కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/04 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఉపశీర్షికలు
  • నవంబరు 8తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 15తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 22తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 29తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 6తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2004
km 11/04 పేజీ 2

సేవా కూటాల పట్టిక

నవంబరు 8తో ప్రారంభమయ్యే వారం

పాట 5 (46)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: “తృప్తికరమైన జీవితం దాన్నెలా సాధించవచ్చు బ్రోషుర్‌ను ప్రతిపాదించడం.” ఈ ప్రచురణలో తాము ఇష్టపడే అంశాల గురించి వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. సూచించబడిన ప్రతిపాదనలను సమీక్షించండి. బ్రోషుర్‌ను ఎలా ప్రతిపాదించాలో క్లుప్తంగా ప్రదర్శించండి. మీ ప్రాంతంలో వేరే పద్ధతి సమర్థవంతంగా ఉంటే, దానిని చర్చించి ప్రదర్శించవచ్చు.

20 నిమి: “అత్యవసర భావంతో ఉండండి!”a కావలికోట జనవరి 15, 2000, 12-13 పేజీలలోని వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 4 (43), ముగింపు ప్రార్థన.

నవంబరు 15తో ప్రారంభమయ్యే వారం

పాట 21 (191)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 4వ పేజీలోని ప్రతిపాదనలు మీ సంఘ క్షేత్రానికి ఆచరణాత్మకంగా ఉంటే వాటిని ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను (పత్రిక ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది), నవంబరు 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఇతర ఆచరణాత్మక ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు.

15 నిమి: ఇవ్వడం నుండి వచ్చే ఆనందాన్ని మీరు చవిచూశారా? కావలికోట నవంబరు 1, 2004, 19-23 పేజీల ఆధారంగా ప్రసంగం.

20 నిమి: వ్యక్తిగత, కుటుంబ అధ్యయనంలో ఇండెక్స్‌ను ఉపయోగించడం. పెద్ద ఇచ్చే ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. యెహోవా తన వాక్యం ద్వారా, తన సంస్థ ద్వారా ఎంతో అమూల్యమైన మార్గనిర్దేశాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు. అలాంటి సమాచారాన్ని కనుగొనడానికి మనకు ఉపయోగపడే ప్రధానమైన ఉపకరణం వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌. పిల్లల నుండి తాతబామ్మల వరకు, కొత్తగా బాప్తిస్మం పొందిన వారి నుండి సంఘ పెద్దల వరకు అందరూ ఎలాంటి ప్రయోజనకరమైన విషయం గురించైనా అవసరమైన రెఫరెన్సులను అందులో కనుగొనవచ్చు. (1 తిమో. 3:15) ఒక సంఘ పెద్ద, పరిచర్య సేవకుడు, కాపరి సందర్శనానికి సిద్ధపడేందుకు ఇండెక్స్‌ను ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శించండి. ప్రచారకులు నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రసంగ నియామకాలకు సిద్ధపడడానికి, వారపు బైబిలు పఠనాన్ని మెరుగుపరచుకోవడానికి కావలసిన లేఖనాధారిత సమాచారాన్ని కనుగొనడానికి ఇండెక్స్‌ను ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి. సంఘాలకు ఇటీవల అందిన పరిశోధనాత్మక ప్రచురణలను పూర్తిగా ఉపయోగించమని ప్రోత్సహించండి.

పాట 9 (37), ముగింపు ప్రార్థన.

నవంబరు 22తో ప్రారంభమయ్యే వారం

పాట 11 (85)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

10 నిమి: స్థానిక అవసరాలు.

25 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం​—⁠3వ భాగం.”b ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. 3వ పేరా చర్చించిన తరువాత, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లో 5వ పాఠంలోని 1వ పేరాను చర్చిస్తూ బైబిలు అధ్యయనం చేస్తున్నట్లు ఒక క్లుప్త ప్రదర్శనను చూపించండి. పేరా ముందే చదవబడింది, అడిగిన ప్రశ్నకు జవాబు కూడా చెప్పబడింది. అధ్యయన నిర్వాహకుడు, విద్యార్థి యెషయా 45:​1, ప్రసంగి 1:4లను చదివి, చర్చిస్తారు. పరిశీలించబడుతున్న అంశానికి ఆ లేఖనాలకున్న సంబంధాన్ని వివరించేలా విద్యార్థిని ప్రేరేపించడానికి నిర్వాహకుడు సరళమైన ప్రశ్నలు అడుగుతాడు.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

నవంబరు 29తో ప్రారంభమయ్యే వారం

పాట 29 (222)

10 నిమి: స్థానిక ప్రకటనలు. నవంబరు క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను (పత్రిక ప్రతిపాదన కాలమ్‌లో మూడవది), డిసెంబరు 1, కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి: ప్రశ్నా భాగం. పెద్ద ఇచ్చే ప్రసంగం.

20 నిమి: తృప్తికరమైన జీవితం బ్రోషుర్‌ను ఉపయోగించి ఆసక్తిని వృద్ధి చేయండి. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. సేవా పైవిచారణకర్త నిర్వర్తించాలి. ఈ బ్రోషుర్‌ను ప్రతిపాదించేటప్పుడు ఎదురైన ఒకటి లేక రెండు విశేషమైన అనుభవాలను తెలిపేందుకు ముందుగా ఏర్పాటు చేసుకోండి. 2వ పేజీలో ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తూ దాంట్లోని అంశాలను క్లుప్తంగా సమీక్షించండి, పునర్దర్శనాలలో చర్చకు ఉపయోగపడగల అంశాలను నొక్కిచెప్పండి. ఒక పునర్దర్శనాన్ని ప్రదర్శించండి. పేర్కొనబడిన ఒకటి లేక రెండు లేఖనాలను చదివి, చర్చించండి. కొన్ని పునర్దర్శనాల తరువాత దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను లేదా జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించవచ్చు.

పాట 20 (93), ముగింపు ప్రార్థన.

డిసెంబరు 6తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరులో ప్రతిపాదించవలసిన సాహిత్యాలను ప్రస్తావించండి. మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడగల ఒకటి లేక రెండు ప్రతిపాదనలను ప్రదర్శించండి.

20 నిమి: “మీరు చేయూతను ఇవ్వగలరా?”c ఇతరుల ద్వారా పొందిన సహాయానికి లేక ప్రోత్సాహానికి కృతజ్ఞత చూపిన ఒకరు లేదా ఇద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి.

25 నిమి: సేవా కూటం నుండి పూర్తి ప్రయోజనం పొందండి. మన పరిచర్య పుస్తకం 71-2 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. మనం క్రైస్తవ ప్రచారకులుగా అభివృద్ధి చెందడానికి సేవా కూటం సహాయం చేసే ఐదు రంగాలు ఏవి? గత నెల కార్యక్రమంలో నుండి ఉదాహరణలను పేర్కొనండి. ముందుగా సిద్ధపడడంలో ఉన్న ప్రయోజనం ఏమిటి? క్రమంగా ఎందుకు హాజరు కావాలి? ఈ కూటానికి లేఖన నమూనా ఏదైనా ఉందా?

పాట 28 (224), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి