ప్రశ్నా భాగం
◼ మనం గృహస్థుడిని సందర్శించిన ప్రతిసారి, ప్రపంచవ్యాప్త పని కోసం సముచితమైన విరాళాలను స్వీకరించేందుకు ఇష్టపడుతున్నామని ప్రస్తావించాలా?
అక్కర్లేదు. 1999 డిసెంబరు మన రాజ్య పరిచర్యలో వచ్చిన “మన సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించండి” అనే ఆర్టికల్ ఇలా వ్యాఖ్యానించింది: “కొన్నిసార్లు ప్రపంచవ్యాప్త పనికి సంబంధించిన విరాళాల విషయం ప్రస్తావించటం ఇబ్బందికరంగా ఉండవచ్చు.” ఈ విషయంలో వివేచనతో వ్యవహరించడం అవసరం. మనది బైబిలు విద్యా పనే కానీ వాణిజ్యపరమైన కార్యక్రమం కాదని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలన్నది మన కోరిక. మనం బ్రతిమాలి విరాళాలు సేకరించడం లేదు.
ఆసక్తిగలవారికి మొదటిసారిగా సాహిత్యం ఇచ్చినప్పుడు మన పని స్వచ్ఛంద విరాళాల సహాయంతోనే చేయబడుతుందని స్పష్టంగా వివరించడం మంచిది. మనం ఆసక్తి చూపించేవారికి మాత్రమే లేదా మన సాహిత్యాన్ని చదవాలని ఇష్టపడేవారికి మాత్రమే సాహిత్యాన్ని అందజేయాలని గుర్తుంచుకుంటే, విరాళాల విషయంలో చింతించాల్సిన పని ఉండదు.
అలా ఆసక్తి చూపించేవారిలో చాలామంది మనం వాళ్ళను మళ్ళీ సందర్శించినప్పుడు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడానికి స్వయంగా ముందుకొస్తారు. ఇతరులు ఫలాని పుస్తకం ధర ఎంత అని అడగవచ్చు. మనం చేస్తున్నది వాణిజ్యపరమైన పని కాదని క్లుప్తంగా చెప్పి, ఆసక్తిగలవారికి వ్యయం తీసుకోకుండానే సాహిత్యాన్ని అందజేస్తామని వివరించవచ్చు. ప్రపంచవ్యాప్త పనికి మద్దతివ్వాలనుకునే వారెవరైనా సముచితంగా స్వచ్ఛంద విరాళాలు ఇవ్వవచ్చని కూడా మనం వారికి తెలియజేయవచ్చు. మనం పునర్దర్శించే వ్యక్తి ప్రపంచవ్యాప్త పనికి మద్దతిచ్చే విషయాన్ని అంతగా పట్టించుకోకపోతే, సముచితమని అనిపించిన సందర్భాల్లో ఆ విషయాన్ని మనం ప్రస్తావించవచ్చు.
ఆసక్తి చూపించినవారికి మనం సాహిత్యాలను వ్యయం తీసుకోకుండానే ఇచ్చినా, మన సాహిత్యాలను ప్రచురించడానికి వాటిని పంపిణీ చేయడానికి ఖర్చు అవుతుందని గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్త పనికి సంబంధించిన అన్ని పనులకు అయ్యే ఖర్చును భరించడానికి అవసరమయ్యే స్వచ్ఛంద విరాళాలు ఇచ్చేలా దేవుని ఆత్మ ఆయన సేవకులను, ఆసక్తిగలవారిని ప్రేరేపిస్తుందనే నమ్మకం మనకుంది.
◼ కావలికోట, తేజరిల్లు! పత్రికల వ్యక్తిగత ప్రతులు తీసుకొనే విషయమేమిటి?
కావలికోట, తేజరిల్లు! పత్రికలను చందా కట్టి తెప్పించుకునే ఏర్పాటు కొంతకాలం క్రితం నిలిపివేయబడింది కాబట్టి, ప్రచారకులందరూ తమ పత్రికలను స్థానిక సంఘం ద్వారానే తీసుకోవాలి. బ్రెయిలీ పత్రికలు మాత్రం అర్హులైన వారికి ఉచిత పత్రికలుగా పోస్టు ద్వారా పంపించబడతాయి. సంఘాలు వేరే భాషలోని పత్రికలను, పెద్ద అచ్చుగల పత్రికలను కాంగ్రిగేషన్ రిక్వెస్ట్స్ (M-202) ఫారమ్‌ను ఉపయోగించి కోరవచ్చు.
మీ క్షేత్రంలోని వారెవరైనా క్రమంగా పత్రికలు కావాలని కోరితే, దయచేసి ఒక్క సంచిక కూడా తప్పిపోకుండా వారికి పత్రికలు క్రమంగా అందేలా చూడండి. బహిష్కరించబడిన వ్యక్తులు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడం కోసం పత్రికలను లేదా ఇతర ప్రచురణలను రాజ్యమందిరంలోని పత్రికలు మరియు ప్రచురణల విభాగం నుండి తీసుకోవచ్చు. బహిష్కరించబడిన వ్యక్తులను వ్యక్తిగతంగా సందర్శించి పత్రికలు ఇచ్చేలా పత్రికా మార్గాన్ని ఏర్పరచుకోకూడదు.
పత్రికా మార్గం ద్వారా సంఘ ప్రచారకులు చేరుకోలేని వారి చందా వివరాలను మాత్రమే ఇండియా బ్రాంచి కార్యాలయం ఫైల్‌లో భద్రపరుస్తుంది. పత్రికలను మరే విధంగానూ అందుకోలేని వ్యక్తి కోసం చందా కట్టమని సంఘ సేవా కమిటీ కోరితే, ఆ చందా వివరాలను సంఘ సేవా కమిటీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఆమోదించిందని కార్యదర్శి ఒక చీటిపై వ్రాసి దానితోపాటు పంపించాలి.
అంటే ప్రచారకులు వ్యక్తిగత చందా కావాలని కోరుతూ బ్రాంచి కార్యాలయానికి వ్రాయకూడదని దీని భావం. ప్రచారకులు లేదా ఆసక్తిగలవారు అలా కోరితే అవి తిరిగి సంఘానికి పంపించబడతాయి.