కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/04 పేజీ 3
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • అణకువ ఎందుకు ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపించవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • కొత్త నియామకానికి ఎలా అలవాటుపడవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 11/04 పేజీ 3

ప్రశ్నా భాగం

◼ సంఘంలో ఇవ్వబడే పనులకు మనం ఎలాంటి శ్రద్ధ చూపించాలి?

ఐక్యతతో కూడిన కృషి మూలంగానే యెహోవా ప్రజల సంఘాలు క్రమబద్ధమైన రీతిలో పనిచేస్తున్నాయి. (1 కొరిం. 14:33, 40) కేవలం ఒక్క సంఘ కూటానికి సంబంధించి ఏయే విషయాల్లో శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మామూలు కార్యక్రమంతోపాటు కూటానికి ముందు, కూటానికి తర్వాత సహోదర, సహోదరీలు చేయవలసిన పనులు చాలా ఉంటాయి. వేరేవారి దృష్టికిరాని ఇతర బాధ్యతల విషయంలో కూడా శ్రద్ధ చూపించడం ప్రాముఖ్యం. మనలో ప్రతి ఒక్కరం ఈ ఏర్పాటుకు ఎలా తోడ్పడవచ్చు?

మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోండి. ఇష్టపూర్వకంగా పని చేయాలనుకునేవారికి ఎన్నో పనులు కనిపిస్తాయి. (కీర్త. 110:3) అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో, వయసు పైబడినవారి విషయంలో శ్రద్ధ చూపించండి. రాజ్య మందిరాన్ని శుభ్రం చేయడంలో సహాయం చేయండి. ప్రత్యేకంగా అడగకపోయినా మనం ఏన్నో ప్రయోజనకరమైన పనులు చేయవచ్చు. మనకు కేవలం సహాయం చేయాలనే కోరిక ఉంటే చాలు.

నమ్రతతో సేవ చేయండి: నమ్రత లేదా వినయంగల ప్రజలు ఇతరులకు సేవ చేయడంలో సంతోషిస్తారు. (లూకా 9:48) నమ్రత మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ బాధ్యతలు తీసుకోకుండా నివారిస్తుంది. అంతేకాక నమ్రత మనం మన అధికార పరిమితులను దాటకుండా కాపాడుతుంది.​—సామె. 11:2.

నమ్మదగినవారిగా ఉండండి. ప్రాచీన ఇశ్రాయేలులో అధికార బాధ్యతలను నిర్వర్తించడానికి “సత్యాసక్తి కలిగినవారిని” అంటే ‘నమ్మదగినవారిని’ ఎన్నుకోవాలని మోషే ప్రోత్సహించబడ్డాడు. (నిర్గ. 18:21) ఇప్పుడు కూడా మనకు అదే లక్షణం అవసరం. మీకు అప్పగించబడిన ప్రతీ పనిని జాగ్రత్తగా శ్రద్ధతో చేయండి. (లూకా 16:10) మీకు అప్పగించిన పనిని మీరు చేయలేని స్థితిలో ఉన్నట్లయితే, దానిని వేరే ఎవరైనా చేసేలా సరైన ఏర్పాట్లు చేయండి.

శక్తివంచన లేకుండా చేయండి. క్రైస్తవులు లౌకిక విషయాల్లో కూడా పూర్ణాత్మతో పని చేయాలని బోధించబడ్డారు. (కొలొ. 3:22-24) సత్యారాధన పురోభివృద్ధి కోసం అలా పూర్ణాత్మతో పనిచేయడానికి మనకు మరింత గొప్ప కారణమే ఉంది. మనం చేయవలసిన పని చిన్నదని లేదా అంత ముఖ్యమైనది కాదని అనిపించినా సరే దాన్ని సరైన రీతిలో చేస్తే సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది.

మనకు ఇవ్వబడిన ప్రతీ పని యెహోవాపట్ల, మన సహోదరులపట్ల మన ప్రేమను ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. (మత్త. 22:37-39) మనకు ఎటువంటి పనులు అప్పగించినా వాటిని నమ్మకంగా శ్రద్ధతో చేద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి