కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/04 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఉపశీర్షికలు
  • మార్చి 8తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 15తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 22తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 29తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 5తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2004
km 3/04 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మార్చి 8తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. తర్వాతి వారపు సేవా కూటానికి ‘మంచి దేశమును చూడండి’ బ్రోషుర్‌ను తీసుకొని రావాలని అందరికీ జ్ఞాపకం చేయండి. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదనా కాలమ్‌లో మొదటిది), మార్చి 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి: సంభాషణలు ఆరంభించడానికి కరపత్రాలు ఉపయోగించడం. ప్రేక్షకులతో చర్చ. సాక్ష్యమివ్వడంలో తరచూ సంభాషణ ఆరంభించడమే అతి కష్టమైన పని. ఇంటింటి సాక్ష్యపు పనిలో, వ్యాపార ప్రాంతంలో, ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ఆ అడ్డంకును అధిగమించడానికి కరపత్రాలు ఉపయోగించవచ్చు. స్థానిక క్షేత్రంలోని ప్రజలకు ఆకర్షణీయంగా ఉండే రెండు మూడు కరపత్రాలను క్లుప్తంగా పునఃసమీక్షించండి. ఈ కరపత్రాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి పరిచయ వ్యాఖ్యలు చేయవచ్చు? వాటిలోని బొమ్మల్ని ఎలా ఉపయోగించవచ్చు? నేర్పుగా ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు? ఇంటి యజమాని ఒకవేళ ఆసక్తి చూపిస్తే పరిశీలించగల ఒక పేరాను ప్రతీ కరపత్రం నుండి నొక్కిచెప్పండి. కరపత్రాన్ని ఉపయోగిస్తూ సంభాషణ ఎలా ఆరంభించవచ్చో ప్రదర్శించండి. ఒక ప్రచారకుడు ఆ కరపత్రం నుండి క్లుప్తంగా ఒక పేరాను పరిశీలించి, ముగింపులో జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించడాన్ని చూపండి.

20 నిమి: “యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి.”a 3వ పేరా చర్చించేటప్పుడు, జ్ఞాపకార్థ ఆచరణకు ప్రజలను తామెలా ఆహ్వానించారో వివరించమని ప్రేక్షకులను అడగండి.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

మార్చి 15తో ప్రారంభమయ్యే వారం

పాట 21 (191)

10 నిమి: స్థానిక ప్రకటనలు. “జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించి గుర్తుపెట్టుకోవలసిన విషయాలు” అనే అంశంలోని ముఖ్యాంశాలను పునఃసమీక్షించండి. జ్ఞాపకార్థ ఆచరణ వారంలో కావలికోట పఠనం జరిగే సమయం ప్రకటించండి.

15 నిమి: జ్ఞాపకార్థ ఆచరణా కాలంలో ప్రత్యేక కార్యకలాపాల వివరాలు చెప్పండి. సేవా పైవిచారణకర్త ప్రేక్షకులతో నిర్వహించే చర్చ. చేయబడిన ప్రత్యేక ఏర్పాట్లను పేర్కొనండి. కొన్ని ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పండి. ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీర్లుగా సేవ చేయగలిగే వారిని ప్రోత్సహించండి. ఫిబ్రవరి మన రాజ్య పరిచర్య అనుబంధం నుండి క్లుప్తంగా కొన్ని అంశాలను పునఃసమీక్షించండి.

20 నిమి: ‘మంచి దేశమును చూడండి’ నుండి ప్రయోజనం పొందండి. ఈ కొత్త బ్రోషుర్‌ మనం దేవుని వాక్యాన్ని చదవడాన్ని, అధ్యయనం చేయడాన్ని మరింత అర్థవంతం చేస్తుంది. అందుకు దానిలోని మ్యాప్‌ల అనుక్రమణికను ఉపయోగించడం కీలకం. యెహోవా బొస్రా నుండి వస్తున్నట్లు వర్ణించే యెషయా 63:1 వ వచనాన్ని చదవండి. ‘మంచి దేశము’ అనుక్రమణికలో బొస్రా ఎక్కడవుందో చూడమని అందరినీ ఆహ్వానించండి. 34వ పేజీలోవున్న బాక్సును ఉపయోగిస్తూ “బొస్రా 11 G11” అంటే ఏమిటో వివరించి, సూచించబడిన మ్యాప్‌లో బొస్రాను, ఎదోమును కనుక్కోండి. అనుక్రమణికను ఉపయోగించి యేసు యెరూషలేము నుండి సుఖారుకు ప్రయాణించిన మార్గాన్ని గుర్తించండి. (యోహా. 4:3-5) అదే విధంగా బేతెస్ద కోనేరు ఉన్న స్థలాన్ని కూడా కనుక్కోండి. (యోహా. 5:1-3) దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వారపు బైబిలు పఠనం నుండి అదనంగా ఒకటి రెండు ఉదాహరణలు ఎన్నుకోండి. ఆ స్థలాలను బ్రోషుర్‌లో ఎక్కడ కనుక్కోవచ్చు, ఆ మ్యాప్‌లను సంప్రదించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు అనే విషయాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. బ్రోషుర్‌లోని కొన్ని మ్యాప్‌ల గురించి క్లుప్తంగా వివరించి, అవి ఏ కాలాలకు చెందినవో పేర్కొనండి. 18-19 పేజీల్లో ఉన్న మ్యాప్‌లో అత్యధిక బైబిలు ప్రాంతాలు పేర్కోబడ్డాయి. ‘మంచి దేశమును చూడండి’ బ్రోషుర్‌ను అధికంగా ఉపయోగించమని అందరినీ ప్రోత్సహించండి.

పాట 5 (46), ముగింపు ప్రార్థన.

మార్చి 22తో ప్రారంభమయ్యే వారం

పాట 21 (191)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు. మార్చి 30-ఏప్రిల్‌ 4 వరకు ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం​—2004 క్యాలెండర్‌లో ఇవ్వబడిన జ్ఞాపకార్థ బైబిలు పఠన పట్టికను అనుసరించమని అందరికీ గుర్తుచేయండి.

15 నిమి: “దైవిక జ్ఞానానికున్న అత్యున్నత విలువ.”b సమయం అనుకూలిస్తే ఉదహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి: “అశ్వికదళం చేసే దాడిలో మీరూ ఉన్నారు.”c సమయం అనుమతించే కొలది ఉదహరించబడిన లేఖనాలు చదివి చర్చించండి.

పాట 17 (187), ముగింపు ప్రార్థన.

మార్చి 29తో ప్రారంభమయ్యే వారం

పాట 18 (162)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి క్షేత్రసేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. ఏప్రిల్‌ నెలలోని సాహిత్య ప్రతిపాదనలను పేర్కొనండి. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదనా కాలమ్‌లో మూడవది), ఏప్రిల్‌ 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి: 2004 వార్షిక పుస్తకము (ఆంగ్లం)ను చదవండి. ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. “పరిపాలకసభ నుండి ఉత్తరం”లోని ముఖ్యాంశాల్ని, ప్రపంచవ్యాప్త నివేదికలోని విశిష్టమైన సంఖ్యా వివరాల్ని, విశ్వాసం బలపరిచే కొన్ని అనుభవాలను పేర్కొనండి. సంవత్సర కాలంలో మొత్తం పుస్తకం చదవడం పూర్తిచేయమని అందరినీ ప్రోత్సహించండి.

20 నిమి: సత్యం కుటుంబాలను ఐక్యపరుస్తుంది. ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. కుటుంబ సభ్యుల వ్యతిరేకత కారణంగా ఆసక్తిపరులు కొన్నిసార్లు యెహోవాను సేవించడానికి వెనుకంజవేస్తారు. ఈ క్రింది అనుభవాలు వివరించబడేలా చూడండి: 2002, జనవరి 1, కావలికోట 14-15 పేజీలు; 2000, డిసెంబరు 1, కావలికోట 8వ పేజీ; 1999, సెప్టెంబరు 1, కావలికోట 32వ పేజీ; 1999, జనవరి 1, కావలికోట 4వ పేజీ; 1998, మార్చి 8, తేజరిల్లు! 31వ పేజీ. కుటుంబంలో కేవలం ఒకే ఒక సభ్యుడు బైబిలు సూత్రాలను అన్వయించుకున్నా, కుటుంబ జీవితం మెరుగవుతుందని నొక్కిచెప్పండి.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 5తో ప్రారంభమయ్యే వారం

పాట 3 (32)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: భౌతిక శుభ్రత మనల్ని సిఫారసు చేస్తుంది. 2002, జూన్‌ 1, కావలికోట, 19-21 పేజీల ఆధారంగా ఇవ్వబడే ప్రసంగం. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లో 9వ పాఠంలోని 5వ పేరాను ఉపయోగిస్తూ తన ఇంటిని, పెరడును శుభ్రంగా ఉంచుకునే ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా ఒక బైబిలు విద్యార్థికి యుక్తిగా ఎలా సహాయం చేయవచ్చో ఒక పెద్ద, పయినీరుకు చూపిస్తున్న ప్రదర్శన ఒకటి చేర్చండి.

15 నిమి: జ్ఞాపకార్థ ఆచరణ సంబంధంగా, మార్చిలో సేవను విస్తృతంగా చేసినందువల్ల కలిగిన అనుభవాలు చెప్పండి.

పాట 2 (15), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి