దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఈ క్రింది ప్రశ్నలు 2003 అక్టోబరు 27వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త సెప్టెంబరు 1 నుండి అక్టోబరు 27 2003, మధ్య వారాల్లోని నియామకాల ద్వారా అందజేయబడిన సమాచారం ఆధారంగా 30 నిమిషాల పునఃసమీక్ష నిర్వహిస్తారు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేని వాటికి జవాబులను తెలుసుకునేందుకు మీరు స్వయంగా పరిశోధన చేయాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. ‘తగిన దుస్తులతో’ అలంకరించుకోవలెనని 1 తిమోతి 2:9 లో చెప్పబడిన హితబోధ అర్థమేమిటి, ఇది మనం వేదికపై నుండి గానీ క్షేత్ర పరిచర్యలో గానీ ఇచ్చే సందేశాలను ఎలా ప్రభావితం చేస్తుంది? [be 132వ పేజీ, 4-5 పేరాలు]
2. మనం కనబడేతీరును 1 యోహాను 2:15-17; ఎఫెసీయులు 2:2; రోమీయులు 15:3 వచనాల్లో పేర్కొనబడిన బైబిలు సూత్రాలు ఎలా ప్రభావితం చేయాలి? [be 133వ పేజీ, 2-4 పేరాలు]
3. మనోనిబ్బరంతో ఉండడం ఎందుకు ప్రాముఖ్యం, మరియు వేదికనుండి మాట్లాడేటప్పుడు గానీ పరిచర్యలో పాల్గొన్నప్పుడు గానీ మనోనిబ్బరాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? [be 135వ పేజీలోని బాక్సు; 136వ పేజీలోని బాక్సు; 137వ పేజీలోని 1వ పేరా]
4. పరిచర్యలో బైబిలు ఉపయోగించే విషయంలో, “నమ్మకమైన సత్యసాక్షి”గా యేసు మనకోసం ఎలాంటి మాదిరి ఉంచాడు? (ప్రక. 3:14) [be 143వ పేజీ, 2-3 పేరాలు]
5. మనం బైబిలు ఉపయోగించడంలో మరింత ప్రవీణతగలవారిగా ఎలా తయారుకావచ్చు? (తీతు 1:9) [be 144వ పేజీ, 1వ పేరా, బాక్సు]
ఒకటవ నియామకం
6. అధ్యయనంలో ఏమేమి ఉన్నాయి, క్రమంగా దేవుని వాక్యం అధ్యయనం చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి? [be 27వ పేజీ, 3వ పేరా; 32వ పేజీ, 4వ పేరా]
7. యాకోబు 1:5, 6 ప్రకారం, మనమొక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏది అత్యావశ్యకం? [w01 9/1 28వ పేజీ, 4వ పేరా]
8. కీలకమైన తేదీలు ఏవి, వాటికెందుకు గొప్ప విలువవుంది? [si 282వ పేజీ, 27వ పేరా]
9. “కొండెము ప్రచురము చేయువాడు” ఎలా బుద్ధిహీనుడు అవుతాడు? (సామె. 10:18) [w01 9/15, 25వ పేజీ, 3వ పేరా]
10. సమయం పట్ల యెహోవా దృక్పథాన్ని మానవులు నూతనలోకంలో మరింత సంపూర్ణ అవగాహనకు ఎలా వస్తారు? [si 283వ పేజీ, 32వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. తప్పా ఒప్పా: 1 కొరింథీయులు 2:9లో అపొస్తలుడైన పౌలు, యెహోవా తన నమ్మకస్థులైన ప్రజల కోసం స్వాస్థ్యంగా ఇచ్చేందుకు సిద్ధపరచిన వాటిని సూచిస్తున్నాడు. వివరించండి. [ip-2 366వ పేజీలోని బాక్సు]
12. మొదటి కొరింథీయులు 10:13 లో గ్రంథస్థం చేయబడిన మాటలు ఎలాంటి శోధనలకు వర్తిస్తాయి, అయితే “తప్పించుకొను మార్గమును” యెహోవా ఏ విధంగా కలుగజేస్తాడు? [w91 10/1 10-11 పేజీలు, 11-14 పేరాలు]
13. ఔదార్యం విషయంలో యేసుచూపిన మాదిరి క్రైస్తవులను ఎలా ప్రభావితం చేయాలి? (2 కొరిం. 8:9) [w92 1/15, 16వ పేజీ, 10వ పేరా]
14. ధర్మశాస్త్రము మనకు ‘బాలశిక్షకుడు’ ఎలా అయ్యింది? (గల. 3:24) [w02 6/1, 15వ పేజీ, 11వ పేరా]
15. దారితప్పకుండా ఉండడానికి మనం ఎటువంటి “ఈ లోకసంబంధమైన మూలపాఠముల” విషయంలో జాగ్రత్తగా ఉండాలి? (కొలొ. 2:8)