కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/03 పేజీ 8
  • “సంతోషముతో యెహోవాను సేవించండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సంతోషముతో యెహోవాను సేవించండి”
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రకటించే పనిలో మీ సంతోషాన్ని అధికం చేసుకోండి
    మన రాజ్య పరిచర్య—2002
  • సువార్తనందించుట—ఆనందముతో
    మన రాజ్య పరిచర్య—1991
  • సంతోషం-పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • యెహోవాను హృదయానందముతో సేవించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 10/03 పేజీ 8

“సంతోషముతో యెహోవాను సేవించండి”

1. యెహోవా సేవకుల గొప్ప సంతోషానికి మూలం ఏమి కావచ్చు?

1 “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఫిలి. 4:4) సువార్తను పంచుకోవడం, యెహోవాను ఆరాధించేందుకు గొఱ్ఱెల్లాంటి ప్రజలకు సహాయం చేయడం అనే ఘనత గొప్ప సంతోషానికి మూలం. (లూకా 10:17; అపొ. 15:3; 1 థెస్స. 2:19) అయితే కొన్నిసార్లు మన పరిచర్యలో సంతోషం తగ్గుతున్నట్లనిపిస్తే, మనమేమి చేయవచ్చు?

2. మన నియామక మూలాన్ని దృష్టిలో పెట్టుకోవడం మన సంతోషానికి ఎలా దోహదపడుతుంది?

2 దేవుడు నిర్దేశించిన పని: మన ప్రకటనా పని నియామకం యెహోవా నుండి వచ్చిందని గుర్తుంచుకోండి. అవును, మనం రాజ్య సందేశాన్ని ప్రకటిస్తూ శిష్యులను చేయడంలో “దేవుని జతపనివా[రిగా]” ఉండడం ఎంతటి ఘనతో కదా! (1 కొరిం. 3:9) ఇకపై ఎన్నడూ పునరావృతం కాని ఈ పనిలో క్రీస్తుయేసు మనతో ఉన్నాడు. (మత్త. 28:18-20) ఇప్పుడు జరుగుతున్న గొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో దేవదూతలు కూడా మనతోపాటు చురుగ్గా పాల్గొంటున్నారు. (అపొ. 8:26; ప్రక. 14:6) ఈ పనికి యెహోవా మద్దతునిస్తున్నాడని దైవజనుల అనుభవాలతోపాటు, లేఖనాలు ఖచ్చితమైన నిదర్శనమిస్తున్నాయి. కాబట్టి మనం ప్రకటిస్తున్నప్పుడు, ‘దేవునివలన నియమింపబడిన వారిగా క్రీస్తునందు దేవునియెదుట’ ముందుకుసాగుతాం. (2 కొరిం. 2:17) సంతోషానికి ఎంత బలమైన కారణమో కదా!

3. దేవుని సేవలో మన సంతోషాన్ని కాపాడుకోవడంలో ప్రార్థన ఏ పాత్ర వహిస్తుంది?

3 దేవుని సేవలో మన సంతోషాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన అత్యావశ్యకం. (గల. 5:22) దేవుడిచ్చే శక్తితోనే మనం దేవుని సేవ చేయగలుగుతాం, కాబట్టి ఆయన ఆత్మ కోసం వేడుకోవాలి, అలా అడిగేవారికి ఆయన తన ఆత్మను ఉదారంగా అనుగ్రహిస్తాడు. (లూకా 11:13; 2 కొరిం. 4:1, 7; ఎఫె. 6:18-20) మన పరిచర్య గురించి ప్రార్థించడం, వ్యతిరేక ప్రతిస్పందనలు ఎదురైనప్పుడు సరైన దృక్పథాన్ని కలిగివుండడానికి సహాయపడుతుంది. అది మనం ప్రకటనా పనిని ధైర్యంగా సంతోషంగా కొనసాగించేలా చేస్తుంది.—అపొ. 4:29-31; 5:40-42; 13:50-52.

4. ప్రకటనా పనిలో మన సంతోషాన్ని అధికం చేసుకోవడానికి మంచి సిద్ధపాటు ఎలా సహాయపడుతుంది, మనం సిద్ధపడడానికి కొన్ని ఆచరణాత్మకమైన మార్గాలు ఏవి?

4 బాగా సిద్ధపడండి: పరిచర్యలో పాల్గొనడంలో మన సంతోషాన్ని అధికం చేసుకోవడానికి ఆచరణాత్మకమైన ఒక మార్గమేమిటంటే బాగా సిద్ధపడడం. (1 పేతు. 3:15) అలా సిద్ధపడేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. తాజా పత్రికల కోసం ఇవ్వబడిన ప్రతిపాదనలను లేదా మీరు ఇవ్వాలనుకుంటున్న వేరే సాహిత్యాలకు తగిన ప్రతిపాదనను సమీక్షించడానికి కేవలం కొద్ది నిమిషాలు చాలు. సముచితమైన ఉపోద్ఘాతం కోసం తర్కించడం (ఆంగ్లం) పుస్తకం లేదా మన రాజ్య పరిచర్య పాత సంచికలను సంప్రదించవచ్చు. ఒక చిన్న కాగితం మీద ఒక ప్రతిపాదనను సంక్షిప్తంగా వ్రాసుకోవడం సహాయకరంగా ఉంటుందని కొందరు రాజ్య ప్రచారకులు తెలుసుకున్నారు. వారు ఆ ప్రతిపాదనను గుర్తుతెచ్చుకోవడానికి అప్పుడప్పుడు దాన్ని చూసుకుంటారు. అది తమ కంగారును తగ్గించుకోవడానికి వారికి సహాయం చేసి, ధైర్యంగా ప్రకటించేందుకు దృఢనమ్మకాన్నిస్తుంది.

5. సంతోషం మనకు, ఇతరులకు ఎలా ప్రయోజనం కలిగిస్తుంది?

5 సంతోషం తనతోపాటు అనేక ఆశీర్వాదాలనూ తెస్తుంది. సంతోషకరమైన వైఖరి మన సందేశం మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేస్తుంది. సహించడానికి సంతోషం మనల్ని బలపరుస్తుంది. (నెహె. 8:10; హెబ్రీ. 12:1, 2) అన్నింటికంటే ముఖ్యంగా మనం సంతోషంగా చేసే సేవ దేవుణ్ణి మహిమపరుస్తుంది. కాబట్టి ‘సంతోషముతో యెహోవాను సేవించుదాం.’—కీర్త. 100:2.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి