ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూలై, ఆగస్టు నెలల్లో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సెప్టెంబరులో: సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? మీ భాషలో ఈ బ్రోషుర్ లేకపోతే, నా బైబిలు కథల పుస్తకము లేదా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి.
◼ సెప్టెంబరు మొదలుకొని జిల్లా పైవిచారణకర్తలు “విశ్వాసంతోను ధైర్యంగాను భవిష్యత్తును ఎదుర్కోవడం” అనే అంశంగల బహిరంగ ప్రసంగాన్ని ఇస్తారు.
◼ నియమించబడని సేవాక్షేత్రంలో ప్రకటించేటప్పుడు ప్రచారకులు దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను లేదా జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించవచ్చు. గృహస్థుల దగ్గర ఇప్పటికే ఆ రెండు ప్రచురణలు ఉంటే వేరే ప్రచురణను ప్రతిపాదించవచ్చు. ఇండ్లలో లేనివారి కోసం లేదా సాహిత్యాన్ని స్వీకరించనివారికి ఇవ్వడానికి అందరూ వివిధ కరపత్రాలను దగ్గర ఉంచుకోవాలి. ఆసక్తి చూపించినవారిని మళ్ళీ సందర్శించడానికి, ప్రత్యేకించి నియమించబడని సేవాక్షేత్రాలు స్థానిక సంఘాలకు దగ్గరగా ఉంటే ఆ క్షేత్రాల్లో ఆసక్తిగలవారిని తిరిగి సందర్శించడానికి కృషి చేయాలి.
◼ సంఘ కార్యదర్శులు క్రమ పయినీరు దరఖాస్తులు (S-205), సహాయ పయినీరు దరఖాస్తులు (S-205b) సరిపడేన్ని ఉండేలా చూసుకోవాలి. వాటిని లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14) ద్వారా ఆర్డర్ చేయవచ్చు. కనీసం ఒక సంవత్సరానికి సరిపడే దరఖాస్తులు ఉండేలా చూసుకోండి.
◼ క్రమ పయినీరు సేవ కోసమైన దరఖాస్తులను బ్రాంచి కార్యాలయానికి పంపించే ముందు సంఘ కార్యదర్శి ఆ దరఖాస్తులు పూర్తిగా నింపబడ్డాయో లేదో చూడాలి. దరఖాస్తు చేసేవారికి తమ బాప్తిస్మపు ఖచ్చితమైన తేదీ గుర్తు లేకపోతే, వాళ్ళు ఆ తేదీని ఉజ్జాయింపుగా వ్రాసిపెట్టుకోవాలి. సంఘ కార్యదర్శి ఆ తేదీని కాంగ్రిగేషన్స్ పబ్లిషర్ రికార్డ్ కార్డుపై వ్రాయాలి.
◼ మీరు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంఘ కూటాలకు, ప్రత్యేక, ప్రాంతీయ, జిల్లా సమావేశాలకు హాజరు కావాలనుకుంటే వాటికి సంబంధించిన తేదీలు, సమయాలు, స్థలాలు వంటి వివరాలు తెలుసుకోవడానికి ఆ దేశంలోని సేవను పర్యవేక్షిస్తున్న బ్రాంచి కార్యాలయానికి వ్రాయాలి. బ్రాంచి కార్యాలయాల చిరునామాలు ఈ సంవత్సరపు వార్షిక పుస్తకంలోని (ఆంగ్లం) ఆఖరి పేజీలో ఇవ్వబడ్డాయి.
◼ సంఘ పైవిచారణకర్తలందరి మరియు కార్యదర్శులందరి చిరునామాలను, టెలిఫోన్ నంబర్లను బ్రాంచి కార్యాలయం తాజాగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చిరునామా లేదా టెలిఫోన్ నంబరు మారినట్లయితే సంఘ సేవా కమిటి, ప్రిసైడింగ్ ఓవర్సీర్/సెక్రెటరీ ఛేంజ్ ఆఫ్ అడ్రస్ (S-29) ఫారమ్‌ను పూరించి, సంతకం చేసి వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. టెలిఫోన్ ఎస్‌టిడి కోడ్‌లు మారినా కూడా వాటిని వెంటనే తెలియజేయాలి.
◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
ఈ లోకం నిలుస్తుందా? (కరపత్రం నం. 19)—ఒరియా, సింధీ
కృంగిన వారికి ఓదార్పు (కరపత్రం నం. 20)—సింధీ
లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (కరపత్రం నం. 22)—సింధీ
యేసుక్రీస్తు—ఆయన ఎవరు? (కరపత్రం నం. 24)—ఉర్దూ, కొంకణి (కనారీస్)