ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరులో: సంతృప్తికరమైన జీవితం బ్రోషుర్. ఇది లభ్యం కాకపోతే, నా బైబిలు కథల పుస్తకము లేదా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. లేదా దానికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి. జనవరిలో: పసుపుపచ్చగా మారే లేక రంగు వెలిసిపోయే పేపరుపై ముద్రించబడిన 192 పేజీల పుస్తకాలు ఏవైనా లేదా 1990కి ముందు ప్రచురించబడిన పుస్తకాలేవైనా ప్రతిపాదించవచ్చు. అలాంటి పాత పుస్తకాలు స్టాకులేని సంఘాలు దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకాలను ప్రతిపాదించవచ్చు.
◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వ్యక్తి డిసెంబరు 1వ తారీఖున లేదా ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘ అకౌంట్స్‌ను ఆడిట్ చేయాలి. ఆడిట్ పూర్తవగానే తరువాతి అకౌంట్సు రిపోర్టుతో పాటు దానిని చదవాలి.
◼ సంఘ పైవిచారణకర్తల, కార్యదర్శులందరి చిరునామాలనూ టెలిఫోన్ నంబర్లనూ బ్రాంచి కార్యాలయం తాజాగా నమోదు చేసుకోవాలి. కాబట్టి చిరునామా లేదా టెలిఫోన్ నంబరు మారినట్లయితే సంఘ సేవా కమిటీ, ప్రిసైడింగ్ ఓవర్‌సీర్/సెక్రటరీ చేంజ్ ఆఫ్ అడ్రస్ (S-29) ఫారమ్‌ను పూరించి, సంతకం చేసి వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. టెలిఫోన్ ఎస్‌టిడి కోడ్‌లు మారితే వాటిని కూడా తెలియజేయాలి.
◼ 2004 నవంబరు 12-14 తేదీల్లో పూనేలో జరగనున్న జిల్లా సమావేశంలో బధిరుల కోసం సంజ్ఞా భాషలో కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయబడుతున్నాయి.
◼ 2004 డిసెంబరు 24-26 తేదీల్లో మధురైలో జరగనున్న సమావేశ హాలు చిరునామా మారిందని గమనించండి: Devasagayam Higher Matriculation School Grounds, Pasumalai, Madurai 625 004.
◼ 2004 నవంబరు 12-14 తేదీల్లో పోర్ట్ బ్లయర్‌లో జరగనున్న సమావేశ హాలు చిరునామా మారిందని గమనించండి: Andaman Tamizhar Sangam, Phoenix Bay, Port Blair.
◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:
యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు—ఆంగ్లం, నేపాలీ
రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? —తమిళం, మలయాళం
జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?—గుజరాతీ, పంజాబీ
బైబిలు చర్చనీయాంశాలు (రివైజ్డ్)—తెలుగు, బెంగాలీ
పరదైసుకు నడిపే మార్గాన్ని కనుగొనడమెలా (ముస్లిమ్‌లకు)—ఉర్దూ
యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారు? (కరపత్రం నం. 14)—అస్సామీ, ఆంగ్లం, ఉర్దూ, ఒరియా, కన్నడ, కొంకణి (కన్నడ లిపి), కొంకణి (రోమన్ లిపి), గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, మణిపురి, మరాఠీ, మలయాళం, మిజో, సింధీ, హిందీ.