కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/04 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 9తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 16తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 23తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 1తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2004
km 2/04 పేజీ 2

సేవా కూటాల పట్టిక

ఫిబ్రవరి 9తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ, జనవరి-మార్చి తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది), ఫిబ్రవరి 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలో రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి. ఒక ప్రతిపాదనలో, “నాకు నా సొంత మతం ఉంది” అంటూ సంభాషణను ఆటంకపరిచే వ్యక్తితో ఎలా వ్యవహరించాలో ప్రదర్శించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను చిన్నపుస్తకంలో 10, 11 పేజీలు చూడండి.

10 నిమి: “యెహోవాకు సన్నిహితమవండి పుస్తక అధ్యయనం నుండి ప్రయోజనం పొందండి.” ఈ ఆర్టికల్‌ ఆధారంగా సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. 2వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు అధ్యయన పట్టికపైకి దృష్టి మళ్ళించండి. 3వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు ఆ పుస్తకంలోని 25వ పేజీలో 23వ పేరాను చదివి చర్చించండి.

25 నిమి: “యెహోవా ఆశ్చర్యకార్యాల గురించి నిరంతరం తెలియజేస్తుండండి.”a (1-10 పేరాలు) సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. జ్ఞాపకార్థ ఆచరణ సమీప నెలల్లో క్షేత్ర సేవను అధికం చేసుకోవడానికి ప్రోత్సహించండి.

పాట 7 (51), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 16తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.

15 నిమి: “దేవుని మద్దతుగల పని.”b ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకంలోని 547-8 పేజీలపై వ్యాఖ్యానాలను చేర్చండి.

20 నిమి: “యెహోవా ఆశ్చర్యకార్యాల గురించి నిరంతరం తెలియజేస్తుండండి.”c (11-17 పేరాలు) ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. పునర్దర్శనానికి వెళ్ళిన ఒక ప్రచారకుడు గృహస్థుణ్ణి జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తున్నట్లు క్లుప్తమైన ఒక ప్రదర్శనను చేర్చండి.

పాట 3 (32), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 23తో ప్రారంభమయ్యే వారం

పాట 20 (93)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది), మార్చి 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలో రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి. ఒక ప్రతిపాదన ముగింపులో, తదుపరి సందర్శనంలో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ఉపయోగించి జవాబు ఇవ్వగల ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న వేయండి.

15 నిమి: “క్రమంగా కూటాలకు హాజరవడం అత్యంత ప్రాధాన్యం.”d ప్రతీ సంఘ కూటానికి హాజరుకావడానికి తాము తీసుకున్న చర్యల గురించి వ్యాఖ్యానించేందుకు ఒకరిద్దరిని ముందుగానే ఏర్పాటు చేసుకోండి.

20 నిమి: “సమాజమధ్యమున” యెహోవాను స్తుతించండి. సెప్టెంబరు 1, 2003, కావలికోట 19-22 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. (1) కీర్తన 22:22, 25 వచనాలు కూటాల్లో మనం వ్యాఖ్యానించే కారణాన్ని ఎలా నొక్కి చెబుతున్నాయి? (2) ప్రార్థన ఎందుకు సహాయకరంగా ఉంటుంది? (3) సిద్ధపడడం ఎందుకు అవసరం? (4) కూటాలకు సంబంధించి మనందరికీ ఎలాంటి లక్ష్యం ఉండాలి? (5) ముందు భాగంలో కూర్చోవడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది? (6) ఇతరులు చెప్పేదాన్ని వినడం ఎందుకు ప్రాముఖ్యం? (7) మన సొంత మాటల్లో మనమెలా జవాబులు చెప్పవచ్చు? (8) మన వ్యాఖ్యానాల ద్వారా ఇతరులను మనమెలా ప్రోత్సహించవచ్చు? (9) నిర్వాహకుని బాధ్యత ఏమిటి?

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

మార్చి 1తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఫిబ్రవరి క్షేత్రసేవ రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. మార్చి సాహిత్య ప్రతిపాదనలను పేర్కొనండి. జనవరి 2002 మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లో సూచించబడిన ప్రతిపాదనల్లో ఒకదాన్ని సంక్షిప్తంగా సమీక్షించండి.

15 నిమి: తోటి విశ్వాసులతో స్నేహం పెంచుకోవడం. (సామె. 18:24; 27:9) డిసెంబరు 1, 2000, కావలికోట 22-3 పేజీల ఆధారంగా ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. సత్యారాధన వల్ల లభించే ఒక ఆశీర్వాదం ఏమిటంటే, నిజమైన స్నేహితులను పొందే అవకాశం. కూటాల్లో, క్షేత్ర సేవలో, ఇతర సందర్భాల్లోని మన సహవాసం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనం సంఘంలోని ఇతరులతో స్నేహాన్ని ఎలా పెంచుకోవచ్చు? “శాశ్వతమైన స్నేహానికి ఆరు సూత్రాలు” అనే బాక్సును సమీక్షించండి, మన సహోదరులతో వ్యవహరించేటప్పుడు ఒక్కొక్క అంశాన్ని ఎలా అన్వయించవచ్చో చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

20 నిమి: “యెహోవా అపేక్షించేవాటిని మనం చేయగలం.”e ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. సమయానుకూలతను బట్టి, ఉదహరించబడిన లేఖనాలను నొక్కిచెప్పండి.

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి