పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట జూన్ 15
“నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలకు శిక్షణనివ్వడం ఒక సవాలేనని మీరు అంగీకరించరా? [ప్రతిస్పందించనివ్వండి.] ఆ విషయంలో తల్లిదండ్రులు విజయం సాధించవచ్చని ఇవ్వబడుతున్న ఈ హామీని గమనించండి. [సామెతలు 22:6 చదవండి.] ఈ కావలికోట సంచిక తల్లిదండ్రులు ఆ సవాలును ఎదుర్కొనేలా సహాయం చేసేందుకు ఆచరణాత్మక ఉపదేశాన్నిస్తోంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“పిల్లల పెంపకం ఒక సవాలని ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. దీన్ని ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా ఎలా చేయవచ్చు? [ప్రతిస్పందించనివ్వండి.] తేజరిల్లు! యొక్క ఈ సంచిక దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల మార్గాలను పరిశీలిస్తుంది.”
కావలికోట జూలై 1
“విషాదకరమైన సమయాల్లో చాలామంది, దేవునికి నిజంగా ప్రజలంటే శ్రద్ధ ఉందా, వారి బాధను ఆయన చూస్తాడా అని అడుగుతారు. దాని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] నేడు మన పట్ల దేవుడు ఎలా శ్రద్ధ చూపిస్తాడో, బాధలన్నింటినీ నిర్మూలించడానికి ఆయన ఒక ఆధారాన్ని ఎలా అందజేశాడో ఈ పత్రిక చర్చిస్తుంది.” యోహాను 3:16 చదవండి.
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“నేడు మనం మన చుట్టూ చూసే యుద్ధాలు, నేరాలు, ఉగ్రవాదం వంటి సమస్యలన్నిటికి అంతం ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తున్నారు. మీరేమంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుని వాక్యం ఈ ఓదార్పుకరమైన హామీ ఇస్తోంది. [కీర్తన 46:8, 9 చదవండి] సమీప భవిష్యత్తులో దేవుడు సాధ్యం చేయబోతున్న ఉన్నతమైన సమాధానానికి సంబంధించిన మరిన్ని అంశాలను ఈ పత్రిక చర్చిస్తుంది.”