2005వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక
సూచనలు
2005వ సంవత్సరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించేటప్పుడు ఈ క్రింది ఏర్పాట్లు ఉంటాయి.
సమాచారానికి మూలాధారాలు: పరిశుద్ధ గ్రంథము [O.V.], కావలికోట [w], దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి [be], అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి [wt], “చర్చనీయ బైబిలు అంశాలు” [td-TU]
పాట, ప్రార్థన, క్లుప్తమైన ఆహ్వానపు మాటలతో పాఠశాలను సరిగ్గా సమయానికి ప్రారంభించి ఈ క్రింది విధానాన్ని పాటించాలి:
ప్రసంగ లక్షణం: 5 నిమిషాలు. పాఠశాల పైవిచారణకర్త, సహాయక సలహాదారుడు లేదా అర్హతగల మరో పెద్ద పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకం ఆధారంగా ఒక ప్రసంగ లక్షణంపై చర్చిస్తాడు. (పెద్దలు తక్కువగా ఉన్న సంఘాల్లో అర్హత గల పరిచర్య సేవకుణ్ణి ఉపయోగించుకోవచ్చు.) ప్రత్యేకంగా సూచించనట్లయితే నియమిత పేజీల్లో కనబడే బాక్సుల్లోని సమాచారాన్ని కూడా చర్చలో చేర్చాలి. అభ్యాసాలను చేర్చకూడదు. అవి ప్రధానంగా వ్యక్తిగత ఉపయోగం కోసం, వ్యక్తిగతంగా సలహా ఇవ్వడానికి మాత్రమే.
నియామకం నం. 1: 10 నిమిషాలు. ఇది ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహించాలి. ఈ ప్రసంగం కావలికోట, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి లేదా అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని మౌఖిక పునఃసమీక్ష లేకుండా పది నిమిషాల ఉపదేశ ప్రసంగంలా ఇవ్వాలి. సమాచారంలోని అన్ని అంశాలను చర్చించాలి కానీ అదే సమయంలో, చర్చించబడుతున్న సమాచారంలో సంఘానికి బాగా ఉపయోగపడే విషయాలను నొక్కిచెబుతూ సమాచారపు ఆచరణాత్మక విలువపై దృష్టి సారించాలి. ఇవ్వబడిన ప్రసంగాంశాన్ని ఉపయోగించాలి. ఈ ప్రసంగానికి నియమించబడిన సహోదరులు నిర్ణీత సమయంలో ముగించేలా జాగ్రత్తపడతారని ఆశించబడుతోంది. సలహా ఇవ్వవలసిన అవసరముంటే వ్యక్తిగతంగా ఇవ్వవచ్చు.
బైబిలు పఠనంలోని ఉన్నతాంశాలు: 10 నిమిషాలు. మొదటి ఆరు నిమిషాలు, అర్హతగల ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు సమాచారాన్ని స్థానిక అవసరాలకు తగినట్లు సమర్థవంతంగా అన్వయింపజేయాలి. ఆ వారం బైబిలు పఠనానికి నియమించబడిన భాగంలోని ఏ భాగంపైనైనా ఆయన వ్యాఖ్యానించవచ్చు. అయితే ఇది నియమిత పఠన భాగంలోని సమాచారాన్ని సంక్షిప్తంగా చెప్పినట్లు మాత్రం ఉండకూడదు. ఈ సమాచారం ఎందుకు, ఏ విధంగా విలువైనదో ప్రేక్షకులు గ్రహించడానికి సహాయం చేయాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. ప్రారంభపు భాగానికి కేటాయించబడిన ఆరు నిమిషాలకు మించకుండా ప్రసంగీకుడు జాగ్రత్తపడాలి. ప్రేక్షకులు భాగం వహించేందుకు నాలుగు నిమిషాలు ఉండేలా చూసుకోవాలి. బైబిలు పఠనంలో ఏమి గ్రహించారో, దాని ప్రయోజనాలేమిటో క్లుప్తంగా (30 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలో) చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించాలి. ఆ తర్వాత పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులను నియమించబడిన ఇతర తరగతి గదులకు పంపిస్తాడు.
నియామకం నం. 2: 4 నిమిషాలు. ఇది ఒక సహోదరుడు చదవాల్సిన భాగం. ఇది సాధారణంగా బైబిలు నుండే ఉంటుంది. ఈ నియామకంలో నెలకు ఒకసారి కావలికోటలోని సమాచారం ఉంటుంది. విద్యార్థి పరిచయ మాటలు లేక ముగింపు మాటలు ఏమీ చెప్పకుండా నియమిత సమాచారాన్ని చదవాలి. వారం వారం చదివే సమాచారం కాస్త ఎక్కువ తక్కువ ఉండవచ్చు కానీ దీనికి నాలుగు నిమిషాలు లేదా అంతకంటే కాస్త తక్కువ సమయం సరిపోతుంది. పాఠశాల పైవిచారణకర్త నియామకాలు ఇవ్వడానికి ముందే సమాచారాన్ని చదివి విద్యార్థుల వయస్సును, సామర్థ్యాన్ని బట్టి ఏ సమాచారం ఏ విద్యార్థికి సరిపోతుందో చూసి ఇవ్వాలి. పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులు అవగాహనతో, అనర్గళంగా, భావాన్ని సరిగ్గా నొక్కి చెబుతూ, స్వరభేదంతో, సరైన చోట ఆగుతూ, సహజత్వంతో చదివేందుకు సహాయపడడంలో ముఖ్యంగా శ్రద్ధచూపిస్తాడు.
నియామకం నం. 3: 5 నిమిషాలు. ఇది ఒక సహోదరికి నియమించబడుతుంది. ఈ నియామకాన్ని పొందే విద్యార్థినులకు పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకంలో 82వ పేజీలోనున్న పట్టిక నుండి ఒక సన్నివేశం నియమించబడుతుంది లేదా వారే అందులో నుండి ఒక సన్నివేశాన్ని ఎంపిక చేసుకోవాలి. విద్యార్థిని తనకివ్వబడిన ప్రసంగాంశాన్నే ఉపయోగిస్తూ ఆ అంశాన్ని స్థానిక సంఘ ప్రాంతానికి వాస్తవికంగాను ఆచరణాత్మకంగాను ఉండేలా క్షేత్ర సేవలోని ఒక విధానానికి అన్వయింపజేయాలి. సమాచారానికి మూలాధారం ఏమీ సూచించనప్పుడు, విద్యార్థిని ఈ భాగానికి సంబంధించిన సమాచారాన్ని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందించిన ప్రచురణల్లో పరిశోధన చేసి సేకరించుకోవాలి. కొత్త విద్యార్థులకు రెఫరెన్సులున్న నియామకాలే ఇవ్వాలి. పాఠశాల పైవిచారణకర్త, విద్యార్థిని సమాచారాన్ని విపులీకరించే విధానంపైనా, తన సహాయకురాలికి లేఖనాలపై తర్కించడంలోనూ, అందించబడుతున్న సమాచారంలోని కీలకాంశాలను అర్థం చేసుకోవడంలోనూ ఆమె సహాయపడే విధానంపైనా ముఖ్యంగా శ్రద్ధచూపిస్తాడు. ఈ భాగానికి నియమించబడే విద్యార్థినులు చదవగలగాలి. పైవిచారణకర్త ఒక సహాయకురాలిని నియమిస్తాడు.
నియామకం నం. 4: 5 నిమిషాలు. నియమించబడిన ప్రసంగాంశాన్ని విద్యార్థి విపులీకరించాలి. సమాచారానికి మూలాధారం ఏమీ సూచించనప్పుడు, విద్యార్థి ఈ భాగానికి సంబంధించిన సమాచారాన్ని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందించిన ప్రచురణల్లో పరిశోధన చేసి సేకరించుకోవాలి. ఈ భాగానికి ఒక సహోదరుడు నియమించబడినప్పుడు రాజ్య మందిరంలోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రసంగంలా ఇవ్వాలి. సహోదరి నియమించబడినప్పుడు దీన్ని నియామకం నం. 3కు ఇవ్వబడిన సూచనల ప్రకారం ఇవ్వాలి. నియామకం నం. 4 సహోదరునికి ఇవ్వడం సముచితమని పాఠశాల పైవిచారణకర్త భావించినప్పుడు అలా ఇవ్వవచ్చు. నక్షత్ర చిహ్నాలున్న అంశాలను ప్రసంగించేందుకు సహోదరులను మాత్రమే నియమించాలని దయచేసి గమనించండి.
సమయపాలన: ఏ ప్రసంగమైనా, సలహాదారుని సలహాలైనా నియమిత సమయాన్ని మించకూడదు. నియామకం నం. 2 నుండి 4 వరకు, సమయం ముగిసిన వెంటనే నేర్పుగా ఆపివేయాలి. ప్రసంగ లక్షణంపై ఇవ్వబడే ప్రారంభ ప్రసంగం, నియామకం నం. 1 లేదా బైబిలు పఠనంలోని ఉన్నతాంశాలు చేస్తున్న సహోదరులు ఎక్కువ సమయం తీసుకుంటే వారికి వ్యక్తిగతంగా సలహా ఇవ్వాలి. అందరూ తమ తమ సమయాన్ని జాగ్రత్తగా పాటించాలి. మొత్తం కార్యక్రమం: పాట మరియు ప్రార్థన మినహాయించి 45 నిమిషాలు.
సలహా: 1 నిమిషం. ప్రతి విద్యార్థి ప్రసంగించిన తర్వాత అందులో తను గమనించిన ప్రశంసనీయమైన ఒక అంశంపై నిర్మాణాత్మకంగా వ్యాఖ్యానించడానికి పాఠశాల పైవిచారణకర్త ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు. కేవలం “చాలా బాగా చేశారు” అని ప్రశంసించడం మాత్రమే లక్ష్యంగా కాకుండా, ఆ ప్రసంగంలోని ఒక అంశం ఎందుకు సమర్థవంతంగా ఉందో తెలియజేసే నిర్దిష్ట కారణాలపై దృష్టి సారించాలి. ప్రతి విద్యార్థి అవసరాన్ని బట్టి, నిర్మాణాత్మకమైన అదనపు సలహాను కూటం తర్వాత లేదా వేరే సమయంలో ఇవ్వవచ్చు.
సహాయక సలహాదారుడు: పాఠశాల పైవిచారణకర్త కాక సమర్థుడైన మరొక పెద్ద ఉంటే ఆయనను సహాయక సలహాదారునిగా పెద్దల సభ ఎంపిక చేయవచ్చు. ఒకవేళ సంఘంలో చాలామంది పెద్దలుంటే, ఈ నియామకాన్ని ప్రతి సంవత్సరం అర్హుడైన ఒక్కో పెద్ద నిర్వహించవచ్చు. నియామకం నం. 1, బైబిలు ఉన్నతాంశాలను అందించే సహోదరులకు అవసరమైనప్పుడు విడిగా సలహా ఇవ్వడం సహాయ సలహాదారుని బాధ్యత. అయితే తన తోటి పెద్దలు లేదా పరిచర్య సేవకులు ఇచ్చిన ప్రతి ప్రసంగం తర్వాత సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏర్పాటు 2005 సంవత్సరమంతా వర్తిస్తుంది, ఆ తర్వాత మార్పులు చేసే అవకాశముంది.
సలహా పత్రం: పాఠ్య పుస్తకంలో ఉంది.
మౌఖిక పునఃసమీక్ష: 30 నిమిషాలు. ప్రతి రెండు నెలలకు పాఠశాల పైవిచారణకర్త మౌఖిక పునఃసమీక్షను నిర్వహిస్తాడు. పైన పేర్కొన్న విధంగా ప్రసంగ లక్షణంపై చర్చ, బైబిలు ఉన్నతాంశాలు అయిన తర్వాత ఇది నిర్వహించబడుతుంది. మౌఖిక పునఃసమీక్ష ఆ వారంతో పాటు అంతకు ముందు రెండు నెలలపాటు పరిశీలించబడిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. మౌఖిక పునఃసమీక్ష జరిగే వారంలో మీ సంఘానికి ప్రాంతీయ సమావేశం లేదా ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం ఉంటే, డిసెంబరు 2003, మన రాజ్య పరిచర్య 4వ పేజీలో ఇవ్వబడిన షెడ్యూలు సూచనలు అనుసరించండి.
పట్టిక
జన. 3 బైబిలు పఠనం: యెహోషువ 16-20 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: ఇతరులకు అర్థమయ్యేలా ఉండడం (be 226వ పేజీ, 1వ పేరా-227వ పేజీ, 1వ పేరా)
నం. 1: సత్య దేవునికి భయపడండి (be 272వ పేజీ, 1-4 పేరాలు)
నం. 2: యెహోషువ 16:1–17:4
నం. 3: td 32ఎ యేసుక్రీస్తు—దేవుని కుమారుడు, నియమించబడిన రాజు
నం. 4: నేడు ధనవంతులుగా ఉండడం లేదా బీదలుగా ఉండడం నిజమైన భక్తికి సూచనా?
జన. 10 బైబిలు పఠనం: యెహోషువ 21-24 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: పరిచయంలేని పదాలను వివరించడం (be 227వ పేజీ, 2-4పేరాలు)
నం.1: దేవుని నామాన్ని తెలియజేయడం (be 273వ పేజీ, 1-6 పేరాలు)
నం. 2: యెహోషువ 23:1-13
నం. 3: td 32బి రక్షణకు యేసుపై నమ్మకం ఎందుకు ప్రాముఖ్యం?
నం. 4: యేసును ఆరాధించడం సరైనదేనా?
జన. 17 బైబిలు పఠనం: న్యాయాధిపతులు 1-4 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: అవసరమైన వివరణలను ఇవ్వడం (be 228వ పేజీ, 2-3 పేరాలు)
నం. 1: ఆ నామము ధరించిన వ్యక్తి (be 274వ పేజీ, 1-4 పేరాలు)
నం. 2: న్యాయాధిపతులు 2:1-10
నం. 3: td 32సి రక్షించబడడానికి యేసుపై విశ్వాసం మాత్రమే సరిపోతుందా?
నం. 4: ప్రమాదకరమైన మ్యూజిక్ వీడియోల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు?
జన. 24 బైబిలు పఠనం: న్యాయాధిపతులు 5-7 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: హృదయం పాత్ర ఏమిటి? (be 228వ పేజీ, 3-5 పేరాలు)
నం. 1: దేవుని నామము—“బలమైన దుర్గము” (be 274వ పేజీ, 5వ పేరా-275 ఉపశీర్షిక వరకు)
నం. 2: న్యాయాధిపతులు 6:25-35
నం. 3: నిర్ణయాలు తీసుకోవడానికి మనకున్న స్వేచ్ఛను బైబిలు ఎలా ప్రభావితం చేయాలి?
నం. 4: atd 35ఎ దేవుని రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాలు
జన. 31 బైబిలు పఠనం: న్యాయాధిపతులు 8-10 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: మీ ప్రేక్షకులకు సమాచారాన్ని అందించేది (be 230వ పేజీ, 1-6 పేరాలు)
నం. 1: యేసునుగూర్చి సాక్ష్యమివ్వడం (be 275వ పేజీ ఉపశీర్షిక క్రిందున్న నాలుగు పేరాలు)
నం. 2: w03 1/15 19-20 పేజీలు, 16-18 పేరాలు
నం. 3: td 35బి క్రీస్తు విరోధులు ఇంకా ఉండగానే రాజ్య పరిపాలన ఆరంభమవుతుంది
నం. 4: ఐశ్వర్యాసక్తి అంటే కేవలం వస్తు సంపాదనే కాదు
ఫిబ్ర. 7 బైబిలు పఠనం: న్యాయాధిపతులు 11-14 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: పరిశోధన ద్వారా ప్రసంగాన్ని సమాచారం అందించేదిగా చేయడం (be 231వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: విమోచకునిగా యేసు పాత్రను నొక్కిచెప్పడం (be 276వ పేజీ, 1-2 పేరాలు)
నం. 2: న్యాయాధిపతులు 12:1-15
నం. 3: యెహోవాసాక్షులు ఎందుకు ఐకమత్యంతో ఉన్నారు?
నం. 4: td 35సి దేవుని రాజ్యం మానవ ప్రయత్నాలతో రాదు
ఫిబ్ర. 14 బైబిలు పఠనం: న్యాయాధిపతులు 15-18 పాట 17 (187)
ప్రసంగ లక్షణం: లేఖనాలను వివరించడం (be 231వ పేజీ, 4-5 పేరాలు)
నం. 1: ప్రధాన యాజకునిగా, సంఘ శిరస్సుగా యేసు పాత్రను నొక్కి చెప్పడం (be 277వ పేజీ, 1-2 పేరాలు)
నం. 2: న్యాయాధిపతులు 15:9-20
నం. 3: td 1ఎ “లోకాంతము” అంటే ఏమిటి?
నం. 4: హిప్నాటిజమ్ క్రైస్తవులకు ఎందుకు తగనిది?
ఫిబ్ర. 21 బైబిలు పఠనం: న్యాయాధిపతులు 19-21 పాట 8 (53)
ప్రసంగ లక్షణం: పదాల అర్థాలు వివరించడం (be 232వ పేజీ, 1వ పేరా)
నం. 1: పరిపాలిస్తున్న రాజుగా యేసు పాత్రను నొక్కి చెప్పడం (be 277వ పేజీ, 3-4 పేరాలు)
నం. 2: w03 2/1 17-18 పేజీలు, 18-21 పేరాలు
నం. 3: ‘దేవుని మర్మములలో’ కొన్ని ఏమిటి? (1 కొరిం. 2:10)
నం. 4: btd 1బి అంత్యదినాల సూచనల విషయంలో ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండండి
ఫిబ్ర. 28 బైబిలు పఠనం: రూతు 1-4 పాట 25 (204)
ప్రసంగ లక్షణం: వచనాలపై తర్కించడం (be 232వ పేజీ, 2-4 పేరాలు)
మౌఖిక పునఃసమీక్ష
మార్చి 7 బైబిలు పఠనం: 1 సమూయేలు 1-4 పాట 27 (221)
ప్రసంగ లక్షణం: మీ ప్రేక్షకులకు ప్రయోజనమిచ్చే సమాచారాన్ని ఎంచుకోవడం (be 232వ పేజీ 5వ పేరా-233వ పేజీ, 4వ పేరా)
నం. 1: క్రీస్తును పునాదిగా చేసుకోవడం (be 278వ పేజీ, 1-4 పేరాలు)
నం. 2: 1 సమూయేలు 2:1-11
నం. 3: td 10ఎ నిత్యజీవం కేవలం ఒక కల కాదు
నం. 4: నిజ క్రైస్తవులు జాతకచక్రాలను ఎందుకు సంప్రదించరు?
మార్చి 14 బైబిలు పఠనం: 1 సమూయేలు 5-9 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: నియమిత సమాచార వినియోగం (be 234వ పేజీ, 1వ పేరా-235వ పేజీ, 3వ పేరా)
నం. 1: ఈ రాజ్యసువార్త (be 279వ పేజీ, 1-4 పేరాలు)
నం. 2: 1 సమూయేలు 5:1-12
నం. 3: td 10బి పరలోకానికి ఎవరు వెళ్తారు?
నం. 4: యెహోవాతో మన స్నేహాన్ని మనం ఎలా బలపరచుకోవచ్చు?
మార్చి 21 బైబిలు పఠనం: 1 సమూయేలు 10-13 పాట 15 (127)
ప్రసంగ లక్షణం: ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం (be 236వ పేజీ, 1-5 పేరాలు)
నం. 1: రాజ్యమంటే ఏమిటో వివరించడం (be 280వ పేజీ, 1-5 పేరాలు)
నం. 2: 1 సమూయేలు 10:1-12
నం. 3: సాక్షులుకాని తమ ప్రియమైన వారితో క్రైస్తవులు ఎలా వ్యవహరించాలి?
నం. 4: td 10సి భూమ్మీద నిత్యజీవం పొందేవారి సంఖ్య అపరిమితం
మార్చి 28 బైబిలు పఠనం: 1 సమూయేలు 14-15 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: ప్రముఖమైన తలంపులు ప్రవేశపెట్టడానికి ప్రశ్నలు ఉపయోగించడం (be 237వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: రాజ్యం మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించడం (be 281వ పేజీ, 1-4 పేరాలు)
నం. 2: w03 3/15 19-20 పేజీలు, 17-21 పేరాలు
నం. 3: క్రైస్తవులు ఎందుకు పన్నులు చెల్లిస్తారు?
నం. 4: ctd 38ఎ వివాహ బంధం ఘనమైనదిగా ఉండాలి
ఏప్రి. 4 బైబిలు పఠనం: 1 సమూయేలు 16-18 పాట 3 (32)
ప్రసంగ లక్షణం: ఒక విషయంపై తర్కించడానికి ప్రశ్నలు ఉపయోగించడం (be 237వ పేజీ, 3వ పేరా-238వ పేజీ, 2వ పేరా)
నం. 1: క్రైస్తవులకు విద్య ఎందుకు ప్రాముఖ్యం? (w03 3/15 10వ పేజీ, 1వ పేరా-11వ పేజీ, 5వ పేరా)
నం. 2: 1 సమూయేలు 17:41-51
నం. 3: td 38బి శిరస్సత్వ సూత్రాన్ని క్రైస్తవులు గౌరవించాలి
నం. 4: పర్యవసానాల గురించి తలపోయడం మంచిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించడానికి మనకు సహాయం చేయగలదు
ఏప్రి. 11 బైబిలు పఠనం: 1 సమూయేలు 19-22 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: అంతర్గత భావాలను వెలికితీయడానికి ప్రశ్నలు ఉపయోగించడం (be 238వ పేజీ, 3-5 పేరాలు)
నం. 1: యౌవనులు ఆధ్యాత్మిక ప్రగతిని ఎలా సాధించవచ్చు? (w03 4/1 8-10 పేజీలు)
నం. 2: 1 సమూయేలు 20:24-34
నం. 3: నిజమైన అణకువ ఎందుకు ప్రియమైన లక్షణం?
నం. 4: td 38సి పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత
ఏప్రి. 18 బైబిలు పఠనం: 1 సమూయేలు 23-25 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: నొక్కిచెప్పేందుకు ప్రశ్నలు ఉపయోగించడం (be 239వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: మీ పూర్ణ హృదయంతో యెహోవాపై నమ్మకముంచండి (w03 11/1, 4-7 పేజీలు)
నం. 2: w03 5/1, 17వ పేజీ, 11-14 పేరాలు
నం. 3: td 38డి క్రైస్తవులు కేవలం క్రైస్తవులనే వివాహం చేసుకోవాలి
నం. 4: అబ్రాహాముతో ఎందుకు నిబంధన చేయబడింది?
ఏప్రి. 25 బైబిలు పఠనం: 1 సమూయేలు 26-31 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: తప్పుడు ఆలోచనలను బట్టబయలు చేయడానికి ప్రశ్నలు ఉపయోగించడం (be 239వ పేజీ, 3-5 పేరాలు)
మౌఖిక పునఃసమీక్ష
మే 2 బైబిలు పఠనం: 2 సమూయేలు 1-3 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: బోధించే ఉపమాలంకారాలు, రూపకాలంకారాలు (be 240వ పేజీ, 1వ పేరా-241వ పేజీ, 1వ పేరా)
నం. 1: విద్య కేవలం ఉద్యోగం సంపాదించుకోవడానికే కాదు (w03 3/15, 11వ పేజీ, 6వ పేరా-14వ పేజీ 4వ పేరా)
నం. 2: 2 సమూయేలు 2:1-11
నం. 3: నిజాయితీగా ఉండడంలోని అనేక ప్రయోజనాలు
నం. 4: dtd 38ఇ నిజ క్రైస్తవులు బహుభార్యత్వాన్ని పాటించరు
మే 9 బైబిలు పఠనం: 2 సమూయేలు 4-8 పాట 27 (221)
ప్రసంగ లక్షణం: ఉదాహరణలు ఉపయోగించడం (be 241వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: యౌవనులపై యెహోవాకు నిజమైన శ్రద్ధ ఉంది (w03 4/15, 29వ పేజీ, 4వ పేరా-31వ పేజీ 4వ పేరా)
నం. 2: 2 సమూయేలు 5:1-12
నం. 3: ధర్మశాస్త్ర నిబంధన ఏమి సాధించింది?
నం. 4: td 28ఎ మరియ యేసు తల్లి, “దేవుని తల్లి” కాదు
మే 16 బైబిలు పఠనం: 2 సమూయేలు 9-12 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: లేఖనాల్లోని ఉదాహరణలు (be 242వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: మీరు చేసే పనులను యెహోవా గమనిస్తాడా? (w03 5/1, 28-31 పేజీలు)
నం. 2: 2 సమూయేలు 9:1-13
నం. 3: td 28బి మరియ “నిత్య కన్యక” కాదని బైబిలు చూపిస్తోంది
నం. 4: ఏయే విధాలుగా దేవుని వాక్యం సజీవమైనది? (హెబ్రీ. 4:12)
మే 23 బైబిలు పఠనం: 2 సమూయేలు 13-15 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: అది అర్థమవుతుందా? (be 242వ పేజీ, 3వ పేరా–243వ పేజీ, 1వ పేరా)
నం. 1: నోవహు లాగ్‌బుక్ మన జీవితంలో దానికి ప్రాముఖ్యత ఉందా? (w03 3/15, 4-7 పేజీలు)
నం. 2: 2 సమూయేలు 13:10-22
నం. 3: యోహాను 11:25, 26ను మనం ఎలా అర్థం చేసుకోవాలి?
నం. 4: td 11ఎ జ్ఞాపకార్థ ఆచరణ గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయి?
మే 30 బైబిలు పఠనం: 2 సమూయేలు 16-18 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: సుపరిచిత పరిస్థితుల నుండి ఉపమానాలు (be 244వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: సరిగ్గా ఆలోచించండి జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి (w03 7/15, 21-3 పేజీలు)
నం. 2: w03 5/15, 16-17 పేజీలు, 8-11 పేరాలు
నం. 3: td 11బి మాస్ ఆచరించడం లేఖన విరుద్ధం
నం. 4: వినయం ఎందుకు బలహీనత కాదు?
జూన్ 6 బైబిలు పఠనం: 2 సమూయేలు 19-21 పాట 28 (224)
ప్రసంగ లక్షణం: మీ ప్రేక్షకులకు తగిన ఉపమానాలు (be 244వ పేజీ, 3వ పేరా-245వ పేజీ, 4వ పేరా)
నం. 1: క్రమశిక్షణ ఉద్దేశాన్ని గ్రహించడం (w03 10/1, 20వ పేజీ, 1వ పేరా-21వ పేజీ, 5వ పేరా)
నం. 2: 2 సమూయేలు 19:1-10
నం. 3: ఒక క్రైస్తవుడు దేవుని విశ్రాంతిలో ఎలా ప్రవేశించగలడు?
నం. 4: td 16ఎ క్రైస్తవులందరూ పరిచారకులుగా ఉండాలి
జూన్ 13 బైబిలు పఠనం: 2 సమూయేలు 22-24 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: దృశ్య సహాయకాల సమర్థమైన ఉపయోగం (be 247వ పేజీ, 1-2 పేరాలు)
నం. 1: నేర్చుకోవాలనే అభిలాషతో ఉండండి, మీ నాలుకను కాపాడుకోండి (w03 9/15, 21వ పేజీ, 1వ పేరా-22వ పేజీ, 3వ పేరా)
నం. 2: 2 సమూయేలు 24:10-17
నం. 3: ఏయే విధాలుగా ఒక క్రైస్తవుడు లోకం నుండి వేరుగా ఉండాలి?
నం. 4: etd 16బి పరిచర్యకు కావలసిన అర్హతలు
జూన్ 20 బైబిలు పఠనం: 1 రాజులు 1-2 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: దృశ్య సహాయకాలను యేసు ఎలా ఉపయోగించాడు? (be 247వ పేజీ, 3వ పేరా)
నం. 1: సంతృప్తి రహస్యాన్ని తెలుసుకోవడం (w03 6/1, 8-11 పేజీలు)
నం. 2: w03 6/1, 12-13 పేజీలు, 1-4 పేరాలు)
నం. 3: పదవ ఆజ్ఞలో ప్రత్యేకంగా ఏది ప్రాముఖ్యమైనది?
నం. 4: td 40ఎ నిజ క్రైస్తవులు ఎందుకు ద్వేషించబడుతున్నారు?
జూన్ 27 బైబిలు పఠనం: 1 రాజులు 3-6 పాట 26 (212)
ప్రసంగ లక్షణం: దృశ్య సహాయకాలను ఉపయోగించే విధానాలు (be 248వ పేజీ, 1-3 పేరాలు)
మౌఖిక పునఃసమీక్ష
జూలై 4 బైబిలు పఠనం: 1 రాజులు 7-8 పాట 20 (93)
ప్రసంగ లక్షణం: మ్యాపులు, సమావేశ ముద్రిత కార్యక్రమ పట్టికలు, వీడియోలు ఉపయోగించడం (be 248వ పేజీ, 4వ పేరా–249వ పేజీ, 2వ పేరా)
నం. 1: వృద్ధులైన తోటి విశ్వాసులను విలువైనవారిగా ఎంచండి (w03 9/1, 30-1 పేజీలు)
నం. 2: 1 రాజులు 8:1-13
నం. 3: యేసు లోకాన్ని ఎలా జయించాడు?
నం. 4: td 40బి భర్త తనను దేవుని నుండి వేరుచేయడానికి భార్య ఒప్పుకోకూడదు
జూలై 11 బైబిలు పఠనం: 1 రాజులు 9-11 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: పెద్ద సమూహాల కోసం దృశ్య సహాయకాలు ఉపయోగించడం (be 249వ పేజీ, 3వ పేరా–250వ పేజీ, 1వ పేరా)
నం. 1: యేసుక్రీస్తు భూమ్మీద జీవించాడనేందుకు రుజువులు (w03 6/15, 4-7 పేజీలు)
నం. 2: 1 రాజులు 9:1-9
నం. 3: బైబిలు సూత్రాలు పాటించడం ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని అధిగమించవచ్చు
నం. 4: ftd 40సి దేవుణ్ణి సేవించకుండా భార్య తనను అడ్డగించడాన్ని భర్త అనుమతించకూడదు
జూలై 18 బైబిలు పఠనం: 1 రాజులు 12-14 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: తర్కించే విధానం ఎందుకు ప్రాముఖ్యం? (be 251వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: ఆలోచనల నుండి కార్యాలకు, కార్యాల నుండి పర్యవసానాలకు (w03 1/15, 30వ పేజీ, 1-3 పేరాలు)
నం. 2: 1 రాజులు 12:1-11
నం. 3: పరీక్షలను ఎదుర్కోవడానికి విశ్వాసం మనకు ఎలా సహాయం చేయగలదు?
నం. 4: td 22ఎ దేవుడు ఆలకించే ప్రార్థనలు
జూలై 25 బైబిలు పఠనం: 1 రాజులు 15-17 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: ఎక్కడ మొదలుపెట్టాలి (be 251వ పేజీ, 4వ పేరా–252వ పేజీ, 3వ పేరా)
నం. 1: యెహోవా ‘చిత్తమేమిటో గ్రహించడం’ ఎలా? (w03 12/1, 21వ పేజీ, 3వ పేరా-23వ పేజీ, 3వ పేరా)
నం. 2: w03 7/15, 19వ పేజీ, 15-17 పేరాలు
నం. 3: td 22బి కొన్ని ప్రార్థనలు ఎందుకు ఆమోదయోగ్యం కాదు?
నం. 4: పరిశుద్ధాత్మ క్రైస్తవులను ఎలా ఓదారుస్తుంది?
ఆగ. 1 బైబిలు పఠనం: 1 రాజులు 18-20 పాట 1 (13)
ప్రసంగ లక్షణం: ఎప్పుడు విడిచిపెట్టాలి? (be 252వ పేజీ, 4వ పేరా-253వ పేజీ, 2వ పేరా)
నం. 1: యౌవనులారా, యెహోవాకు తగినట్టు నడుచుకోండి (w03 10/15, 23వ పేజీ, 1వ పేరా-24వ పేజీ, 1వ పేరా)
నం. 2: 1 రాజులు 18:1-15
నం. 3: క్రైస్తవులందరూ అధికంగా ఫలించవచ్చు
నం. 4: td 36ఎ మానవుని విధి లిఖించబడలేదు
ఆగ. 8 బైబిలు పఠనం: 1 రాజులు 21-22 పాట 3 (32)
ప్రసంగ లక్షణం: ప్రశ్నలు అడగడం, కారణాలు ఇవ్వడం (be 253వ పేజీ, 3వ పేరా–254వ పేజీ, 2వ పేరా)
నం. 1: పేదరికానికి శాశ్వత పరిష్కారం (w03 8/1, 4-7 పేజీలు)
నం. 2: 1 రాజులు 21:15-26
నం. 3: td 37ఎ యేసు మానవ ప్రాణం అందరికోసం చెల్లించబడిన విమోచన క్రయధనం
నం. 4: మనమెందుకు ధైర్యంగా ఉండాలి, మనం దానిని ఎలా పెంపొందించుకోవచ్చు?
ఆగ. 15 బైబిలు పఠనం: 2 రాజులు 1-4 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: దేవుని వాక్యంపై ఆధారపడిన దృఢమైన వాదనలు (be 255వ పేజీ, 1వ పేరా-256వ పేజీ, 2వ పేరా)
నం. 1: ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి (w03 8/1, 20-2 పేజీలు)
నం. 2: 2 రాజులు 3:1-12
నం. 3: జలప్రళయానికి ముందు ప్రజలు అంత ఎక్కువ కాలం ఎందుకు జీవించారు?
నం. 4: td 37బి యేసు విమోచన క్రయధనం ఎందుకు చెల్లించగలిగాడు?
ఆగ. 22 బైబిలు పఠనం: 2 రాజుల 5-8 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: అదనపు రుజువులతో మద్దతు ఇవ్వండి (be 256వ పేజీ, 3-5 పేరాలు)
నం. 1: ఔచిత్యంతో మెలిగే కళను నేర్చుకోవడం (w03 8/1, 29-31 పేజీలు)
నం. 2: w03 8/1, 19వ పేజీ, 18-22 పేరాలు
నం. 3: td 26ఎ ఒకే సత్య మతాన్ని ఎలా గుర్తించవచ్చు?
నం. 4: యోనాకున్న ఏ మంచి లక్షణాలను మనం అనుకరించాలి?
ఆగ. 29 బైబిలు పఠనం: 2 రాజులు 9-11 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: సరిపడేన్ని రుజువులు చూపించండి (be 256వ పేజీ, 6వ పేరా–257వ పేజీ, 3వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
సెప్టెం. 5 బైబిలు పఠనం: 2 రాజులు 12-15 పాట 26 (212)
ప్రసంగ లక్షణం: హృదయాన్ని స్పృశించేందుకు కృషి చేయడం (be 258వ పేజీ, 1వ పేరా-259వ పేజీ, 1వ పేరా)
నం. 1: మీరు యెహోవాను మనస్ఫూర్తిగా వెదకుతున్నారా? (w03 8/15, 25-8 పేజీలు)
నం. 2: 2 రాజులు 12:1-12
నం. 3: సాత్వికాన్ని ఎందుకు వెంబడించాలి?
నం. 4: td 26బి అబద్ధ బోధలను ఖండించడం తప్పా?
సెప్టెం. 12 బైబిలు పఠనం: 2 రాజులు 16-18 పాట 5 (46)
ప్రసంగ లక్షణం: ప్రజల హృదయంలో ఉన్నది తెలుసుకోవడం (be 259వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: యేసు గురించి ప్రజలేమి గుర్తుంచుకున్నారు? (w03 8/15, 6వ పేజీ, 6వ పేరా-8వ పేజీ 6వ పేరా)
నం. 2: 2 రాజులు 16:10-20
నం. 3: td 26సి మతం మార్చుకోవడాన్ని దేవుడు ఎప్పుడు ఆమోదిస్తాడు?
నం. 4: ప్రభువుకు ఏది అంగీకారమో మనమెలా రూఢీగా తెలుసుకోగలం?
సెప్టెం. 19 బైబిలు పఠనం: 2 రాజులు 19-22 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: ప్రయోజనకరమైన భావాలను ప్రేరేపించడం (be 259వ పేజీ, 5వ పేరా-260వ పేజీ, 1వ పేరా)
నం. 1: “హితవాక్యప్రమాణమును గైకొనుము” (w03 1/1, 29వ పేజీ, 3వ పేరా-30వ పేజీ, 4వ పేరా)
నం. 2: 2 రాజులు 19:20-28
నం. 3: td 26డి “అన్నిమతాల్లో మంచిని” దేవుడు చూస్తాడా?
నం. 4: ప్రాచీన స్ముర్నలోని మన క్రైస్తవ సహోదరుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
సెప్టెం. 26 బైబిలు పఠనం: 2 రాజులు 23-25 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: దైవిక భయాన్ని అలవరచుకోవడానికి ఇతరులకు సహాయం చేయడం (be 260వ పేజీ, 2-3 పేరాలు)
నం. 1: మన కాలంలో ఐక్యారాధన—దాని భావమేమిటి? (wt 5-9, 12, 13 పేజీలు, 1-9, 12-14 పేరాలు)
నం. 2: w03 8/15, 20వ పేజీ, 6-10 పేరాలు
నం. 3: td 19ఎ మృతుల్లో నుండి ఎవరు లేపబడతారు?
నం. 4: భవిష్యత్తు గురించి మనం ఆశాభావంతో ఉన్నాం
అక్టో. 3 బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 1-4 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: మన ప్రవర్తన దేవునికి ప్రాముఖ్యం (be 260వ పేజీ, 4వ పేరా-261వ పేజీ, 1వ పేరా)
నం. 1: ఐక్యతకు ఏ అంశాలు తోడ్పడతాయి? (wt 9-12 పేజీలు, 10, 11 పేరాలు)
నం. 2: 1 దినవృత్తాంతములు 4:24-43
నం. 3: td 19బి మృతులు ఎక్కడికి పునరుత్థానం చేయబడతారు?
నం. 4: యెహోవా మనలను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు
అక్టో. 10 బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 5-7 పాట 8 (53)
ప్రసంగ లక్షణం: ఇతరులు పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయడం (be 261వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: అద్వితీయ సత్య దేవునిగా యెహోవాను ఘనపరచండి—భాగం 1 (wt 15-19 పేజీలు, 1-9 పేరాలు)
నం. 2: 1 దినవృత్తాంతములు 5:18-26
నం. 3: “యెహోవా దినము” గురించి మనకేమి తెలుసు?
నం. 4: td 8ఎ క్రీస్తు తిరిగి రావడం అదృశ్యంగా ఉంటుంది
అక్టో. 17 బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 8-11 పాట 10 (82)
ప్రసంగ లక్షణం: పూర్ణహృదయ విధేయతను పురికొల్పడం (be 262వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: అద్వితీయ సత్య దేవునిగా యెహోవాను ఘనపరచండి—భాగం 2 (wt 19-22 పేజీలు, 10-16 పేరాలు)
నం. 2: 1 దినవృత్తాంతములు 10:1-14
నం. 3: td 8బి క్రీస్తు తిరిగి రావడం భౌతిక వాస్తవాలను బట్టి గ్రహించబడుతుంది
నం. 4: మనమెవరి విషయంలో ఔచిత్యంగా ఉండాలి?
అక్టో. 24 బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 12-15 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: ప్రజల హృదయాలను చేరుకోవడంలో యెహోవాకు సహకరించడం (be 262వ పేజీ, 5వ పేరా)
నం. 1: దేవుని వాక్యాన్ని బలంగా హత్తుకొనివుండండి (wt 23-27 పేజీలు, 1-10 పేరాలు)
నం. 2: w03 11/1 10-11 పేజీలు, 10-13 పేరాలు
నం. 3: యెహోవా నామములో నడుచుకోవడం అంటే దాని నిజమైన భావమేమిటి?
నం. 4: td 39ఎ క్రైస్తవులు సబ్బాతును ఆచరించనవసరం లేదు
అక్టో. 31 బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 16-20 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: సమయాన్ని ఎలా పాటించాలి? (be 263వ పేజీ, 1వ పేరా-264వ పేజీ, 4వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
నవం. 7 బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 21-25 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: ప్రభావితం చేసే ఉద్బోధ (be 265వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: దేవుని వాక్యాన్ని బలంగా హత్తుకొనివుండండి—మన ఉద్దేశం (wt 28-31 పేజీలు, 11-13 పేరాలు)
నం. 2: 1 దినవృత్తాంతములు 22:1-10
నం. 3: td 39బి సబ్బాతు నియమం క్రైస్తవులకు ఇవ్వబడలేదు
నం. 4: gవివాహబంధాన్ని ఎలా బలపరచుకోవచ్చు?
నవం. 14 బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 26-29 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: ప్రేమనుబట్టి ఉద్బోధించడం (be 266వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చారు (wt 32-37 పేజీలు, 1-9 పేరాలు)
నం. 2: 1 దినవృత్తాంతములు 29:1-9
నం. 3: యెహోవా సేవకులు ఎందుకు హింసించబడుతున్నారు?
నం. 4: td 39సి దేవుని విశ్రాంతి ఎప్పుడు ఆరంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది?
నవం. 21 బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 1-5 పాట 5 (46)
ప్రసంగ లక్షణం: లేఖనాల్లో వేరుపారిన ఉద్బోధ (be 266వ పేజీ, 5వ పేరా-267వ పేజీ 1వ పేరా)
నం. 1: క్రీస్తునందు విశ్వాసం చూపండి (wt 37-40 పేజీలు, 10-15 పేరాలు)
నం. 2: 2 దినవృత్తాంతములు 2:1-10
నం. 3: క్రమశిక్షణా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి
నం. 4: td 34ఎ కేవలం క్రీస్తు ద్వారానే దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు
నవం. 28 బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 6-9 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: “మాట్లాడే స్వేచ్ఛ” కలిగి ఉండడం (be 267వ పేజీ, 2-3 పేరాలు)
నం. 1: యెహోవా ఆరాధకులు అనుభవించే స్వాతంత్ర్యం (wt 41-45 పేజీలు, 1-9 పేరాలు)
నం. 2: w03 12/1 15-16 పేజీలు, 3-6 పేరాలు
నం. 3: మనం యెహోవానుబట్టి సంతోషిస్తున్నామని ఎలా చూపిస్తాం?
నం. 4: td 34బి “ఒక్కసారి రక్షించబడితే ఇక రక్షించబడినట్లే” అనే మాట లేఖనాధారం కాదు
డిసెం. 5 బైబిలు పఠనం: 2 దినువృత్తాంతములు 10-14 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: ప్రోత్సాహకరంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? (be 268వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: స్వాతంత్ర్యమని లోకం పరిగణించే దాని విషాదకర ఫలితాలు (wt 46-49 పేజీలు, 10-14 పేరాలు)
నం. 2: 2 దినవృత్తాంతములు 12:1-12
నం. 3: దేవుని కృప మనకు ఎందుకు అవసరం?
నం. 4: td 34సి “సర్వజన రక్షణ” లేఖనాధారం కాదు
డిసెం. 12 బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 15-19 పాట 24 (185)
ప్రసంగ లక్షణం: యెహోవా ఏమిచేశాడో గుర్తుచేయడం (be 268వ పేజీ, 4-6 పేరాలు)
నం. 1: మనందరం ఎదుర్కోవలసిన వివాదాంశం—భాగం 1 (wt 50-53 పేజీలు, 1-8 పేరాలు)
నం. 2: 2 దినవృత్తాంతములు 19:1-11)
నం. 3: td 18ఎ పాపం అంటే ఏమిటి?
నం. 4: యేసు కుటుంబం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
డిసెం. 19 బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 20-24 22 (124)
ప్రసంగ లక్షణం: యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేశాడో వివరించడం (be 269వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: మనందరం ఎదుర్కోవలసిన వివాదాంశం—భాగం 2 (wt 54-59 పేజీలు, 9-18 పేరాలు)
నం. 2: w03 12/15, 16-17 పేజీలు, 13-15 పేరాలు
నం. 3: సంతృప్తి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడంలోని ప్రయోజనాలు
నం. 4: td 18బి ఆదాము పాపంవల్ల మానవులందరూ బాధ అనుభవించడానికి గల కారణం
డిసెం. 26 బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 25-28 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: దేవుడు ప్రస్తుతం చేస్తున్న వాటి విషయమై ఆనందాన్ని వ్యక్తపరచండి (be 269వ పేజీ, 5వ పేరా-271వ పేజీ 1వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
[అధస్సూచీలు]
a సహోదరులను మాత్రమే నియమించండి.
b సహోదరులను మాత్రమే నియమించండి.
c సహోదరులను మాత్రమే నియమించండి.
d సహోదరులను మాత్రమే నియమించండి.
e సహోదరులను మాత్రమే నియమించండి.
f సహోదరులను మాత్రమే నియమించండి.
g సహోదరులను మాత్రమే నియమించండి.