సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు బ్రోషుర్ను ప్రతిపాదించడం
◼ “చాలామంది సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించడానికి, ఒక ఆధారపడదగిన మార్గనిర్దేశాన్నిచ్చే పుస్తకం అవసరమని భావిస్తుంటారు. మీరు కూడా అలాగే భావిస్తున్నారా? (ప్రతిస్పందించనివ్వండి.) సంతోషకరమైన వార్త ఏమిటంటే ఆధారపడదగిన, కాల పరీక్షకు నిలబడిన మార్గనిర్దేశాన్నిచ్చే పుస్తకం అందుబాటులోనే ఉంది. ఆ మార్గనిర్దేశక పుస్తకం నుండే కొంత భాగాన్ని చదవాలని నేను ఇష్టపడుతున్నాను. (కీర్తన 32:8 చదవండి.) మీరు ఏ మతానికి చెందిన వారైనా, అలాంటి పుస్తకం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడరా?” 3వ అధ్యాయం శీర్షికను నొక్కిచెప్పి బ్రోషుర్ను ప్రతిపాదించండి.
◼ “మన కాలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య సమస్యలకు ఒత్తిడే పెద్ద కారణమనే విషయాన్ని మీరు అంగీకరించరా? (ప్రతిస్పందన కోసం ఆగండి.) సానుకూల వైఖరిని అవలంబించుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చనే ఈ సలహాను గమనించండి. (సామెతలు 12:25 చదవండి.) ఈ బ్రోషుర్ సంతృప్తికరమైన జీవితానికి కావలసిన చక్కని సలహాలు ఇస్తుంది.” రెండవ అధ్యాయంలోని చిత్రాలు, వాటిక్రింద ఉన్న వ్యాఖ్యానాల గురించి నొక్కిచెప్పండి.
◼ “ప్రజలు సంతృప్తికరమైన జీవితం అనుభవించడానికి పరలోకానికి వెళ్ళాలని ఎక్కువగా భావిస్తుంటారు. కానీ అలాంటి జీవితం భూమ్మీదే సాధ్యమైతే మీరు ఇష్టపడతారా? (ప్రతిస్పందించనివ్వండి.) బైబిలు భూమ్మీద సంతృప్తికరమైన నిరంతర జీవితం సాధ్యమే అనే హామీ ఇస్తూ, మనం దానిని ఎలా సంపాదించుకోవచ్చో తెలియజేస్తోంది. (యెషయా 65:17, యోహాను 17:3 చదవండి.) మీరు అలాంటి జీవితాన్ని అనుభవించాలంటే ఏమి చేయాలో ఈ ప్రచురణ వివరిస్తుంది.” 31వ పేజీలోని చిత్రాన్ని వివరించండి.
◼ “ఈ రోజుల్లో అప్పులు దొరకడం చాలా సులభమవుతోంది, దాని కారణంగా చాలా కుటుంబాలు భారీ అప్పుల్లో కూరుకుపోతున్నాయి. మీరు దానికి అంగీకరించరా? (ప్రతిస్పందననివ్వండి.) ఈ జ్ఞానవంతమైన సలహాను వినండి. (1 తిమోతి 6:7-9 చదవండి.) ఈ బ్రోషుర్లో డబ్బును జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తూ, ఆర్థిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో తెలియజేసే దైవిక సలహా ఇవ్వబడింది.” 6వ పేజీలోని 6వ పేరాలోవున్న కొన్ని అంశాలను నొక్కిచెప్పండి.