కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/04 పేజీ 1
  • యెహోవా న్యాయాన్ని అనుకరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా న్యాయాన్ని అనుకరించండి
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను అనుకరించండి—నీతిన్యాయాలను జరిగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవా—నిజమైన నీతి న్యాయాలకు మూలం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవా—నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • “ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి”
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 7/04 పేజీ 1

యెహోవా న్యాయాన్ని అనుకరించండి

1 “యెహోవా న్యాయమును ప్రేమించువాడు.” (కీర్త. 37:​28) అందుకే ఆయన ఈ అవినీతికరమైన లోకాన్ని నాశనం చేస్తానని చెప్పినప్పటికీ ముందుగా హెచ్చరిక చేయబడేందుకు ఏర్పాటు చేశాడు. (మార్కు 13:10) కాబట్టి ప్రజలకు, పశ్చాత్తాపంచూపి రక్షించబడే అవకాశం ఇవ్వబడింది. (2 పేతు. 3:9) మనం యెహోవా న్యాయాన్ని అనుకరించడానికి కృషి చేస్తామా? మానవ కుటుంబం అనుభవిస్తున్న దైన్య పరిస్థితి, బాధలు మనం ఇతరులతో రాజ్య నిరీక్షణను పంచుకోవడానికి మనల్ని పురికొల్పుతున్నాయా? (సామె. 3:27) మనం న్యాయాన్ని ప్రేమిస్తే, ప్రకటనా పనిలో చురుకుగా భాగం వహించేందుకు కదిలించబడతాము.

2 నిష్పక్షపాతంగా ప్రకటించండి: పక్షపాతం లేకుండా దేవుని సంకల్పం గురించి అందరికీ ప్రకటించడం ద్వారా మనం ‘న్యాయముగా నడుచుకొంటాము.’ (మీకా 6:8) ఇతరుల బాహ్య రూపాన్ని బట్టి వారి గురించి ముందే ఒక నిర్ణయానికి వచ్చేసే అపరిపూర్ణ స్వభావాన్ని మనం నిరోధించాలి. (యాకో. 2:1-4, 9) ‘మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెననేది’ యెహోవా చిత్తం. (1 తిమో. 2:4) దేవుని సత్య వాక్యం ప్రజల జీవితంలో గమనార్హమైన మార్పులు తీసుకురాగలదు. (హెబ్రీ. 4:12) ఈ వాస్తవాన్ని గుర్తించడం, గతంలో మన సందేశాన్ని వినడానికి నిరాకరించిన వారితోసహా ప్రజలందరితో ఆత్మవిశ్వాసంతో మాట్లాడడానికి మనల్ని కదిలిస్తుంది.

3 ఒక షాపులో పనిచేసే సహోదరి, క్రమంగా వచ్చే ఒక వినియోగదారుని బాహ్య రూపం చూసి భయపడింది. అయినప్పటికీ, తగిన అవకాశం లభించినప్పుడు ఆమె దేవుడు వాగ్దానం చేసిన పరదైసు గురించి ఆయనకు సాక్ష్యమివ్వడానికి ప్రయత్నించింది. తాను కట్టుకథలను నమ్మనని, తాను ఒక హిప్పీననీ మాదకద్రవ్యాలకు బానిసననీ ఆయన కఠినంగా జవాబిచ్చాడు. అలాగని ఆమె విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. ఒకరోజు ఆయన తన పొడవైన జుట్టు గురించి ఆమె అభిప్రాయాన్ని అడిగాడు, అప్పుడామె యుక్తిగా ఆ విషయంలో బైబిలు ఏమని చెబుతుందో వివరించింది. (1 కొరిం. 11:14) ఆమెని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఆ మరుసటి రోజు ఆయన చక్కగా గడ్డం గీసుకొని జుట్టు కత్తిరించుకొని వచ్చాడు! ఆయన బైబిలు అధ్యయనం కోసం అడిగాడు, ఒక సహోదరుడు ఆయనతో అధ్యయనం చేయడానికి ఆమె ఏర్పాట్లు చేసింది, ఆయన దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకునేంతగా ప్రగతి సాధించాడు. ఆ వ్యక్తిలాగే నేడు యెహోవాకు సేవచేస్తున్న అనేకులు, తమకు రాజ్య సందేశాన్ని అందజేసినవారు పక్షపాతం చూపించకుండా పట్టుదలతో చేసిన కృషికి ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు.

4 యెహోవా త్వరలోనే ఈ భూమిపై నుండి దుర్నీతిని నిర్మూలిస్తాడు. (2 పేతు. 3:10, 13) మిగిలివున్న కొద్ది సమయంలో మనం, త్వరలోనే నాశనమవనున్న సాతానుకు సంబంధించిన దుర్నీతితో నిండిన లోకం నుండి తప్పించుకోవడానికి అందరికీ అవకాశాన్ని ఇవ్వడం ద్వారా యెహోవా న్యాయాన్ని అనుకరిద్దాము.​—1 యోహా. 2:17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి