పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట ఫిబ్ర. 15
“కొన్నిసార్లు మనం అద్భుతాలు జరిగాయనే వార్తలు వింటుంటాం. [ఒక ఉదాహరణను పేర్కొనండి.] కొందరు అలాంటి వార్తలు నమ్ముతారు. మరికొందరు నమ్మరు. బైబిలులో పేర్కొన్న అద్భుతాలు నిజంగా జరిగాయా, అలాంటి అద్భుతాలు ఇప్పుడుకూడా జరుగుతాయా అనే అంశాలను ఈ పత్రిక పరిశోధిస్తుంది.” యిర్మీయా 32:21 చదవండి.
తేజరిల్లు! జన.-మార్చి
“చిన్నప్పటి నుండే పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో ఉన్న విలువను చాలామంది గ్రహిస్తున్నారు. మరి అలా శిక్షణ ఇవ్వడం ప్రాముఖ్యమని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత సామెతలు 22:6 చదవండి.] పిల్లలు మంచివారిగా, ప్రయోజకులుగా ఎదిగేందుకు వారికి సహాయం చేయడానికి తల్లిదండ్రులు ఏమి చేయవచ్చో ఈ తేజరిల్లు! సంచిక వివరిస్తోంది.”
కావలికోట మార్చి 1
“అందరూ ఈ సలహాను పాటిస్తే లోకం ఒక మంచి ప్రదేశంగా మారుతుందని మీరనుకుంటున్నారా? [రోమీయులు 12:17, 18 చదవండి, ప్రతిస్పందించనివ్వండి.] విచారకరంగా, కొన్నిసార్లు వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండవచ్చు. తగాదాలను పరిష్కరించుకొని, సమాధానాన్ని నెలకొల్పుకోవడానికి బైబిలు సలహాను అనుసరించడం మనకు ఎలా సహాయం చేస్తుందో ఈ పత్రిక వివరిస్తోంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు ఏమైనా చేయవచ్చా? ఫలితాలేమిటో గమనించండి. [సామెతలు 23:24, 25 చదివి, పత్రికలోని 20వ పేజీ తెరవండి.] పిల్లలను క్రమశిక్షణలో పెంచడానికి ఈ పత్రిక సహాయకరమైన సూచనలు ఇస్తోంది.”