ప్రశ్నా భాగం
◼ ఇతర దేశాల్లోని అవసరతగల సహోదరులకు సహాయం చేయడానికి డబ్బును విరాళంగా ఇవ్వడానికి శ్రేష్ఠమైన మార్గం ఏమిటి?
ఇతర దేశాల్లోని సహోదరులు హింస, విపత్తు, ఇతర కష్టభరిత పరిస్థితుల కారణంగా ఆర్థిక అవసరతల్లో ఉన్నట్లు మనం అప్పుడప్పుడు వింటుంటాం. కొంతమంది సహోదరులు ఒకానొక వ్యక్తికి, ఒక ప్రత్యేక సంఘానికి లేక ఒక నిర్దిష్ట నిర్మాణ ప్రాజెక్టుకు ఉపయోగించమని కోరుతూ ఆ దేశాల్లోని బ్రాంచి కార్యాలయాలకు నేరుగా విరాళాలు పంపించడానికి ప్రేరేపించబడ్డారు.—2 కొరిం. 8:1-4.
తోటి విశ్వాసులపట్ల అలాంటి ప్రేమపూర్వక శ్రద్ధ ఉండడం మెచ్చుకోదగినదే అయినా, విరాళాలు ఇచ్చే సహోదరుడు అనుకున్న వాటికంటే అత్యవసరమైన పరిస్థితులు వేరే ఉంటాయి. కొన్ని సందర్భాలలో విరాళాలు ఇచ్చే సహోదరుడు చేయదలచిన సహాయం అప్పటికే చేయబడి ఉండవచ్చు. అయితే మనం ప్రపంచవ్యాప్త పని కోసం, రాజ్యమందిర నిధి కోసం, లేదా విపత్తు సహాయార్థం స్థానిక బ్రాంచి కార్యాలయానికి పంపే విరాళాలను, వాటిని ఇచ్చినవారు నిర్దేశించినట్లే ఉపయోగిస్తారనే నమ్మకంతో ఉండవచ్చు.
ఊహించని రీతిలో ఏర్పడే అవసరతలకు వెంటనే ప్రతిస్పందించేందుకు అన్ని బ్రాంచి కార్యాలయాల్లోని సహోదరులకు సమగ్ర శిక్షణ ఇవ్వబడింది. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆ విషయం గురించి బ్రాంచి కార్యాలయం పరిపాలక సభకు తెలియజేస్తుంది. కాబట్టి అదనపు సహాయం అవసరమైనట్లయితే, పరిపాలక సభ సహాయం చేయమని దగ్గరలోని బ్రాంచి కార్యాలయాలను కోరవచ్చు లేదా విరాళాలను నేరుగా ప్రధాన కార్యాలయం నుండే పంపించవచ్చు.—2 కొరిం. 8:14, 15.
కాబట్టి ప్రపంచవ్యాప్త పని కోసం, ఇతర దేశాల్లోని నిర్మాణ ప్రాజెక్టుల కోసం, విపత్తు సహాయార్థం ఉద్దేశించబడిన విరాళాలన్నింటిని సంఘం ద్వారా లేక నేరుగా మీరు నివసిస్తున్న దేశంలోని బ్రాంచి కార్యాలయానికే పంపించాలి. ఈ విధంగా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” పరిపాలక సభ ద్వారా నెలకొల్పిన వ్యవస్థాపరమైన ఏర్పాట్ల ద్వారా ప్రపంచవ్యాప్త సహోదరత్వానికి సంబంధించిన అవసరతల విషయంలో క్రమ పద్ధతిలో శ్రద్ధ తీసుకుంటాడు.—మత్త. 24:45-47; 1 కొరిం. 14:33, 40.