దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఈ క్రింది ప్రశ్నలు ఫిబ్రవరి 23, 2004వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, జనవరి 6 నుండి ఫిబ్రవరి 23, 2004 మధ్య వారాల్లోని నియామకాల సమాచారాన్ని 30 నిమిషాలు పునఃసమీక్షిస్తారు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేని వాటికి మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. వేదికపై నుండి అందించబడే సమాచారపు ఆచరణాత్మక విలువ ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమై, దానినుండి వారు నిజంగా ప్రయోజనం పొందాలంటే మనమేమి చేయవచ్చు? [be 158వ పేజీ, 2-4 పేరాలు]
2. మనం పదాలను ఎందుకు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి? [be 160వ పేజీ, 1వ పేరా మరియు రెండవ బాక్సు]
3. 1 కొరింథీయులు 14:9లో మంచి ప్రసంగానికి కావలసిన ఏ ప్రాథమిక నియమం నొక్కిచెప్పబడింది, ఈ సూత్రాన్ని మనం మన బోధలో ఎలా అన్వయించుకోవచ్చు? [be 161వ పేజీ, 1-4 పేరాలు]
4. మత్తయి 5:3-12, మార్కు 10:17-21 లో చూపించబడినట్లుగా, యేసు బోధలో మనం అనుకరించగల ఒక గమనార్హమైన లక్షణమేమిటి? [be 162వ పేజీ, 4వ పేరా]
5. మన పరిచర్యలో లేదా సంఘకూటాల్లో వ్యాఖ్యానించేటప్పుడు మనం బలాన్నీ, భావాన్నీ, వర్ణననూ వ్యక్తంచేసే పదాలను ఉపయోగించడానికి ఎందుకు కృషి చేయాలి? (మత్త. 23:37, 38) [be 163వ పేజీ, 3వ పేరా-164వ పేజీ, 1వ పేరా]
ఒకటవ నియామకం
6. ప్రసంగ చర్చాంశమంటే ఏమిటి, ప్రసంగ సమాచారాన్ని ఎంపిక చేసుకొని క్రమబద్ధంగా పొందుపరచుకునేటప్పుడు దానిని మనస్సులో పెట్టుకోవడం ఎలా ఫలవంతంగా ఉండగలదు? [be 39వ పేజీ, 6వ పేరా-40వ పేజీ, 1వ పేరా]
7. (ఎ) ఆధ్యాత్మిక శుభ్రత అంటే ఏమిటి, ఆధ్యాత్మిక శుభ్రత అన్ని శుభ్రతలకంటే అత్యంత ప్రాముఖ్యమైనదని ఎందుకు పరిగణించవచ్చు? (బి) లోకంలో సర్వసాధారణంగా ఉన్న నైతిక అపరిశుద్ధత తమకు అంటకుండా క్రైస్తవులెలా తప్పించుకోవచ్చు? [w02 2/1 5-6 పేజీలు]
8. బైబిల్లోవున్న సూత్రాలన్నింటిలో ఏవి ప్రాముఖ్యమైనవి? [w02 2/15 5 పేజీ, 1, 4, 6 పేరాలు]
9. తదనుభూతి అంటే ఏమిటి, ఈ లక్షణాన్ని యేసు ఎలా ప్రదర్శించాడు? [w02 4/15 25 పేజీ, 4-5 పేరాలు]
10. యెహోవా ప్రజల సంఘాలకు సామెతలు 11:11 ఎలా అన్వయిస్తుంది? [w02 5/15 27వ పేజీ, 1-3 పేరాలు]
వారపు బైబిలు పఠనం
11. ఆదికాండము 2:9లో ప్రస్తావించబడిన “జీవవృక్షము” దేనికి ప్రతీకగా ఉంది?
12. లోతు భార్య తన ప్రాణమెందుకు పోగొట్టుకుంది? (ఆది. 19:26) [w90 4/15 18వ పేజీ, 10వ పేరా]
13. ఆదికాండము 24వ అధ్యాయంలోని ప్రవచనార్థక నాటకంలో (ఎ) అబ్రాహాము, (బి) ఇస్సాకు, (సి) అబ్రాహాము సేవకుడైన ఎలియాజరు, (డి) పది ఒంటెలు, (ఇ) రిబ్కా ఎవరెవరికి చిత్రీకరణగా ఉన్నారు?
14. దేవుడు ముందే యాకోబు, ఏశావుల విధి నిర్ణయించాడా? (ఆది. 25:23)
15. యెహోవా ఆశీర్వదించిన మనఃపూర్వక ప్రయత్నం విషయంలో రాహేలు ఎలా ఓ చక్కని ఆదర్శంగా నిలిచింది? (ఆది. 30:1-8) [w02 8/1, 29-30 పేజీలు]