కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 12 పేజీలు 123-129
  • స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా రాజ్యసంబంధ పనులకు మద్దతివ్వడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా రాజ్యసంబంధ పనులకు మద్దతివ్వడం
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రపంచవ్యాప్తంగా రాజ్యసంబంధ విషయాల్ని చూసుకోవడం
  • స్థానిక సంఘ అవసరాల్ని చూసుకోవడం
  • విరాళాల్ని చూసుకోవడం
  • సర్క్యూట్‌ ఖర్చులు
  • పేదవాళ్ల పట్ల శ్రద్ధ చూపించడం
  • సాహిత్యం పంపిణీ
  • రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • స్వచ్ఛంద విరాళముల ద్వారా ఆర్థికమద్దతు పొందుచున్నారు
    యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు
  • మందను కాసే పర్యవేక్షకులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ప్రయాణ కాపరులు—సత్యమందు జతపనివారు
    యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 12 పేజీలు 123-129

12వ అధ్యాయం

స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా రాజ్యసంబంధ పనులకు మద్దతివ్వడం

చివరి రోజుల గురించి యేసు చెప్పిన ప్రవచన నెరవేర్పులో భాగంగా, యెహోవాసాక్షులు “భూమంతటా” మంచివార్త ప్రకటిస్తున్నారు. (అపొ. 1:8; మత్త. 24:14) ఇతరులకు ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయడానికి వాళ్లు తమ సమయాన్ని, శక్తిని ఉచితంగా ధారపోస్తున్నారు. యెహోవా తన తోటి పనివాళ్ల అవసరాల్ని తీరుస్తాడనే నమ్మకంతో, వాళ్లు తమ జీవితంలో దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇస్తున్నారు. (మత్త. 6:25-34; 1 కొరిం. 3:5-9) ఫలితాల్ని చూస్తే, ఆ పనులమీద యెహోవా ఆమోదం, ఆశీర్వాదం ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా రాజ్యసంబంధ విషయాల్ని చూసుకోవడం

2 మన ప్రకటనా పనిని చూసి, అలాగే మనం బైబిళ్లను, బైబిలు ప్రచురణల్ని డబ్బులకు కాకుండా ఇవ్వడం చూసి, “ఈ పనంతా ఎలా జరుగుతుంది?” అని కొంతమంది అడుగుతారు. నిజానికి వాటిని ముద్రించడానికి, ఉత్పత్తి చేయడానికి ఖర్చవుతుంది. అంతేకాదు ముద్రణా యంత్రాల్ని ఉపయోగించి పని చేసేవాళ్లు అలాగే ప్రకటనా పనిని పర్యవేక్షించే సహోదరులు ఉండేందుకు బెతెల్‌ గృహాల్ని నిర్మించడానికి, వాటిని మంచి స్థితిలో ఉంచడానికి, మంచివార్తను ముందుకు తీసుకెళ్లడానికి కూడా డబ్బు ఖర్చవుతుంది. మరోవైపు ప్రాంతీయ పర్యవేక్షకులకు, క్షేత్ర మిషనరీలకు, ప్రత్యేక పయినీర్లకు, ఇతర ప్రత్యేక పూర్తికాల సేవకులకు తమ పనిని కొనసాగించడానికి కొంత ఆర్థిక మద్దతు ఇవ్వబడుతుంది. దీన్నిబట్టి చూస్తే, నేడు స్థానికంగా లేదా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పనికి ఎంతో డబ్బు ఖర్చవుతుంది. ఇంతకీ, ఈ డబ్బంతా ఎక్కడి నుండి వస్తుంది?

3 యెహోవాసాక్షులు చేస్తున్న బైబిలు విద్యా పనిపట్ల మెప్పుదలతో, చాలామంది ప్రపంచవ్యాప్త పనికోసం సంతోషంగా విరాళాలు ఇస్తారు. అయితే ఈ పని, ముఖ్యంగా యెహోవాసాక్షులు ఇచ్చే స్వచ్ఛంద విరాళాలతోనే జరుగుతుంది. కొంతమంది తమ స్వచ్ఛంద విరాళాల్ని యెహోవాసాక్షుల స్థానిక బ్రాంచి కార్యాలయాలకు పంపిస్తారు. వాళ్లు, ప్రాచీనకాలంలో యెహోవా ఆరాధనా స్థలాన్ని నిర్మించడానికి ఇష్టపూర్వకంగా మద్దతిచ్చిన దేవుని సేవకుల ఉదార స్ఫూర్తినే చూపిస్తారు. (నిర్గ. 35:20-29; 1 దిన. 29:9) కొంతమంది వీలునామా ద్వారా తమ స్థిరాస్తుల్ని బహుమతి రూపంలో బ్రాంచికి ఇస్తారు. సాధారణంగా వ్యక్తుల ద్వారా, సంఘాల ద్వారా, సర్క్యూట్ల ద్వారా చిన్న మొత్తంలో విరాళాలు వస్తాయి. పరిచర్యను ముందుకు తీసుకెళ్లడానికి ఈ బహుమతులన్నీ నిధుల్లా ఉపయోగపడతాయి.

యెహోవాసాక్షులు తమ డబ్బును, ఇతర వనరుల్ని ప్రకటనా పని అభివృద్ధికి ఉపయోగించడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తారు

4 యెహోవాసాక్షులు తమ డబ్బును, ఇతర వనరుల్ని ప్రకటనా పని అభివృద్ధికి ఉపయోగించడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తారు. ఖర్చుల కోసం ఉపయోగించడానికి యేసు, ఆయన శిష్యుల దగ్గర డబ్బుల పెట్టె ఉండేది. (యోహా. 13:29) తమ దగ్గరున్న వాటితో యేసుకు, ఆయన శిష్యులకు సేవలు చేసిన కొంతమంది స్త్రీల గురించి బైబిలు చెప్తుంది. (మార్కు 15:40, 41; లూకా 8:3) మంచివార్తను ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తి చూపించేవాళ్లు అలాగే పరిచర్యలో భాగం వహించాలని ఇష్టపడేవాళ్లు ప్రేమతో ఇచ్చిన ఆర్థిక మద్దతును అపొస్తలుడైన పౌలు సంతోషంగా అంగీకరించాడు. (ఫిలి. 4:14-16; 1 థెస్స. 2:9) ఉత్సాహంగా పరిచర్య చేస్తూ, ఉదారంగా విరాళాలిచ్చిన ఆ ప్రాచీనకాల సేవకుల్ని నేడు యెహోవాసాక్షులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. దానివల్ల, వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యథార్థ హృదయం గలవాళ్లకు “ఉచితంగా జీవజలాలు” ఇవ్వగలుగుతున్నారు.—ప్రక. 22:17.

స్థానిక సంఘ అవసరాల్ని చూసుకోవడం

5 స్థానిక సంఘ ఖర్చుల్ని చూసుకోవడానికి కూడా స్వచ్ఛంద విరాళాలే ఉపయోగించబడతాయి. వాటికోసం చందాలు గానీ నిధులు గానీ సేకరించబడవు; అంతేకాదు ప్రతీఒక్కరు ఇంత ఇవ్వాలని నిర్ణయించబడదు. కూటాలకు వచ్చేవాళ్లు తమ “మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకున్నారో” అంత విరాళం ఇవ్వగలిగేలా రాజ్యమందిరాల్లో విరాళాల పెట్టెలు ఉంటాయి.—2 కొరిం. 9:7.

6 విరాళాల్ని ముందుగా, రాజ్యమందిర నిర్వహణకు అలాగే దాన్ని మంచి స్థితిలో ఉంచడానికి అయ్యే ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. అంతేకాదు ఆ విరాళాల్లో కొంత మొత్తాన్ని, ప్రపంచవ్యాప్త పనిని ముందుకు తీసుకెళ్లడం కోసం స్థానిక బ్రాంచి కార్యాలయానికి పంపించాలని సంఘ పెద్దల సభ నిర్ణయించవచ్చు. దీని కోసం సంఘమంతా కలిసి ఒక తీర్మానం తీసుకుంటుంది. ఈ విధంగా చాలా సంఘాలు ప్రపంచవ్యాప్త పనికోసం క్రమంగా విరాళాలు పంపిస్తాయి. ఎప్పటికప్పుడు సంఘంలో అయ్యే ఖర్చుల్ని ప్రతీఒక్కరు దృష్టిలో పెట్టుకుంటే, విరాళాల గురించి సంఘంలో తరచూ ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉండదు.

విరాళాల్ని చూసుకోవడం

7 ప్రతీ కూటం తర్వాత, ఇద్దరు సహోదరులు విరాళాల పెట్టెల్లో వచ్చిన మొత్తాన్ని లెక్క చూసి, వాటిని రాసి పెడతారు. (2 రాజు. 12:9, 10; 2 కొరిం. 8:20) ఆ విరాళాల్ని బ్రాంచికి పంపించేంత వరకు లేదా సంఘ ఖర్చుల కోసం ఉపయోగించేంత వరకు, వాటిని భద్రపరచడానికి పెద్దల సభ తగిన ఏర్పాట్లు చేస్తుంది. సంఘ అకౌంట్స్‌ చూసుకునే సహోదరుడు, అకౌంట్స్‌ వివరాల్ని సంఘానికి తెలియజేయడానికి ఏ నెలకు ఆ నెల ఒక స్టేట్‌మెంట్‌ తయారుచేస్తాడు. పెద్దల సభ సమన్వయకర్త, సంఘ అకౌంట్స్‌ని మూడు నెలలకు ఒకసారి ఆడిట్‌ చేసే ఏర్పాటు చేస్తాడు.

సర్క్యూట్‌ ఖర్చులు

8 ప్రాంతీయ సమావేశాలకు అయ్యే ఖర్చులు అలాగే ఇతర సర్క్యూట్‌ ఖర్చుల కోసం ఆ సర్క్యూట్‌లోని సహోదరసహోదరీలు ఇచ్చే విరాళాల్ని ఉపయోగిస్తారు. ప్రాంతీయ సమావేశానికి హాజరైనవాళ్లు, సర్క్యూట్‌ అవసరాల కోసం స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వగలిగేలా సమావేశ హాలులో విరాళాల పెట్టెలు ఉంటాయి. అంతేకాదు, ఎప్పటికీ ఉండే ఖర్చుల కోసం వేరే సమయాల్లో కూడా సంఘాలు విరాళాలు ఇవ్వవచ్చు.

9 చాలామట్టుకు, అవసరమైన ఖర్చుల్ని సర్క్యూట్లే భరించుకోగలుగుతాయి, మిగిలిన డబ్బును ప్రపంచవ్యాప్త పనికోసం విరాళంగా ఇస్తాయి. అయితే, సర్క్యూట్‌ అకౌంట్‌లో ఖర్చులకు సరిపడా డబ్బు లేకపోతే లేదా తర్వాతి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి, అంటే హాలును ముందే బుక్‌ చేసుకోవడం వంటివాటికి సరిపడా డబ్బు లేకపోతే, ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆ విషయం గురించి సంఘాలకు తెలియజేసి, విరాళం ఇచ్చే అవకాశం గురించి గుర్తుచేయమని పెద్దలకు నిర్దేశం ఇవ్వొచ్చు. అప్పుడు ప్రతీ సంఘంలోని పెద్దల సభ ఆ విషయం గురించి చర్చించుకొని, తమ సంఘం సర్క్యూట్‌ ఫండ్‌ కోసం ఎంత విరాళం ఇవ్వగలదో నిర్ణయిస్తుంది. తర్వాత ఆ విషయంలో సంఘమంతా కలిసి ఒక తీర్మానం తీసుకుంటుంది.

10 సర్క్యూట్‌లోని పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన ఏవైనా ఆర్థికపరమైన విషయాలు ఉంటే, ప్రాంతీయ సమావేశం జరిగే రోజు సర్క్యూట్‌లోని పెద్దలందరికీ ఒక కూటం జరుగుతుంది. సాధారణ సర్క్యూట్‌ ఖర్చులు మినహాయించి, మిగతా ఖర్చులన్నిటిని పెద్దలు తీర్మానం తీసుకుని నిర్ణయించాలి. సర్క్యూట్‌ డబ్బును ఉపయోగించే ప్రతీసారి పెద్దలందరి ఆమోదం కోసం దాన్ని తీర్మానం రూపంలో ప్రతిపాదించాలి, ఆ తీర్మానంలో ఖచ్చితంగా ఎంత ఖర్చు అవుతుందో స్పష్టంగా రాయాలి.

11 సర్క్యూట్‌ అకౌంట్స్‌ ఎప్పటికప్పుడు ఆడిట్‌ జరిగే ఏర్పాటు చేయబడుతుంది.

పేదవాళ్ల పట్ల శ్రద్ధ చూపించడం

12 యేసు, ఆయన శిష్యులు తమ దగ్గరున్న డబ్బు పెట్టెలో నుండి పేదవాళ్లకు కూడా సహాయం చేసేవాళ్లు. (మార్కు 14:3-5; యోహా. 13:29) అలా సహాయం చేయాల్సిన బాధ్యత నేటి క్రైస్తవులకు కూడా ఉంది. ఎందుకంటే యేసు ఇలా అన్నాడు: “పేదవాళ్లు ఎప్పుడూ మీతోనే ఉంటారు.” (మార్కు 14:7) పేదవాళ్లకు సహాయం చేయాల్సిన ఆ బాధ్యతను నేటి యెహోవాసాక్షులు ఎలా నిర్వర్తిస్తున్నారు?

13 కొన్నిసార్లు వయసు పైబడడం వల్ల, అనారోగ్యం వల్ల, మరేదైనా కష్టపరిస్థితి వల్ల సంఘంలోని నమ్మకమైన సహోదరసహోదరీలకు ఆర్థిక సహాయం అవసరమవ్వవచ్చు. ఆ అవసరాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరులు వాళ్లకు సహాయం చేయడానికి ముందుకురావచ్చు. అలా చేసేవాళ్లు అపొస్తలుడైన యోహాను చెప్పిన ఈ మాటల్ని పాటిస్తున్నారు: “ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సినవి ఉన్న ఒక వ్యక్తి, తన సహోదరుడు అవసరంలో ఉండడం చూసి కూడా అతని మీద కనికరం చూపించకపోతే, ఆ వ్యక్తికి దేవుని మీద ప్రేమ ఉందని ఎలా చెప్పగలం? చిన్నపిల్లలారా, మన ప్రేమను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి.” (1 యోహా. 3:17, 18; 2 థెస్స. 3:6-12) అవసరంలో ఉన్న నమ్మకమైన సహోదరసహోదరీలకు ఆర్థిక సహాయం చేయడం కూడా సత్యారాధనలో ఓ భాగం.—యాకో. 1:27; 2:14-17.

14 అర్హులైనవాళ్లకు ఆర్థిక సహాయం ఎలా చేయవచ్చో అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో వివరించాడు. ఆ సలహాల్ని మనం 1 తిమోతి 5:3-21 లో చూడవచ్చు. తన కుటుంబ సభ్యుల అవసరాల్ని చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రతీ క్రైస్తవునిపై ఉంది. వయసు పైబడినవాళ్లను లేదా అనారోగ్యంతో ఉన్నవాళ్లను వాళ్ల పిల్లలు, మనవళ్లు-మనవరాళ్లు లేదా దగ్గరి బంధువులు చూసుకోవాలి. కొన్నిసార్లు ప్రభుత్వం లేదా సామాజిక పథకాలు వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి, కాబట్టి అలాంటి వాటికి దరఖాస్తు చేసుకునేలా బంధువులు లేదా ఇతరులు వాళ్లకు సహాయం చేయవచ్చు. అయితే, ఎంతోకాలం నుండి నమ్మకంగా సేవ చేసిన సహోదరసహోదరీలకు సంఘమంతా కలిసి సహాయం చేసే పరిస్థితి తలెత్తవచ్చు. అలాంటివాళ్లకు సహాయం చేయడానికి కుటుంబ సభ్యులు గానీ బంధువులు గానీ లేకపోతే లేదా ప్రభుత్వం నుండి తగినంత సహాయం అందకపోతే, వాళ్లకు సహాయం అందించడానికి పెద్దల సభ తగిన సిఫారసులను చేయవచ్చు. అవసరంలో ఉన్నవాళ్లకు ఆర్థిక సహాయం అందించడాన్ని క్రైస్తవులు గొప్ప అవకాశంగా భావిస్తారు.

15 ఈ కష్టమైన కాలాల్లో సర్వసాధారణంగా వచ్చే హింస, యుద్ధాలు, భూకంపాలు, వరదలు, కరువులు లేదా ఇతర విపత్తుల వల్ల చాలామంది సహోదరసహోదరీలకు సహాయం అవసరమవ్వవచ్చు. (మత్త. 24:7-9) ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి స్థానిక సంఘాల దగ్గర ఏమీ లేకపోతే, వేరే ప్రాంతాల సహోదరుల నుండి వాళ్లకు సహాయం అందేలా పరిపాలక సభ ఏర్పాటు చేస్తుంది. ప్రాచీనకాలంలో, యూదయలో కరువు వచ్చింది. అప్పుడు, ఆసియా మైనరులో ఉన్న క్రైస్తవులు వాళ్లకు ఆహారాన్ని పంపించారు. (1 కొరిం. 16:1-4; 2 కొరిం. 9:1-5) వాళ్లను అనుకరిస్తూ మన సహోదరులపట్ల ప్రేమ చూపిస్తాం, యేసుక్రీస్తుకు నిజమైన శిష్యులమని నిరూపిస్తాం.—యోహా. 13:35.

సాహిత్యం పంపిణీ

16 రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడంలో బైబిళ్లు, బైబిలు ప్రచురణలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా, సంఘంలో సాహిత్యం సరఫరాను చూసుకోవడానికి పెద్దల సభ ఓ సంఘ పరిచారకుణ్ణి నియమిస్తుంది. ఆ సహోదరులు తమ బాధ్యతల్ని గంభీరంగా తీసుకుంటారు. వాళ్లు సాహిత్యానికి సంబంధించిన రికార్డులను చక్కగా రాసి పెడుతూ, సంఘానికి అవసరమైనన్ని ప్రచురణలు అందుబాటులో ఉండేలా చూసుకుంటారు.

17 మన జీవం, మన సమయం, మానసిక-శారీరక సామర్థ్యాలు, నైపుణ్యాలు, వస్తుసంపదలు దేవుడిచ్చిన బహుమానాలని గుర్తించి, వాటిని ఆయన సేవలో ఉపయోగించాలని సమర్పిత సేవకులమైన మనం కోరుకుంటాం. (లూకా 17:10; 1 కొరిం. 4:7) మన వనరులన్నిటినీ చక్కగా ఉపయోగించడం ద్వారా, యెహోవాపై మనకున్న అపారమైన ప్రేమను చూపిస్తాం. మనస్ఫూర్తిగా, సంపూర్ణ భక్తితో మనం ఏమి ఇచ్చినా యెహోవా సంతోషిస్తాడని మనకు తెలుసు కాబట్టి, మనకున్న విలువైన వాటితో ఆయన్ని ఘనపరుద్దాం. (సామె. 3:9; మార్కు 14:3-9; లూకా 21:1-4; కొలొ. 3:23, 24) “మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి” అని యేసు చెప్పాడు. (మత్త. 10:8) మనల్ని, మన వనరుల్ని యెహోవా సేవలో ఉపయోగించినప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది.—అపొ. 20:35.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి