కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/04 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2004
మన రాజ్య పరిచర్య—2004
km 2/04 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి. ఈ పుస్తకం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా జీవము​—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) లేదా ప్రకటన​—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకాలు ఉపయోగించవచ్చు. మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ ప్రజల దగ్గర ఇప్పటికే ఈ పుస్తకం ఉంటే, దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) పుస్తకం ప్రతిపాదించవచ్చు. ఏప్రిల్‌, మే నెలల్లో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు ప్రతిపాదించండి. ఆసక్తిగల ప్రజలను పునర్దర్శించేటప్పుడు, జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని ప్రతిపాదించడంపై దృష్టినిలపండి. ముఖ్యంగా జ్ఞానము పుస్తకం, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లను ఇప్పటికే అధ్యయనం చేసిన వారుంటే వారితో గృహ బైబిలు అధ్యయనం ఆరంభించడానికి మనఃపూర్వకంగా కృషి చేయండి.

◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు మార్చి 1న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘపు అకౌంట్సు ఆడిట్‌ చేయాలి. ఆడిటింగ్‌ పూర్తయిన తర్వాత, తర్వాతి అకౌంట్సు రిపోర్టుతోపాటు దాన్ని చదవాలి. సంఘం ప్రపంచవ్యాప్త పనికి గానీ లేదా సంస్థ స్పాన్సర్‌ చేసిన ఏదైనా నిధికి గానీ విరాళాలు పంపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చిన ఉత్తరం ఏదైనా ఉంటే చదవండి.

◼ కార్యదర్శి మరియు సేవా పైవిచారణకర్తలు క్రమ పయినీర్లందరి కార్యకలాపాలను సమీక్షించాలి. కావలసిన గంటలను పూర్తి చేయడం ఎవరికైనా కష్టంగా ఉంటే, వారికి పెద్దలు సహాయాన్ని ఏర్పాటు చేయాలి. సూచనల కోసం S-201 వార్షిక ఉత్తరాలను పునఃసమీక్షించండి.

◼ “ధైర్యంగా ఉండండి యెహోవాపై నమ్మకముంచండి” అనే శీర్షికగల ప్రత్యేక బహిరంగ ప్రసంగం 2004 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన ప్రకటనను సెప్టెంబరు 2003 మన రాజ్య పరిచర్యలో చూడండి.

◼ ఫిబ్రవరి మొదలుకొని​—మార్చి 1వ తేదీ కంటే ముందే​—ప్రాంతీయ పైవిచారణకర్తలు “ఎవరి విలువలను మీరు మనస్సులో ఉంచుకుంటారు?” అనే కొత్త బహిరంగ ప్రసంగం ఇస్తారు.

◼ (1) కింగ్‌డమ్‌ మెలడీస్‌ [1 నుండి 9], (2) సింగింగ్‌ కింగ్‌డమ్‌ సాంగ్స్‌ కాంపాక్ట్‌ డిస్కుల పరిమిత స్టాకు ఉంది. రాజ్య మందిరంలో ఉపయోగించేందుకు కింగ్‌డమ్‌ మెలడీస్‌ సెట్టు కావాలనుకుంటున్న సంఘాలు, తమ రిక్వెస్టును వెంటనే పంపించండి. సింగింగ్‌ కింగ్‌డమ్‌ సాంగ్స్‌ కాపీలను ఆయా ప్రచారకుల కోసం కూడా రిక్వెస్ట్‌ చేయవచ్చు.

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించాలి​—కన్నడ

జీవిత సంకల్పమేమిటి​—దానిని మీరెలా కనుగొనవచ్చు?​—ఆంగ్లం, నేపాలీ

దేవుడు మనపట్ల నిజంగా శ్రద్దకలిగి ఉన్నాడా?​—నేపాలీ, పంజాబీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి