ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి కనబరచిన చోట, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను పరిచయం చేసి, గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే లక్ష్యంతో పునర్దర్శనాలు చేయండి. నవంబరులో: సంతృప్తికరమైన జీవితం బ్రోషుర్. ఇది మీ భాషలో లేకపోతే, నా బైబిలు కథల పుస్తకము లేదా మహాగొప్ప మనిషి పుస్తకాలను ప్రతిపాదించండి. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని అందజేయండి. లేదా దానికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే వాటితోపాటు ఇతర పుస్తకాలు ఉపయోగించండి. జనవరిలో: 192 పేజీల పాతపుస్తకాలేవైనా లేదా 1990కి ముందు ప్రచురించబడిన పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. అలాంటి పుస్తకాలు తమ దగ్గర స్టాకులేని సంఘాలు దేవుని కోసం మానవాళి అన్వేషణ (ఆంగ్లం) లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకాలను ప్రతిపాదించవచ్చు.
◼ మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలోని మధ్య పేజీల్లో, “2005వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” ఉంది, సమాచార నిర్దేశం కోసం దీనిని 2005వ సంవత్సరమంతా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
◼ సాహిత్యాలను పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసే రిక్వెస్ట్‌లను బ్రాంచి కార్యాలయం అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను బ్రాంచికి పంపించే ముందు ప్రతి నెలా దాని గురించి సంఘంలో ప్రకటన చేయబడేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావలసిన సాహిత్యాలను తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల బాధ్యతను నిర్వహిస్తున్న సహోదరునికి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్ రిక్వెస్ట్ ఐటమ్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.
◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
యెహోవాకు స్తుతిగీతాలు పాడండి—పదకూర్పు మాత్రమే—మలయాళం
పదకూర్పు మాత్రమేవున్న (Ssbly) పాటల పుస్తకం సంగీత చిహ్నాలు లేని చిన్న సైజు పుస్తకం. ఈ కొత్త పుస్తకం అందుబాటులోకి వచ్చిన కారణంగా, మలయాళంలో పాటల పుస్తకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లన్నీ రద్దు చేయబడ్డాయి. సంఘాలు కొత్త ఆర్డర్లు పంపవలసిందిగా కోరబడుతున్నాయి.
◼ మళ్లీ లభ్యమయ్యే ప్రచురణలు:
నిత్యజీవానికి నడిపించే జ్ఞానము—తెలుగు, మలయాళం, హిందీ
దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?—ఆంగ్లం, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ