కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/04 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఉపశీర్షికలు
  • ఆగస్టు 9తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 16తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 23తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 30తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 6తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2004
km 8/04 పేజీ 2

సేవా కూటాల పట్టిక

గమనిక: మన రాజ్య పరిచర్య, సమావేశం జరిగే నెలల్లోని ప్రతీవారానికి ఒక సేవా కూటాన్ని తయారు చేస్తుంది. సంఘాలు “దేవునితో నడవండి” అనే జిల్లా సమావేశానికి హాజరవడానికి అవసరమైన సర్దుబాట్లను చేసుకోవచ్చు. సముచితమైన చోట, ఈ నెల అనుబంధంలో ఇవ్వబడిన సలహాలో స్థానికంగా అన్వయించగల అంశాలను మళ్ళీ నొక్కిచెప్పడానికి, సమావేశానికి హాజరయ్యే ముందు జరిగే చివరి సేవా కూటంలోని 15 నిమిషాలను ఉపయోగించుకోండి. సీట్లను ఆపే విషయంపై ఇవ్వబడిన సూచనలను నొక్కిచెప్పండి. ఫిబ్రవరి నెలలో సమావేశపు కార్యక్రమంలోని ముఖ్యాంశాలను పునఃసమీక్షించడానికి ఒక సేవా కూటమంతా కేటాయించబడుతుంది. ఆ చర్చకు సిద్ధపాటుగా, మనమందరం సమావేశంలో ఆచరణాత్మకమైన విషయాలను వ్రాసుకోవాలి, వాటితోపాటు మనం మన వ్యక్తిగత జీవితంలోను, మన క్షేత్ర పరిచర్యలోను అన్వయించుకోవాలనుకునే నిర్దిష్టమైన అంశాలను కూడా వ్రాసుకోవాలి. అప్పుడు మనం ఆ సలహాలను ఎలా అన్వయించుకోగలిగామో ఇతరులకు వివరిస్తూ ప్రోత్సహించగలుగుతాం.

ఆగస్టు 9తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలు మీ సంఘ క్షేత్రానికి ఆచరణాత్మకంగా ఉంటే, వాటిని ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది) ఆగస్టు 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. వేరే ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. విరాళాల ఏర్పాటును పేర్కొనే విషయాన్ని చేర్చండి. వచ్చేవారం కూటానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ తెచ్చుకొమ్మని ప్రేక్షకులకు గుర్తుచేయండి.

15 నిమి: “ఓర్పుకు ప్రతిఫలం లభిస్తుంది.”a కావలికోట, డిసెంబరు 15, 2000, 22-23 పేజీలు, 15-18 పేరాలపై క్లుప్త వ్యాఖ్యానాలను చేర్చండి.

20 నిమి: “ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.”b ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ సంఘ కార్యదర్శి నిర్వహించాలి. సంఘం నియమించబడిన సమావేశం ఏదో తెలపండి. ఐజోల్‌, దులియజాన్‌లలోని సమావేశాల కార్యక్రమం ఉ. 8:30కు ప్రారంభమవుతుంది. మిగతా సమావేశాల కార్యక్రమ సమయాలు ఏప్రిల్‌ 2004, మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడ్డాయి. ఆ మధ్యపేజీల్లోని ఇతర అంశాలను అవసరాన్ని బట్టి నొక్కిచెప్పవచ్చు. వచ్చేవారం సేవా కూటంలో చర్చించబోయే “తగిన కాలములో ఆధ్యాత్మిక ఆహారం” ఆర్టికల్‌ నుండి రెండు లేక మూడు ప్రశ్నలను అడిగి ముగించండి.

పాట 12 (113), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 16తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

8 నిమి: స్థానిక ప్రకటనలు.

17 నిమి: “తగిన కాలములో ఆధ్యాత్మిక ఆహారం.”c ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. 2వ పేరా చర్చిస్తున్నప్పుడు, ప్రేక్షకుల్లో నుండి ఒకరిద్దర్ని తాము హాజరైన సమావేశాల్లో మరచిపోలేని విషయంపై క్లుప్తంగా వ్యాఖ్యానించమనండి. వచ్చేవారం సేవా కూటంలో చర్చించబోయే “సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి” ఆర్టికల్‌ నుండి రెండు లేక మూడు ప్రశ్నలను అడిగి ముగించండి.

20 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం”​—⁠2వ భాగంd అయిదు నిమిషాల ప్రదర్శనను చేర్చండి. ఒక ప్రచారకుడు, బైబిలు విద్యార్థి ప్రగతి సాధించడానికి ఎలా సహాయపడాలో చెప్పమని ఒక పెద్దను అడుగుతాడు. ఆ పెద్ద మామూలుగా దొర్లే పొరపాటు గురించి అంటే అధ్యయన సమయంలో చిన్న చిన్న వివరాలను, అదనపు అంశాలను చర్చించడానికి అధిక సమయం వెచ్చించడం గురించి పేర్కొంటాడు. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 9వ పాఠం ఉపయోగిస్తూ, (1) సమాచారంలోని ముఖ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించడం, (2) ఉటంకించబడిన లేఖనాలను సమర్థంగా ఉపయోగించడం, (3) విద్యార్థి అవసరాలకు అనుగుణంగా పాఠాన్ని మలచడం ఎలాగో ప్రచారకునికి చూపెడతాడు. అధ్యయనం నిర్వహించబోయే ప్రతీసారి మంచిగా సిద్ధపడాలని ఆయన పేర్కొంటాడు.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 23తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు. జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది) సెప్టెంబరు 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రతిపాదనలో స్కూల్‌ టీచర్‌కు సాక్ష్యమిస్తున్నట్లు ప్రదర్శించండి.

15 నిమి: సెప్టెంబరు నెలలో సంతృప్తికరమైన జీవితం బ్రోషుర్‌ను ప్రతిపాదించడం. ప్రసంగం మరియు ప్రదర్శన. ఈ బ్రోషుర్‌, దేవుని చేత ప్రేరేపించబడిన గ్రంథం గురించి సరైన అవగాహన లేనివారితో బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. బ్రోషుర్‌లోని విషయాలను క్లుప్తంగా సమీక్షించిన తర్వాత, స్థానిక క్షేత్రంలో ఉండేవారికి ఆకర్షణీయంగా ఉండగల కొన్ని నిర్దిష్ట అంశాలను నొక్కిచెప్పండి. తర్కించడం (ఆంగ్లం) లేదా మన రాజ్య పరిచర్య నుండి ఉపోద్ఘాతము, ఒక లేఖనము, సంతృప్తికరమైన జీవితం బ్రోషుర్‌ నుండి ఒక విషయాన్ని లేదా అధ్యాయాన్ని ప్రస్తావించే ఒక చిన్న ప్రతిపాదనను పేర్కొనండి. సమర్థుడైన ఒక ప్రచారకుని చేత ఆ ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.

18 నిమి: “సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి.”e ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. సమావేశాల్లో మంచి ప్రవర్తన యెహోవాకు స్తుతిని తీసుకురావడాన్ని ఎలా గమనించారో చెప్పమని ప్రేక్షకులను కోరండి. వచ్చేవారం సేవా కూటంలో చర్చించబోయే “పవిత్రంగా, ప్రశంసనీయంగా కనబడే తీరు” ఆర్టికల్‌ నుండి రెండు లేక మూడు ప్రశ్నలను అడిగి ముగించండి.

పాట 29 (222), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 30తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

8 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి.

17 నిమి: మీరు ప్రయోజనం పొందారా? ప్రేక్షకులతో చర్చ. గత సేవా సంవత్సరపు మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన ఈ క్రింది సూచనలను సమీక్షించండి: ఒక చిన్న కాగితం మీద ఒక ప్రతిపాదనను వ్రాసుకోండి. (km 10/03 8వ పేజీ) వ్యక్తిగతంగా, నిర్దిష్టంగా, హృదయపూర్వకంగా ప్రశంసించండి. (km 11/03 1వ పేజీ) ప్రజలు తమ ఇళ్ళలో ఉండే అవకాశం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రకటించండి. (km 12/03 1వ పేజీ) బైబిలు చదవడానికి, కూటాలకు సిద్ధపడడానికి, క్షేత్ర పరిచర్యకు నిర్దిష్ట సమయాలను కేటాయించుకోండి. (km 1/04 4వ పేజీ) వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నప్పుడు, బైబిలు చదువుతున్నప్పుడు “మంచి దేశము” బ్రోషుర్‌ ఉపయోగించండి. (km 3/04 2వ పేజీ) మొత్తం బైబిలు చదవడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. (km 4/04 1వ పేజీ) వ్యాపార క్షేత్రంలో ప్రకటించండి. (km 7/04 4వ పేజీ) ఈ సూచనలను పాటించడం ద్వారా తాము పొందిన ప్రయోజనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి: “పవిత్రంగా, ప్రశంసనీయంగా కనబడే తీరు.”f ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. సమయానుకూలతను బట్టి, ఉటంకించబడిన లేఖనాలను చదివి చర్చించండి.

పాట 13 (124), ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 6తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: స్థానిక అవసరాలు.

25 నిమి: “పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించండి.”g ఒకరు లేక ఇద్దరు పయినీర్లను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. వారు పూర్తికాల పరిచర్యను చేపట్టడానికి తల్లిదండ్రుల, పెద్దల లేక ఇతరుల మాదిరి ఎలా ప్రోత్సహించిందో చెప్పమనండి.

పాట 17 (187), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

f ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

g ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి