క్రమంగా కూటాలకు హాజరవడం అత్యంత ప్రాధాన్యం
1 సంఘ కూటాలకు క్రమంగా హాజరవడానికి క్రైస్తవ కుటుంబాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. కానీ నేటి జీవితావసరాలు ఒక సవాలుగా మారే అవకాశముంది. మన ఇంటి పనులు, ఉద్యోగం, హోమ్‌వర్క్ వంటివి యెహోవా ఆరాధన కోసం కేటాయించిన సమయాన్ని స్వాహా చేయడం ప్రారంభించాయా? విషయాలను యెహోవా దృక్కోణంతో చూడడం మనకు ప్రాధాన్యమైన విషయాలను కాపాడుకోవడానికి సహాయంగా ఉంటుంది.—1 సమూ. 24:6; 26:11.
2 విశ్రాంతిదినమున కట్టెలు ఏరడం ద్వారా ఒక ఇశ్రాయేలీయుడు యెహోవా ఉద్దేశాన్ని బుద్ధిపూర్వకంగా నిర్లక్ష్యం చేశాడు. అతను ఆ పని తన కుటుంబం కోసం చేస్తున్నానని తర్కించి ఉండవచ్చు లేదా అది చాలా చిన్న విషయంగా భావించి ఉండవచ్చు. కానీ ఆరాధన కోసం కేటాయించిన సమయంలో చిన్న చిన్న పనులు చేసినా అది గంభీరమైన విషయంగా పరిగణించబడుతుందని ఆ కాలంలో విధించబడిన తీర్పు ద్వారా యెహోవా చూపించాడు.—సంఖ్యా. 15:32-36.
3 సవాలును ఎదుర్కోవడం: కూటాల హాజరుకు అంతరాయం కలుగకుండా ఉద్యోగం చేయడానికి చాలామంది తంటాలుపడుతుంటారు. కొంతమంది తమ యజమానితో మాట్లాడడం ద్వారా, తోటి ఉద్యోగులతో షిఫ్టులను మార్చుకోవడం ద్వారా, మరింత అనుకూలంగా ఉండే ఉద్యోగం వెతుక్కోవడం ద్వారా, తమ జీవనశైలిని సరళంగా చేసుకోవడం ద్వారా ఈ సవాలును విజయవంతంగా ఎదుర్కొన్నారు. సత్యారాధన కోసం చేసే ఇలాంటి త్యాగాలు దేవుణ్ణి ఎంతో సంతోషపరుస్తాయి అనడంలో సందేహం లేదు.—హెబ్రీ. 13:16.
4 హోమ్‌వర్క్ కూడా ఓ సవాలు కాగలదు. “నేను నా హోమ్‌వర్క్ కూటాలకు వెళ్ళే ముందు కొంత చేసుకుంటాను, మళ్ళీ వచ్చాక మిగతాది చేసుకుంటాను” అని ఒక అమ్మాయి చెబుతోంది. కూటాలున్న రాత్రులు ఇవ్వబడ్డ హోమ్‌వర్క్ పూర్తి చేయలేని సందర్భాల్లో, కొందరు తల్లిదండ్రులు టీచర్లను కలుసుకొని తమ కుటుంబానికి క్రైస్తవ కూటాలకు హాజరుకావడం చాలా ప్రాధాన్యమైన విషయమని వారికి వివరించి చెప్పారు.
5 కుటుంబమంతా కూటాలకు సమయానికి చేరుకునేలా సిద్ధపడేందుకు ఇంటిపనులు పూర్తిచేసుకోవడానికి కలిసి పనిచేయడం, మంచి పథకం చాలా ప్రాముఖ్యం. (సామె. 20:18) బట్టలు వేసుకొని, తయారై ఫలానా సమయానికి ఇంట్లో నుండి వెళ్ళాలి అని చిన్న పిల్లలకు కూడా నేర్పించవచ్చు. తల్లిదండ్రులు తమ మాదిరి ద్వారా, కూటాల ప్రాముఖ్యతను తమ పిల్లల మనసుల్లో ముద్రించవచ్చు.—సామె. 20:7.
6 ప్రస్తుత విధానపు ఒత్తిడులు అధికమవుతున్నకొద్దీ, మనం కూటాలకు క్రమంగా హాజరవడం చాలా ప్రాముఖ్యం. మనం విషయాలను యెహోవా దృక్కోణంతో చూడడంలో కొనసాగుతూ కూటాలకు క్రమంగా హాజరవడాన్ని అత్యంత ప్రాధాన్యంగా చేసుకుందుముగాక.—హెబ్రీ. 10:24, 25.