కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/04 పేజీ 1
  • దేవుని మద్దతుగల పని

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని మద్దతుగల పని
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా అసాధారణ శక్తిని ఇస్తున్నాడు
    మన రాజ్య పరిచర్య—1998
  • ప్రకటనా పనిని అమూల్యంగా ఎంచండి
    మన రాజ్య పరిచర్య—2011
  • దైవిక విద్యకున్న అతిశ్రేష్ఠమైన విలువ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఎడతెగక దేవుని వాక్యాన్ని గూర్చి ధైర్యంగా మాట్లాడండి
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 2/04 పేజీ 1

దేవుని మద్దతుగల పని

1 నేడు దేవుని సేవకుల్లో ఉన్నత విద్యాభ్యాసం, ఆస్తి, ప్రస్తుత విధానంలో ఉన్నత స్థానం వంటివి కొద్దిమందికే ఉన్నాయి. ఆ కారణంగానే కొందరు ప్రజలు మన పరిచర్యను అంత ప్రాముఖ్యత లేనిదానిగా కొట్టివేస్తారు. (యెష. 53:3) అయినప్పటికీ మనం చేస్తున్న బైబిలు విద్యాపని, ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి ఓదార్పును, నిరీక్షణను అందజేసింది. సాధారణ ప్రజలు అలాంటి గొప్ప ఫలితాలను ఎలా సాధించారు? కేవలం దేవుని మద్దతువల్లనే సాధించారు. (మత్త. 28:19, 20; అపొ. 1:8) “బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు” అని అపొస్తలుడైన పౌలు వివరించాడు.​—1 కొరిం. 1:26-29.

2 అపొస్తలులు, మొదటి శతాబ్దంలోని ఇతర క్రైస్తవులు చాలామట్టుకు ‘విద్యలేని పామరులే.’ (అపొ. 4:13) అయినా వారు సువార్తను ప్రకటించమని తమకివ్వబడిన ఆజ్ఞను ధైర్యంగా నెరవేర్చారు, యెహోవా వారి ప్రయత్నాలను ఆశీర్వదించాడు. అవరోధాలు, వ్యతిరేకత ఉన్నప్పటికీ ‘ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించింది.’ ఆ పనిని ఏదీ ఆపలేకపోయింది, ఎందుకంటే దానికి దేవుని మద్దతు ఉంది. (అపొ. 5:38, 39; 19:20) ఆధునిక కాలాల్లోనూ అలాగే జరుగుతోంది. శక్తిమంతులైన అధికారుల నిర్ణీత వ్యతిరేకత కూడా సువార్త ప్రబలమై వ్యాపించకుండా ఆపలేకపోతోంది.​—యెష. 54:17.

3 ఘనత అంతా దేవునికే: దేవుని పరిచారకులుగా మనకున్న ప్రత్యేక స్థానం మనం అతిశయించేందుకు కారణమవుతుందా? ఎంతమాత్రం కాదు. క్రైస్తవ పరిచర్యను సూచిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.” (2 కొరిం. 4:7) పౌలు తన పరిచర్యలో దేవుడు అందించిన బలంవల్లనే కొనసాగగలిగానని గుర్తించాడు.​—ఎఫె. 6:19, 20; ఫిలి. 4:13.

4 అదేవిధంగా మనం కూడా ‘దేవుని వలన సహాయము పొందడం’ వల్లనే ప్రకటనా పని నెరవేర్చబడుతోందని గుర్తిస్తాం. (అపొ. 26:22) ఆ విధంగా ప్రపంచవ్యాప్త ప్రకటన ద్వారా, దేశాల్లో ప్రకంపనలు పుట్టించడానికి అంటే త్వరలోనే రానున్న వినాశకరమైన తీర్పును సూచించడానికి యెహోవా మనలను విశిష్టమైన రీతిలో ఉపయోగించుకుంటున్నాడు. (హగ్గ. 2:7) అత్యంత గొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో మనం “దేవుని జతపనివారమై” ఉండడం ఎంత ఘనమైన విషయమో కదా!​—1 కొరిం. 3:6-9.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి