కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/03 పేజీ 3
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—2008
  • మంచివార్త ప్రచారకులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • కుటుంబ కార్యక్రమ పట్టిక—కుటుంబ అధ్యయనం
    మన రాజ్య పరిచర్య—2005
  • సమయోచితమైన సహాయము
    మన రాజ్య పరిచర్య—1990
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 11/03 పేజీ 3

ప్రశ్నా భాగం

◼ కుటుంబ బైబిలు అధ్యయనాన్ని సంఘానికి రిపోర్టు చేయాలా?

ఒక క్రైస్తవ తల్లి/తండ్రి కుటుంబ బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు, ఆ అధ్యయనంలో బాప్తిస్మం పొందని పిల్లలు ఉన్నట్లయితే, ఆ తల్లి/తండ్రి వారానికి ఒక గంట మించకుండా, వారానికి ఒక పునర్దర్శనం, నెలకు ఒక బైబిలు అధ్యయనంగా రిపోర్టు చేయవచ్చు. అధ్యయనం గంటకు ఎక్కువైనా, వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు చేసినా, పిల్లలతో విడి విడిగా చేసినా పైన చెప్పినట్లే రిపోర్టు చేయాలి.—మన పరిచర్య పుస్తకం, 104వ పేజీ చూడండి.

కుటుంబ సభ్యులందరూ బాప్తిస్మం పొందిన సాక్షులైతే, ఆ బైబిలు అధ్యయనాన్ని గానీ సమయాన్ని గానీ క్షేత్ర సేవ రిపోర్టులో వ్రాయకూడదు (ఒకవేళ మీ పిల్లవాడు బాప్తిస్మం తర్వాత రెండవ పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నట్లయితే రిపోర్టు చేయవచ్చు). ఇలా ఎందుకంటే, సంఘ క్షేత్ర సేవా రిపోర్టు ముఖ్యంగా, యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం పొందిన సేవకులుగా ఇంకా మారనివారికి సువార్త ప్రకటించడంలో, బైబిలు సత్యాన్ని బోధించడంలో ఏమి సాధించామన్నదాన్ని ప్రతిబింబిస్తుంది. (మత్త. 24:14; 28:19, 20) అయితే ఇది, కుటుంబ అధ్యయనాన్ని క్రమంగా నిర్వహించడానికి ఉన్న ప్రాముఖ్యతను ఎంతమాత్రం తగ్గించదు.

క్రైస్తవ తల్లిదండ్రులకు తమ పిల్లలతో అధ్యయనం చేయవలసిన బాధ్యత ఉంది. తమ కుటుంబ అధ్యయనాన్ని స్థాపించడానికి లేదా మెరుగుపరచుకోవడానికి సహాయం కావాలనుకునేవారు పెద్దలనుండి పొందవచ్చు. సంఘంతో సహవాసం చేస్తున్న ఒక క్రైస్తవ కుటుంబంలోని బాప్తిస్మం పొందని అబ్బాయితో లేక అమ్మాయితో వేరే ప్రచారకుడు బైబిలు అధ్యయనం నిర్వహించడం మంచిదనిపించే పరిస్థితులుంటే, సంఘ పైవిచారణకర్తను లేదా సేవా పైవిచారణకర్తను సంప్రదించాలి. అలాంటి అధ్యయనం ఆమోదించబడితే, ఆ అధ్యయనాన్ని నిర్వహించే వ్యక్తి వేరే బైబిలు అధ్యయనాల్లాగే దీన్ని రిపోర్టు చేయవచ్చు.

పిల్లలకు యెహోవా మార్గాల్లో శిక్షణనివ్వడంలో, క్షేత్రసేవా రిపోర్టులో కనబడే సమయం, ప్రయత్నాల కంటే ఎక్కువే ఇమిడివుంది. (ద్వితీ. 6:6-9; సామె. 22:6) క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలను ‘ప్రభువు [యెహోవా] యొక్క శిక్షలోను బోధలోను పెంచే’ బరువైన బాధ్యతను వహిస్తున్నందుకు వారెంతో ప్రశంసనీయులు.—ఎఫె. 6:4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి