దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2005 ఫిబ్రవరి 28వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2005 జనవరి 3 నుండి ఫిబ్రవరి 28 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. మనం మరింత సులభంగా అర్థమయ్యేలా ఎలా ప్రసంగించవచ్చు? [be 226వ పేజీ 1వ పేరా-227వ పేజీ 1వ పేరా]
2. ఎలాంటి పదాలకు అదనపు వివరణ అవసరం కావచ్చు? [be 227వ పేజీ 2-5 పేరాలు]
3. మన ప్రసంగం శ్రోతలకు నిజంగా సమాచారం అందించేదిగా ఉండడానికి ఏ పద్ధతిని పాటించడం సహాయకరంగా ఉంటుంది? [be 231వ పేజీ 1-3 పేరాలు]
4. బాగా పరిచయమున్న లేఖనం చదువుతున్నప్పుడు దానిని మన ప్రేక్షకులకు సమాచారం అందించేదిగా ఎలా చేయవచ్చు? [be 231వ పేజీ 4-5 పేరాలు]
5. బాగా పరిచయమున్న బైబిలు వృత్తాంతంలోని వివరాలపై అవధానం నిలపమని మన శ్రోతలను ప్రోత్సహించడం ఎలాంటి ప్రభావాన్ని చూపించవచ్చు? [be 232వ పేజీ 2-4 పేరాలు]
ఒకటవ నియామకం
6. “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను” అని ప్రజలకు బోధించడంలో ఏమి ఇమిడివుంది? (ప్రసం. 12:13) [be 272వ పేజీ 3-4 పేరాలు]
7. మనం కేవలం యెహోవా అనే పేరువైపు కాకుండా ఆ పేరుగల వ్యక్తివైపు అవధానాన్ని ఎలా మళ్ళించవచ్చు? (యోవే. 2:32) [be 274వ పేజీ 2-4 పేరాలు]
8. యేసు గురించి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం, ఆయన గురించి సాక్ష్యమివ్వడం ఎంత ప్రాముఖ్యమైనది? (యోహా. 17:3) [be 275వ పేజీ ‘యేసును గూర్చి సాక్ష్యమిచ్చుట’ అనేదాని క్రింద 4వ పేరా]
9. దేవునితో ఆమోదయోగ్యమైన సంబంధం కలిగివుండడానికి, బైబిలును అర్థం చేసుకోవడానికి, యేసు పాత్రను గుర్తించడం ఎందుకు ప్రాముఖ్యం? [be 276వ పేజీ 1వ పేరా]
10. యేసుక్రీస్తు రాజుగా పరిపాలిస్తున్నాడని మనం నిజంగా నమ్ముతున్నామని ఎలా చూపించవచ్చు? [be 277వ పేజీ 4వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. అబ్రాహాము తండ్రియైన తెరహు విగ్రహాలను ఆరాధించేవాడా? (యెహో. 24:2)
12. యెహోవా తనకిచ్చిన నియామకాన్ని నెరవేర్చడానికి గిద్యోనుకు ధైర్యం చాలలేదా? మీ జవాబుకు ఆధారమేమిటి? (న్యాయా. 6:25-27)
13. గిద్యోను ఎఫ్రాయిము గోత్రంవారితో మాట్లాడిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 8:1-3)
14. గిబియాలోని ప్రజలు ఆతిథ్యం ఇవ్వడానికి సుముఖత చూపించకపోవడం దేనిని సూచించింది? (న్యాయా. 19:14, 15)
15. ‘ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించడం’ అల్లకల్లోలాన్ని సృష్టించిందా? (న్యాయా. 21:25)