ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరులో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ప్రజల దగ్గర ఈ ప్రచురణలు అప్పటికే ఉంటే, అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని లేదా ఏదైనా పాత ప్రచురణను ప్రతిపాదించవచ్చు. డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాలను ఉపయోగించవచ్చు. జనవరిలో: 1988కి ముందు ప్రచురించబడిన పుస్తకాలేవైనా సంఘం స్టాకులో ఉంటే అవి. ఒకవేళ అవేవీ మీ దగ్గర స్టాకులో లేకపోతే దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా పాత ప్రచురణల అదనపు స్టాకు ఉందేమో చూసి వాటిని ఉపయోగించవచ్చు. పాత పుస్తకాలు లేని సంఘాలు కుటుంబ సంతోషానికిగల రహస్యము లేదా యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి. (ఆంగ్లం) ఈ పుస్తకం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా, జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) లేదా ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకాలను ఉపయోగించవచ్చు.
◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు డిసెంబరు 1న లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘపు అక్కౌంట్స్ ఆడిట్ చేయాలి. ఇలా ఆడిట్ చేసిన తర్వాత ఆ విషయం, తరువాతి అక్కౌంట్స్ రిపోర్టుతోపాటు సంఘానికి ప్రకటించాలి.
◼ సంఘాలు తమ లైబ్రరీ కోసం రిక్వెస్టు చేసిన వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 2001 (ఆంగ్లం) కాపీలను సంఘాలకు పంపిన తర్వాత ఇంకా కొన్ని కాపీలు మిగిలాయి. ఈ ఇండెక్సును తమ వ్యక్తిగత ఉపయోగం కోసం కావాలనుకునే ప్రచారకులు తమ సంఘం ద్వారా రిక్వెస్ట్ చేయవచ్చు.
◼ సంఘాలు లిటరేచర్ కోసం చేసే రిక్వెస్టులను బ్రాంచి కార్యాలయం ఇప్పటి నుండి ప్రతీనెల ఈ క్రింది క్రమంలో పంపిస్తుంది: ప్రతీనెల మొదటి వారంలో కర్ణాటక, తమిళనాడు రిక్వెస్టులు; రెండవ వారంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రిక్వెస్టులు; మూడవ వారంలో కేరళ రిక్వెస్టులు; నాలుగవ వారంలో ఇండియాలోని మిగతా రాష్ట్రాల రిక్వెస్టులు పంపించబడతాయి. లిటరేచర్ కో-ఆర్డినేటర్ (లేక సేవకుడు) మీ సంఘానికి కేటాయించబడిన వారానికి ముందే లిటరేచర్ రిక్వెస్టులు బ్రాంచి కార్యాలయానికి అందేలా ఏర్పాటు చేసుకోవాలి.
◼ వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 2002 ప్రతులు ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంఘం తమ సంఘపు లైబ్రరీ కోసం కేవలం ఒక్క ప్రతిని మాత్రమే రిక్వెస్టు చేయవచ్చు. లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌లోని “Cong. Use” కాలమ్‌లో దీన్ని స్పష్టంగా వ్రాయాలి.
◼ లభ్యమవుతున్న కొత్త ప్రచురణలు:
వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 2002—ఆంగ్లం
అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి—కన్నడ, తెలుగు
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
మీపట్ల శ్రద్ధచూపే సృష్టికర్త ఉన్నాడా?—ఆంగ్లం
జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (చిన్నసైజు)—ఆంగ్లం
నిత్యజీవానికి నడిపించే జ్ఞానము—నేపాలీ, బెంగాలీ
చదవడం మరియు వ్రాయడం మీద శ్రద్ధవహించండి—ఆంగ్లం