దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2004 అక్టోబరు 25వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2004 సెప్టెంబరు 6 నుండి అక్టోబరు 25 మధ్య వారాల్లోని నియామకాల ద్వారా అందించబడిన సమాచారం ఆధారంగా 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. మన క్రైస్తవ కార్యకలాపపు ఒక పార్శ్వం గురించి ప్రసంగించేటప్పుడు మన స్వరాన్ని అనుకూలంగా ఎలా ధ్వనింపజేయవచ్చు? [be 203వ పేజీ, 3-4 పేరాలు]
2. మళ్లీ చెప్పడం ఎందుకు ప్రాముఖ్యం? [be 206వ పేజీ, 1-4 పేరాలు]
3. మన ప్రసంగాల చర్చాంశాన్ని మనమెలా నొక్కిచెప్పవచ్చు? [be 210వ పేజీ, 1-5 పేరాలు, బాక్సు]
4. మనకు నియమించబడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఏమిటో మనమెలా నిర్ణయించుకోవచ్చు? [be 212వ పేజీ, 1-4 పేరాలు]
5. మరీ ఎక్కువ ముఖ్యాంశాలు ఉండకుండా మనమెందుకు జాగ్రత్తపడాలి? [be 213వ పేజీ, 3-5 పేరాలు]
ఒకటవ నియామకం
6. తమచుట్టూన్న ప్రతీది నాశనం కాబోతుందని ప్రజలు నమ్మడానికి కష్టమయ్యే ఎలాంటి పరిస్థితులు జలప్రళయానికి ముందు నెలకొన్నాయి? [w02 3/1 5-6 పేజీలు]
7. యేసు సమకాలీనులు ఆయనను “స్వస్థపరిచేవాడు” అని కాక “బోధకుడు” అనే పిలవడం ఎందుకు గమనార్హమైనది? (లూకా 3:12; 7:40) [w02 5/1 4వ పేజీ, 3వ పేరా; 6వ పేజీ, 5వ పేరా]
8. క్షేత్ర పరిచర్యలో పూర్తిగా భాగం వహించడం యొక్క విలువను సామెతలు 11:24, 25 ఎలా నొక్కిచెబుతోంది? [w02 7/15 30వ పేజీ, 2-4 పేరాలు]
9. ఏదెనులో జరిగిన తిరుగుబాటువల్ల ఏ నైతిక వివాదాంశం తలెత్తింది, ఆ తిరుగుబాటు ఫలితాలేమిటి? (ఆది. 3:1-6) [w02 10/1 6వ పేజీ, 1-3 పేరాలు]
10. యెరూషలేములో సత్యారాధన పునరుద్ధరించబడిన తేదీ ఎలా నిర్ధారించబడింది? [si 285వ పేజీ, 5వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. బాలాకు మనుష్యులతో కూడా వెళ్లమని యెహోవాయే బిలాముతో చెప్పాడు కదా, మరి బిలాము వాళ్లతో వెళ్లినప్పుడు ఆయనెందుకు కోపగించుకున్నాడు? (సంఖ్యా. 22:20-22)
12. ఒక క్రైస్తవ స్త్రీ మొక్కుబళ్లను ఆమె భర్త కొట్టివేసే అవకాశముందా? (సంఖ్యా. 30:6-8)
13. “ఆశ్రయపురములు” నేడు దేనికి ప్రతీకగా ఉన్నాయి? (సంఖ్యా. 35:6) [w95 11/15 17వ పేజీ, 8వ పేరా]
14. ‘దేవుని ధర్మశాస్త్రాన్ని చేతికి కట్టుకోవాలి, కన్నుల నడుమ బాసికమువలె ధరించాలి’ అని ద్వితీయోపదేశకాండము 6:6-9 లో ఇవ్వబడిన ఆజ్ఞను అక్షరార్థంగా తీసుకోవాలా?
15. “నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు” అనే మాట ఇశ్రాయేలీయులకు ఎప్పటికప్పుడు వేరే బట్టలు సమకూర్చబడ్డాయనే భావమిస్తోందా? (ద్వితీ. 8:4)