పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“ఎక్కడబడితే అక్కడ లభ్యమవుతున్న పోర్నోగ్రఫీ గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. అది నిజంగా ఆలోచించవలసిన విషయమని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలులో లభించే ఆచరణాత్మకమైన సలహా మనకు రక్షణగా ఉండగలదు. [ఎఫెసీయులు 5:3, 4 చదవండి.] మోసకరమైన ఈ ప్రమాదం నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చునో ఈ పత్రిక తెలియజేస్తుంది.”
కావలికోట అక్టో. 15
“మనకెదురయ్యే అనేక నిర్ణయాలు మన జీవితంపై విస్తృత ప్రభావం చూపిస్తాయి. అవివేకమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు మనకేమి సహాయపడగలదు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత, సామెతలు 3:6 చదవండి.] జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడగల బైబిలు ఆధారిత మార్గదర్శకాలను అయిదింటిని ఈ కావలికోట సంచిక అందిస్తోంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“విభిన్న సమాజాల మధ్య, వర్గాల మధ్య కొన్నిసార్లు కనబడే తీవ్ర భావాలు ఎన్నడైనా అంతమవుతాయని మీరు విశ్వసిస్తారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత అపొస్తలుల కార్యములు 10:34, 35 చదవండి.] ఆ సమస్యను మనమెలా అధిగమించవచ్చో ఈ తేజరిల్లు! సంచిక [28వ పేజీ చూపించండి] చూపిస్తుంది.”
కావలికోట నవం. 1
“మనమందరం ఏదో ఒక సమయంలో నమ్మక ద్రోహానికి గురయ్యాం. ‘నేను నమ్మగలవారెవరైనా ఉన్నారా?’ అని మిమ్మల్ని మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత సామెతలు 3:5 చదవండి.] మనం దేవుణ్ణి పూర్తిగా ఎందుకు నమ్మవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది. మన నమ్మకానికి ఎవరు యోగ్యులనేది ఎలా నిశ్చయించుకోవచ్చుననే విషయం కూడా ఇది చర్చిస్తుంది.”