమ: మన ప్రకటనా పని ప్రజలపట్ల యెహోవాకున్న ప్రేమను నొక్కి చెబుతుంది. ‘ఆయన యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడు.’ (2 పేతు. 3: 9; యెహె. 33:11) అందుకే యేసు చెప్పినట్లు ఆయన ఇలా ఆజ్ఞాపించాడు, ‘సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.’ (మార్కు 13:10) దేవుడు ప్రజలను, తన వైపు తిరిగి సాతాను లోకం మీదకు రాబోయే తీర్పును తప్పించుకోమని కోరుతున్నాడు. (యోవే. 2:28, 29, 32; జెఫ. 2:2, 3) యెహోవా మనకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు మనం కృతజ్ఞులం కామా?—1 తిమో. 1:12, 13.
3 ప్రపంచవ్యాప్త నివేదిక, 2004వ సేవా సంవత్సరంలో ప్రతీ నెల సగటున 60,85,387 బైబిలు అధ్యయనాలు నిర్వహించబడ్డాయని, ప్రతీ వారం సగటున దాదాపు 5,000 మంది కొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకున్నారని చూపిస్తోంది! కొత్తగా సమర్పించుకున్న వీరిలో కొందరిని, ప్రచారకులు తమ నియమిత క్షేత్రంలో అందరితో మాట్లాడేందుకు చేసిన పట్టుదలతో కూడిన ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించిన కారణంగానే కనుగొనడం జరిగింది. అది సంఘాల్లో ఎంత గొప్ప ఆనందాన్ని కలుగజేసిందో కదా, ప్రాణాలను రక్షించే ఈ పనిలో దేవుని తోటి పనివారిగా ఉండడం ఎంతటి ఆధిక్యతో కదా!—1 కొరిం. 3:5, 6, 9.
4 దేవుని నామాన్ని స్తుతించడం: మనం యెహోవాను బహిరంగంగా స్తుతించడానికి, మానవజాతి అంతటి ఎదుట ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికి ప్రకటించడంలో పట్టుదలతో కొనసాగుతాం. (హెబ్రీ. 13:15) మానవజాతి సమస్యలను పరిష్కరించడానికి దేవునికి శక్తి లేదనీ, మానవ బాధల విషయంలో ఆయన ఉదాసీనంగా ఉన్నాడనీ లేక అసలు ఆయన ఉనికిలోనే లేడని నమ్మేలా సాతాను “సర్వలోకమును” మోసగించాడు. (ప్రక. 12:9) మనం మన ప్రకటనా పని ద్వారా మన మహోన్నత పరలోక తండ్రి గురించిన సత్యాన్ని సమర్థిస్తాం. మనం ఆయన నామాన్ని స్తుతించడంలో ఇప్పుడూ, ఎల్లప్పుడూ కొనసాగుదాం!—కీర్త. 145:1, 2.