మరింత సాక్ష్యం లభించేలా వారికి సహాయం చేయండి
1 మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు, మన క్షేత్రంలో నివసించని ప్రజలను లేక వేరే భాష మాట్లాడేవారిని, సంజ్ఞా భాష వారిని తరచుగా కలుస్తుంటాం. మనతో ప్రగతిదాయక బైబిలు చర్చలను జరిపిన మరికొందరు మన క్షేత్రాన్ని విడిచి వెళ్ళవచ్చు. అలాంటి వారికి మరింత సాక్ష్యం లభించేందుకు మనమెలా ఏర్పాటు చేయవచ్చు? ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారాన్ని ఉపయోగించడం ద్వారా చేయవచ్చు.
2 తమ మాతృభాషలో సువార్తను ప్రకటించినప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా వింటారు. (అపొ. 22:1, 2) అందువల్ల, చాలా సందర్భాలలో వేరే భాష మాట్లాడే ఎవరినైనా మనం కలుసుకున్నట్లయితే, ఆ వ్యక్తి రాజ్య సందేశంపట్ల ఆసక్తి చూపించకపోయినా సరే మనం ఆ ఫారం పూరించాలి. అయితే, వేరేభాష మాట్లాడే జనాభా అధికంగా ఉండి, వారి స్వభాషలో వారికి క్రమంగా సాక్ష్యం లభిస్తున్నట్లయితే, ఆసక్తి చూపిస్తే తప్ప ఈ ఫారం పూరించవలసిన అవసరం లేదు.
3 ఫారం పూరించడం: నేర్పుగా వ్యక్తి పేరు, చిరునామా, అతని ఫోను నంబరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తి చూపించే ఆసక్తి గురించి, ఆయన ఇంట్లో ఉండే సమయం గురించి, అందించిన లేక కోరిన సాహిత్యం గురించి, ఆ వ్యక్తి బాగా అర్థం చేసుకొనే భాషను కూడా సూచించండి. ఆ ఫారం నింపిన తర్వాత, వెంటనే దానిని సంఘ కార్యదర్శికి ఇవ్వండి, ఆయన సంబంధిత సంఘానికి లేక గుంపుకు దానిని పంపిస్తాడు.
4 ఫారం పంపించడం: ఈ ఫారాన్ని ఏ సంఘం లేక గుంపు అందుకోవాలి అనేది కార్యదర్శికి తెలియకపోతే లేదా చిరునామా లేకపోతే, అవసరమైన సమాచారం పొందడానికి ఆయన బ్రాంచి కార్యాలయంలోని టెరిటరీ డెస్క్‌కు ఫోను చేయవచ్చు. ఫారం పంపించేటప్పుడు ఇకమీదట నగర పైవిచారణకర్తకు తెలియజేయవలసిన అవసరం లేదు.
5 పూరించిన ప్లీజ్ ఫాలో అప్ ఫారాన్ని ఒక సంఘం లేదా ఒక గుంపు అందుకున్నప్పుడు ఆ వ్యక్తిని వెంటనే కలుసుకొనే ఏర్పాట్లు చేయాలి. మన వంతు పాత్రను మనం శ్రద్ధగా నిర్వహిస్తుండగా, “నిత్యజీవంపట్ల సరైన మానసిక వైఖరిగల” వారి హృదయాలను యెహోవా తెరుస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—అపొ. 13:48, NW.