కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/05 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2005
మన రాజ్య పరిచర్య—2005
km 2/05 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించాలి. ఈ ప్రచురణలేని సంఘాలు ప్రత్యామ్నాయంగా సృష్టి (ఆంగ్లం) లేదా ప్రకటన ముగింపు! పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించి గృహ బైబిలు అధ్యయనం ఆరంభించడానికి ప్రయత్నించండి. ఏప్రిల్‌, మే నెలల్లో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలను ప్రతిపాదించండి. ఆసక్తిగల ప్రజలను పునర్దర్శించేటప్పుడు, జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని ప్రతిపాదించడం మీద దృష్టి నిలపండి. ముఖ్యంగా జ్ఞానము పుస్తకం, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లను ఇప్పటికే అధ్యయనం చేసిన వారుంటే వారితో గృహ బైబిలు అధ్యయనం ప్రారంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి.

◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు మార్చి 1న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘ అకౌంట్సు ఆడిట్‌ చేయాలి. మరమ్మతు లేక నిర్మాణం లాంటి వాటికి వేరే అకౌంట్‌ ఉన్నట్లయితే వాటిని కూడా ఆడిట్‌ చేయడానికి ఏర్పాటు చేయాలి. ఆడిటింగ్‌ పూర్తయిన తర్వాత, తర్వాతి అకౌంట్సు రిపోర్టుతోపాటు దాన్ని సంఘంలో చదవాలి.

◼ కార్యదర్శి, సేవా పైవిచారణకర్త క్రమ పయినీర్లందరి కార్యకలాపాలను సమీక్షించాలి. వారిలో ఎవరికైనా గంటలను చేరుకోవడం కష్టంగా ఉంటే, సహాయం అందించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేయాలి. సూచనలకు, S-201 ఉత్తరాలను పునఃసమీక్షించండి.

◼ “యేసు ఎందుకు బాధపడి, మరణించాడు?” అనే శీర్షికగల ప్రత్యేక బహిరంగ ప్రసంగం 2005 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇస్తారు. దీనికి సంబంధించిన ప్రకటనను సెప్టెంబరు 2004 మన రాజ్య పరిచర్యలో చూడండి.

◼ ప్రచారకులందరికీ అందుబాటులోకి రాబోతున్న ఒక ఏర్పాటు గురించిన ప్రత్యేక ప్రకటన కోసం అందరూ ఆదివారం, మార్చి 20న జరిగే బహిరంగ కూటానికి హాజరుకావాలి.

◼ సాహిత్యాలను పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసే రిక్వెస్ట్‌లను బ్రాంచి కార్యాలయం అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను బ్రాంచి కార్యాలయానికి పంపించే ముందు ప్రతి నెలా దాని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావల్సిన సాహిత్యాలను తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల బాధ్యతను నిర్వహిస్తున్న సహోదరునికి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్స్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.

◼ మే 23, 2005తో ప్రారంభమయ్యే వారం నుండి సంఘ పుస్తక అధ్యయనంలో మనం, అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను అధ్యయనం చేస్తాం.

◼ మార్చి 1, 2005 సంచిక నుండి మరాఠీ భాషలోని కావలికోట పక్ష పత్రికగా కాక మాస పత్రికగానే ప్రచురించబడుతుంది.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

దేవుని కోసం మానవజాతి అన్వేషణ—తమిళం

అప్రమత్తంగా ఉండండి!—అస్సామీ, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ

అన్ని దేశాల ప్రజలకు సువార్త—ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ

◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:

చర్చనీయ బైబిలు అంశాలు—మరాఠీ (రివైజ్డ్‌)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి