2004వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక
సూచనలు
2004వ సంవత్సరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నిర్వహించేటప్పుడు ఈ క్రింది ఏర్పాట్లు ఉంటాయి.
సమాచారానికి మూలాధారాలు: పరిశుద్ధ గ్రంథము [O.V.], కావలికోట [w], దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి [be], “లేఖనములన్నీ దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నవి” (ఆంగ్లం) (1990 ఎడిషన్) [si], లేఖనములపై తర్కించడం (ఆంగ్లం) (1989 ఎడిషన్) [rs]
పాట, ప్రార్థన, క్లుప్తమైన ఆహ్వానపు మాటలతో పాఠశాలను సరిగ్గా సమయానికి ప్రారంభించి ఈ క్రింది విధానాన్ని పాటించాలి:
ప్రసంగ లక్షణం: 5 నిమిషాలు. పాఠశాల పైవిచారణకర్త, సహాయక సలహాదారుడు లేదా అర్హతగల ఒక పెద్ద పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకం ఆధారంగా ఒక ప్రసంగ లక్షణంపై చర్చిస్తాడు. (పెద్దలు తక్కువగా ఉన్న సంఘాల్లో అర్హత గల పరిచర్య సేవకుణ్ణి ఉపయోగించుకోవచ్చు.) ప్రత్యేకంగా సూచించనట్లయితే నియమిత పేజీల్లో కనబడే బాక్సుల్లోని సమాచారాన్ని కూడా చర్చలో చేర్చాలి. అభ్యాసాలను చేర్చకూడదు. అవి ప్రధానంగా వ్యక్తిగత ఉపయోగం కోసం, వ్యక్తిగతంగా సలహా ఇవ్వడానికి మాత్రమే.
నియామకం నం. 1: 10 నిమిషాలు. ఇది ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు నిర్వహించాలి. ఈ ప్రసంగం కావలికోట, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి లేదా “లేఖనములన్నీ దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నవి” మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని మౌఖిక పునఃసమీక్ష లేకుండా పది నిమిషాల ఉపదేశ ప్రసంగంలా ఇవ్వాలి. సమాచారంలోని అన్ని అంశాలను చర్చించాలి కానీ అదే సమయంలో, చర్చించబడుతున్న సమాచారంలో సంఘానికి బాగా ఉపయోగపడే విషయాలను నొక్కిచెబుతూ సమాచారపు ఆచరణాత్మక విలువపై దృష్టి సారించాలి. ఇవ్వబడిన ప్రసంగాంశాన్ని ఉపయోగించాలి. ఈ ప్రసంగానికి నియమించబడిన సహోదరులు నిర్ణీత సమయంలో ముగించేలా జాగ్రత్తపడాలని ఆశించబడుతోంది. సలహా ఇవ్వవలసిన అవసరముంటే వ్యక్తిగతంగా ఇవ్వవచ్చు.
బైబిలు పఠనంలోని ఉన్నతాంశాలు: 10 నిమిషాలు. మొదటి ఆరు నిమిషాలు, అర్హతగల ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు సమాచారాన్ని స్థానిక అవసరాలకు తగినట్లు సమర్థవంతంగా అన్వయింపజేయాలి. ఆ వారం బైబిలు పఠనానికి నియమించబడిన భాగంలోని ఏ భాగంపైనైనా ఆయన వ్యాఖ్యానించవచ్చు. అయితే ఇది నియమిత పఠన భాగంలోని సమాచారాన్ని సంక్షిప్తంగా చెప్పినట్లు మాత్రం ఉండకూడదు. ఈ సమాచారం ఎందుకు, ఏ విధంగా విలువైనదో ప్రేక్షకులు గ్రహించడానికి సహాయం చేయాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. ప్రారంభపు భాగానికి కేటాయించబడిన ఆరు నిమిషాలకు మించకుండా ప్రసంగీకుడు జాగ్రత్తపడాలి. ప్రేక్షకులు భాగం వహించేందుకు నాలుగు నిమిషాలు ఉండేలా చూసుకోవాలి. బైబిలు పఠనంలో ఏమి గ్రహించారో, దాని ప్రయోజనాలేమిటో క్లుప్తంగా (30 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలో) చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించాలి. ఆ తర్వాత పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులను నియమించబడిన ఇతర తరగతి గదులకు పంపిస్తాడు.
నియామకం నం. 2: 4 నిమిషాలు. ఇది ఒక సహోదరుడు చదవాల్సిన భాగం. ఇది సాధారణంగా బైబిలు నుండే ఉంటుంది. ఈ నియామకంలో నెలకు ఒకసారి కావలికోటలోని సమాచారం ఉంటుంది. విద్యార్థి పరిచయ మాటలు లేక ముగింపు మాటలు ఏమీ చెప్పకుండా నియమిత సమాచారాన్ని చదవాలి. వారం వారం చదివే సమాచారం కాస్త ఎక్కువ తక్కువ ఉండవచ్చు కానీ దీనికి నాలుగు నిమిషాలు లేదా అంతకంటే కాస్త తక్కువ సమయమే తీసుకోవాలి. పాఠశాల పైవిచారణకర్త నియామకాలు ఇవ్వడానికి ముందే సమాచారాన్ని చదివి విద్యార్థుల వయస్సును, సామర్థ్యాన్ని బట్టి ఏ సమాచారం ఏ విద్యార్థికి సరిపోతుందో చూసి ఇవ్వాలి. పాఠశాల పైవిచారణకర్త విద్యార్థులు అవగాహనతో, అనర్గళంగా, భావాన్ని సరిగ్గా నొక్కి చెబుతూ, స్వరభేదంతో, సరైన చోట ఆగుతూ, సహజత్వంతో చదివేందుకు సహాయపడడంలో ముఖ్యంగా శ్రద్ధచూపిస్తాడు.
నియామకం నం. 3: 5 నిమిషాలు. ఇది ఒక సహోదరికి నియమించబడుతుంది. ఈ నియామకాన్ని పొందే విద్యార్థినులకు పరిచర్య పాఠశాల పాఠ్యపుస్తకంలో 82వ పేజీలోనున్న పట్టిక నుండి ఒక సన్నివేశం నియమించబడుతుంది లేదా వారే అందులో నుండి ఒక సన్నివేశాన్ని ఎంపిక చేసుకోవాలి. విద్యార్థిని తనకివ్వబడిన ప్రసంగాంశాన్నే ఉపయోగిస్తూ ఆ అంశాన్ని స్థానిక సంఘ ప్రాంతానికి వాస్తవికంగాను ఆచరణాత్మకంగాను ఉండేలా క్షేత్ర సేవలోని ఒక విధానానికి అన్వయింపజేయాలి. సమాచారానికి మూలాధారం ఏమీ సూచించనప్పుడు, విద్యార్థిని ఈ భాగానికి సంబంధించిన సమాచారాన్ని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందించిన ప్రచురణల్లో పరిశోధన చేసి సేకరించుకోవాలి. కొత్త విద్యార్థులకు రెఫరెన్సులున్న నియామకాలే ఇవ్వాలి. పాఠశాల పైవిచారణకర్త, విద్యార్థిని సమాచారాన్ని విపులీకరించే విధానంపైనా, గృహిణికి లేఖనాలపై తర్కించడంలోనూ, అందించబడుతున్న సమాచారంలోని కీలకాంశాలను అర్థం చేసుకోవడంలోనూ ఆమె సహాయపడే విధానంపైనే ముఖ్యంగా శ్రద్ధచూపిస్తాడు. ఈ భాగానికి నియమించబడే విద్యార్థినులు చదవగలగాలి. సహాయకురాలిని పైవిచారణకర్త నియమిస్తాడు.
నియామకం నం. 4: 5 నిమిషాలు. నియమించబడిన ప్రసంగాంశాన్ని విద్యార్థి విపులీకరించాలి. సమాచారానికి మూలాధారం ఏమీ సూచించనప్పుడు, విద్యార్థి ఈ భాగానికి సంబంధించిన సమాచారాన్ని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందించిన ప్రచురణల్లో పరిశోధన చేసి సేకరించుకోవాలి. ఈ భాగానికి ఒక సహోదరుడు నియమించబడినప్పుడు రాజ్య మందిరంలోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రసంగంలా ఇవ్వచ్చు. సహోదరి నియమించబడినప్పుడు దీన్ని నియామకం నం. 3కు ఇవ్వబడిన సూచనల ప్రకారం ఇవ్వాలి. నియామకం నం. 4 సహోదరునికి ఇవ్వడం సముచితమనిపించినప్పుడు పాఠశాల పైవిచారణకర్త అలా ఇవ్వచ్చు. దయచేసి నక్షత్ర చిహ్నాలున్న అంశాలను ప్రసంగించేందుకు సహోదరులను మాత్రమే నియమించాలని గమనించండి.
సమయపాలన: ఏ ప్రసంగమైనా, సలహాదారుని సలహాలైనా నియమిత సమయాన్ని మించకూడదు. నియామకం నం. 2 నుండి 4 వరకు సమయం పూర్తైన వెంటనే నేర్పుగా ఆపివేయాలి. ప్రసంగ లక్షణంపై ఇవ్వబడే ప్రారంభ ప్రసంగం, నియామకం నం. 1 లేదా బైబిలు పఠనంలోని ఉన్నతాంశాలు చేస్తున్న సహోదరులు సమయాన్ని మించిపోతే వారికి వ్యక్తిగతంగా సలహా ఇవ్వాలి. అందరూ తమ తమ సమయాన్ని జాగ్రత్తగా పాటించాలి. మొత్తం కార్యక్రమం: పాట మరియు ప్రార్థన మినహాయించి 45 నిమిషాలు.
సలహా: 1 నిమిషం. ప్రతి విద్యార్థి ప్రసంగించిన తర్వాత అందులో తను గమనించిన ప్రశంసనీయమైన ఒక అంశంపై నిర్మాణాత్మకంగా వ్యాఖ్యానించడానికి పాఠశాల పైవిచారణకర్త ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు. కేవలం “చాలా బాగా చేశారు” అని ప్రశంసించడం మాత్రమే లక్ష్యంగా కాకుండా, ఆ ప్రసంగంలోని ఒక అంశం ఎందుకు సమర్థవంతంగా ఉందో తెలియజేసే నిర్దిష్ట కారణాలపై దృష్టి సారించాలి. ప్రతి విద్యార్థి అవసరాన్ని బట్టి, నిర్మాణాత్మకమైన అదనపు సలహాను కూటం తర్వాత లేదా వేరే సమయంలో ఇవ్వవచ్చు.
సహాయక సలహాదారుడు: పాఠశాల పైవిచారణకర్తతోపాటు సమర్థుడైన మరొక పెద్ద ఉంటే ఆయనను సహాయక సలహాదారునిగా పెద్దల సభ ఎంపిక చేయవచ్చు. ఒకవేళ సంఘంలో చాలామంది పెద్దలుంటే, ఈ నియామకాన్ని ప్రతి సంవత్సరం అర్హుడైన ఒక్కో పెద్ద నిర్వహించవచ్చు. నియామకం నం. 1, బైబిలు ఉన్నతాంశాలను అందించే సహోదరులకు అవసరమైనప్పుడు విడిగా సలహా ఇవ్వడం సహాయ సలహాదారుని బాధ్యత. అయితే తన తోటి పెద్దలు లేదా పరిచర్య సేవకులు ఇచ్చిన ప్రతి ప్రసంగం తర్వాత సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏర్పాటు 2004 సంవత్సరమంతా వర్తిస్తుంది, ఆ తర్వాత మార్పులు చేసే అవకాశముంది.
సలహా పత్రం: పాఠ్య పుస్తకంలో ఉంది.
మౌఖిక పునఃసమీక్ష: 30 నిమిషాలు. ప్రతి రెండు నెలలకు పాఠశాల పైవిచారణకర్త మౌఖిక పునఃసమీక్షను నిర్వహిస్తాడు. పైన పేర్కొన్న విధంగా ప్రసంగ లక్షణంపై చర్చ, బైబిలు ఉన్నతాంశాలు అయిన తర్వాత దీన్ని నిర్వహించాలి. మౌఖిక పునఃసమీక్ష ఆ వారంతో పాటు అంతకు ముందు రెండు నెలలపాటు పరిశీలించబడిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది.
పట్టిక
జన. 5 బైబిలు పఠనం: ఆదికాండము 1-5 పాట 1 (13)
ప్రసంగ లక్షణం: ఆచరణాత్మక విలువను స్పష్టం చేయడం (be 157వ పేజీ, 1వ పేరా-158వ పేజీ, 1వ పేరా)
నం. 1: సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడం (be 39-42 పేజీలు)
నం. 2: ఆదికాండము 2:7-25
నం. 3: భావి భూపరదైసు గురించిన ప్రస్తావన “కొత్త నిబంధన”లో కూడా ఉందా లేక “పాత నిబంధన”లో మాత్రమే ఉందా? (rs 285వ పేజీ, 1-3 పేరాలు)
నం. 4: a మేలైనది చేయకపోవడం ద్వారా పాపం చేసినవారి బైబిలు ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
జన. 12 బైబిలు పఠనం: ఆదికాండము 6-10 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: సమాచారాన్ని ఆచరణాత్మకంగా అన్వయించడం (be 158వ పేజీ, 2-4 పేరాలు)
నం. 1: పరిశుభ్రతకు నిజమైన అర్థం ఏమిటి? (w02 2/1, 4-7 పేజీలు)
నం. 2: ఆదికాండము 8:1—17
నం. 3: అబద్ధం చెప్పడం ఎందుకు తప్పు?
నం. 4: లూకా 23:43లో ప్రస్తావించబడిన “పరదైసు,” హేడిస్లో గానీ పరలోకములో గానీ భాగమయ్యే అవకాశం ఎందుకు లేదు? (rs 286వ పేజీ, 1వ పేరా-287వ పేజీ, 1వ పేరా)
జన. 19 బైబిలు పఠనం: ఆదికాండము 11-16 పాట 29 (222)
ప్రసంగ లక్షణం: ఇతరులు ఆచరణాత్మక విలువను గ్రహించేందుకు సహాయపడడం (be 159వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: దైవిక సూత్రాలు మీకు ప్రయోజనాన్ని చేకూర్చగలవు (w02 2/15, 4-7 పేజీలు)
నం. 2: ఆదికాండము 13:1-18
నం. 3: లూకా 23:43లో ప్రస్తావించబడిన పరదైసు, భూసంబంధితమైనదని ఏమి సూచిస్తోంది? (rs 287వ పేజీ, 2వ పేరా-288వ పేజీ, 2వ పేరా)
నం. 4: యెహోవాసాక్షులు తమ నిరీక్షణను ఇతరులతో ఎందుకు పంచుకుంటారు?
జన. 26 బైబిలు పఠనం: ఆదికాండము 17-20 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: పదాల ఎంపిక (be 160వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: తదనుభూతి—దయా కనికరాలు చూపించడానికి కీలకం (w02 4/15, 24-7 పేజీలు)
నం. 2: w02 1/1, 10-11 పేజీలు, 9-11 పేరాలు
నం. 3: లూకా 13:24లో నమోదైన యేసు మాటల భావమేమిటి?
నం. 4: మనలో ఎవరైనా సరే సత్య పరిజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? (rs 288వ పేజీ, 3వ పేరా-289వ పేజీ, 2వ పేరా)
ఫిబ్ర. 2 బైబిలు పఠనం: ఆదికాండము 21-24 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: సులభంగా అర్థమయ్యే భాష (be 161వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: పాఠశాలలో విద్యార్థి నియామకాలకు సిద్ధపడడం (be 43వ పేజీ, 1వ పేరా-44వ పేజీ, 3వ పేరా)
నం. 2: ఆదికాండము 21:1-21
నం. 3: మానవ తత్త్వజ్ఞానానికి మూలం ఏమిటి? (rs 289వ పేజీ, 3వ పేరా-290వ పేజీ, 2వ పేరా)
నం. 4: b నిశ్చితార్థాన్ని ఎందుకు గంభీరంగా తీసుకోవాలి?
ఫిబ్ర. 9 బైబిలు పఠనం: ఆదికాండము 25-28 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: వైవిధ్యభరితమైన ఖచ్చితమైన మాటలు (be 161వ పేజీ, 5వ పేరా-162వ పేజీ, 4వ పేరా)
నం. 1: విషయం, సన్నివేశం ఉన్న ప్రసంగాన్ని సిద్ధపడడం (be 44వ పేజీ, 4వ పేరా-46వ పేజీ, 2వ పేరా)
నం. 2: ఆదికాండము 28:1-15
నం. 3: కలతపెట్టే ఈ లోకంలో మనశ్శాంతి పొందడమెలా?
నం. 4: మానవ తత్త్వశాస్త్ర బోధనలకు బదులుగా యేసుక్రీస్తు బోధలను అధ్యయనం చేయడం, స్పష్టమైన ఆలోచనకు ఎందుకు నిదర్శనమవుతుంది? (rs 290వ పేజీ, 3వ పేరా-291వ పేజీ, 3వ పేరా)
ఫిబ్ర. 16 బైబిలు పఠనం: ఆదికాండము 29-31 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: బలాన్నీ భావాలనూ తెలియజేసే పదాలు, వర్ణనాత్మక పదాలు (be 163వ పేజీ, 1వ పేరా-164వ పేజీ, 2వ పేరా)
నం. 1: యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది (w02 5/15, 24-7 పేజీలు)
నం. 2: w02 2/1, 15-16 పేజీలు, 6-10 పేరాలు
నం. 3: దేవుడు ఎవరి ప్రార్థనలు వినడానికి ఇష్టపడుతున్నాడు? (rs 292వ పేజీ, 1వ పేరా-293వ పేజీ, 2వ పేరా)
నం. 4: సద్గుణం క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యమైన లక్షణం?
ఫిబ్ర. 23 బైబిలు పఠనం: ఆదికాండము 32-35 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: వ్యాకరణ నియమాలకు అనుగుణంగావున్న మాటలు (be 164వ పేజీ, 3వ పేరా-165వ పేజీ, 1వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
మార్చి 1 బైబిలు పఠనం: ఆదికాండము 36-39 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: సంక్షిప్త ప్రతిని ఉపయోగించడం (be 166వ పేజీ, 1వ పేరా-167వ పేజీ, 1వ పేరా)
నం. 1: సంఘంలో ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం (be 47వ పేజీ, 1వ పేరా-49వ పేజీ, 1వ పేరా)
నం. 2: ఆదికాండము 37:12-28
నం. 3: మన విశ్వాసం సహనంతో ఎందుకు అనుసంధానమై ఉండాలి?
నం. 4: c ఒక వ్యక్తి ప్రార్థనలు దేవునికి అనంగీకారం అయ్యేలా ఏమి చేయగలదు? (rs 293వ పేజీ, 3వ పేరా-294వ పేజీ, 3వ పేరా)
మార్చి 8 బైబిలు పఠనం: ఆదికాండము 40-42 పాట 28 (224)
ప్రసంగ లక్షణం: మీ ఆలోచనలను క్రమబద్ధంగా పొందుపరచుకోవడం (be 167వ పేజీ, 2వ పేరా-168వ పేజీ, 2వ పేరా)
నం. 1: సేవా కూటంలోని భాగాలకు, ఇతర ప్రసంగాలకు సిద్ధపడడం (be 49వ పేజీ, 2వ పేరా-51వ పేజీ, 1వ పేరా)
నం. 2: ఆదికాండము 42:1-20
నం. 3: యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
నం. 4: d ప్రార్థించడానికి సముచితమైన విషయాలు ఏవి? (rs 294వ పేజీ, 4వ పేరా-295వ పేజీ, 3వ పేరా)
మార్చి 15 బైబిలు పఠనం: ఆదికాండము 43-46 పాట 26 (212)
ప్రసంగ లక్షణం: మీ ప్రసంగ సంక్షిప్రతిని సరళంగా ఉంచుకోవడం (be 168వ పేజీ, 3వ పేరా-169వ పేజీ, 5వ పేరా)
నం. 1: హృదయపూర్వకంగా పడే శ్రమను యెహోవా ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? (w02 8/1, 29-31 పేజీలు)
నం. 2: ఆదికాండము 43:1-18
నం. 3: e ‘మొదట నాతోపాటు ప్రార్థన చేసి తర్వాత మీ సందేశాన్నివ్వండి’ అని ఎవరైనా అంటే (rs 295వ పేజీ, 4-5 పేరాలు)
నం. 4: అన్యాయపు సిరితో మనం స్నేహితులనెలా సంపాదించుకోవచ్చు?
మార్చి 22 బైబిలు పఠనం: ఆదికాండము 47-50 పాట 17 (187)
ప్రసంగ లక్షణం: సమాచారాన్ని తర్కబద్ధంగా విపులీకరించడం (be 170వ పేజీ, 1వ పేరా-171వ పేజీ, 3వ పేరా)
నం. 1: యెహోవా కయీను అర్పణను కాకుండా హేబెలు అర్పణను ఎందుకు అంగీకరించాడు? (w02 8/1, 28వ పేజీ)
నం. 2: ఆదికాండము 47:1-17
నం. 3: ఇంకా నెరవేరవలసిన కొన్ని విశేషమైన బైబిలు ప్రవచనాలు ఏవి? (rs 296వ పేజీ, 2వ పేరా-297వ పేజీ, 3వ పేరా)
నం. 4: యెహోవా భయము ఎందుకు జ్ఞానమునకు మూలము?
మార్చి 29 బైబిలు పఠనం: నిర్గమకాండము 1-6 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: సమాచారాన్ని తర్కబద్ధంగా అందించడం (be 171వ పేజీ, 4వ పేరా-172వ పేజీ, 6వ పేరా)
నం. 1: ఆలోచనా సామర్థ్యం మిమ్మల్ని ఎలా కాపాడగలదు? (w02 8/15, 21-4 పేజీలు)
నం. 2: w02 2/15, 19-20 పేజీలు, 7-11 పేరాలు
నం. 3: యెహోవా గర్వాన్ని ఎలా దృష్టిస్తాడు?
నం. 4: బైబిలు ప్రవచనాల విషయంలో క్రైస్తవులు ఎందుకు ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు? (rs 297వ పేజీ, 4-8 పేరాలు)
ఏప్రి. 5 బైబిలు పఠనం: నిర్గమకాండము 7-10 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: సంబంధిత సమచారాన్ని మాత్రమే ఉపయోగించడం (be 173వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: బహిరంగ ప్రసంగాలివ్వడానికి సిద్ధపడడం (be 52వ పేజీ, 1వ పేరా-54వ పేజీ, 1వ పేరా)
నం. 2: నిర్గమకాండము 8:1-19
నం. 3: f ‘మీరు ప్రవచనానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు’ అని ఎవరైనా అంటే (rs 298వ పేజీ, 1-2 పేరాలు)
నం. 4: నిరీక్షణ ఎందుచేత “ఆత్మకు లంగరువలె” ఉంటుంది?
ఏప్రి. 12 బైబిలు పఠనం: నిర్గమకాండము 11-14 పాట 24 (185)
ప్రసంగ లక్షణం: పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం (be 174వ పేజీ, 1వ పేరా-175వ పేజీ, 5వ పేరా)
నం. 1: ప్రసంగీకుని నిర్ణయాలు (be 54వ పేజీ, 2-4 పేరాలు; 55వ పేజీ, బాక్సు)
నం. 2: నిర్గమకాండము 12:1-16
నం. 3: యెహోవా క్రమశిక్షణను మనమెందుకు స్వీకరించాలి?
నం. 4: పర్గెటరీ బోధనకు ఆధారమేమిటి? (rs 299వ పేజీ, 1-6 పేరాలు)
ఏప్రి. 19 బైబిలు పఠనం: నిర్గమకాండము 15-18 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడంవల్ల కలిగే ప్రమాదాలను నివారించుకోవడం (be 175వ పేజీ, 6వ పేరా-177వ పేజీ, 2వ పేరా)
నం. 1: కష్టాలను మనమెలా దృష్టించాలి? (w02 9/1, 29-31 పేజీలు)
నం. 2: w02 3/1, 15-16 పేజీలు, 8-11 పేరాలు
నం. 3: ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని పాపానికి శిక్ష విధించబడుతుందా? (rs 300వ పేజీ, 2-6 పేరాలు)
నం. 4: g వివాహం జీవితాంత బంధంగా ఎందుకుండాలి?
ఏప్రి. 26 బైబిలు పఠనం: నిర్గమకాండము 19-22 పాట 5 (46)
ప్రసంగ లక్షణం: వివరణ ఇవ్వమని ఇతరులు అడిగినప్పుడు (be 177వ పేజీ, 3వ పేరా-178వ పేజీ, 2వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
మే 3 బైబిలు పఠనం: నిర్గమకాండము 23-26 పాట 1 (13)
ప్రసంగ లక్షణం: సంభాషణా శైలి (be 179-80 పేజీలు)
నం. 1: బోధకుడిగా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోండి (be 56వ పేజీ, 1వ పేరా-57వ పేజీ, 2వ పేరా)
నం. 2: నిర్గమకాండము 23:1-17
నం. 3: ఒక వ్యక్తి చెడు అలవాట్లను మానుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేయగలడు?
నం. 4: విభిన్న జాతులు ఎక్కడి నుండి వచ్చాయి? (rs 301వ పేజీ, 1-4 పేరాలు)
మే 10 బైబిలు పఠనం: నిర్గమకాండము 27-29 పాట 15 (127)
ప్రసంగ లక్షణం: స్వర నాణ్యత (be 181వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: ‘వేరుచేయండి’ (be 57వ పేజీ, 3వ పేరా-58వ పేజీ, 2వ పేరా)
నం. 2: నిర్గమకాండము 28:29-43
నం. 3: ఉన్నది ఒకే కుటుంబం అయినప్పుడు కయీను తనకు భార్యను ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు? (rs 301వ పేజీ, 5వ పేరా-302వ పేజీ, 1వ పేరా)
నం. 4: జాతి వివక్ష ఎందుకు తప్పు?
మే 17 బైబిలు పఠనం: నిర్గమకాండము 30-33 పాట 20 (93)
ప్రసంగ లక్షణం: మీ ఊపిరిని సరైనవిధంగా నియంత్రించుకోండి (be 181వ పేజీ, 5వ పేరా-184వ పేజీ, 1వ పేరా; 182వ పేజీ, బాక్సు)
నం. 1: ఆలోచించమని శ్రోతలను ప్రోత్సహించండి (be 58వ పేజీ, 3వ పేరా-59వ పేజీ, 3వ పేరా)
నం. 2: నిర్గమకాండము 30:1-21
నం. 3: సాత్వికులుగా ఎందుకుండాలి?
నం. 4: వివిధ జాతుల లక్షణాలకు కారణమేమిటని తెలుస్తోంది? (rs 302వ పేజీ, 2వ పేరా-303వ పేజీ, 2వ పేరా)
మే 24 బైబిలు పఠనం: నిర్గమకాండము 34-37 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: బిగుసుకుపోయిన కండరాలను సడలించుకోవడం (be 184వ పేజీ, 2వ పేరా-185వ పేజీ, 3వ పేరా; 184వ పేజీ, బాక్సు)
నం. 1: అన్వయింపును తెలపండి, మంచి మాదిరిని ఉంచండి (be 60వ పేజీ, 1వ పేరా-61వ పేజీ, 3వ పేరా)
నం. 2: నిర్గమకాండము 36:1-18
నం. 3: మానవులందరూ దేవుని పిల్లలేనా? (rs 303వ పేజీ, 3వ పేరా-304వ పేజీ, 4వ పేరా)
నం. 4: చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఎందుకుండాలి?
మే 31 బైబిలు పఠనం: నిర్గమకాండము 38-40 పాట 1 (13)
ప్రసంగ లక్షణం: ఎదుటి వ్యక్తి మీద ఆసక్తి చూపించడం (be 186వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: సంభాషణా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు? (be 62వ పేజీ, 1వ పేరా-64వ పేజీ, 1వ పేరా)
నం. 2: w02 5/1, 19-20 పేజీలు, 3-6 పేరాలు
నం. 3: మొదటి యోహాను 3:19, 20 వచనాలను అర్థం చేసుకోవడం ఒక వ్యక్తికి ఎలా ఓదార్పునివ్వగలదు?
నం. 4: అన్ని జాతుల ప్రజలు సహోదర సహోదరీలుగా ఎన్నటికైనా నిజంగా ఐక్యమవుతారా? (rs 304వ పేజీ, 5వ పేరా-305వ పేజీ, 3వ పేరా)
జూన్ 7 బైబిలు పఠనం: లేవీయకాండము 1-5 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: శ్రద్ధగా వినడం (be 187వ పేజీ, 1-5 పేరాలు)
నం. 1: సంభాషణను కొనసాగించడమెలా? (be 64వ పేజీ, 2వ పేరా-65వ పేజీ, 4వ పేరా)
నం. 2: లేవీయకాండము 3:1-17
నం. 3: ఇతర హతసాక్షుల మరణానికి యేసుక్రీస్తు మరణానికి వ్యత్యాసమేమిటి? (rs 306వ పేజీ, 1-4 పేరాలు)
నం. 4: అతీంద్రియశక్తులతో సంబంధం పెట్టుకుంటే తప్పేముంది?
జూన్ 14 బైబిలు పఠనం: లేవీయకాండము 6-9 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: ఇతరులు ప్రగతి సాధించేందుకు సహాయపడడం (be 187వ పేజీ, 6వ పేరా-188వ పేజీ, 3వ పేరా)
నం. 1: ప్రశ్నించిన వ్యక్తి దృక్కోణాన్ని గ్రహించడం (be 66వ పేజీ, 1వ పేరా-68వ పేజీ, 1వ పేరా)
నం. 2: లేవీయకాండము 7:1-19
నం. 3: మనం చెడుతనాన్ని అసహ్యించుకోవడం ఎలా నేర్చుకోవచ్చు?
నం. 4: విమోచన క్రయధనం ఏవిధంగా చెల్లించబడిందో అది ఆవిధంగానే ఎందుకు చెల్లించాల్సివచ్చింది? (rs 306వ పేజీ, 6వ పేరా-307వ పేజీ, 2వ పేరా)
జూన్ 21 బైబిలు పఠనం: లేవీయకాండము 10-13 పాట 27 (221)
ప్రసంగ లక్షణం: అవసరమైన చేయూతనివ్వడం (be 188వ పేజీ, 4వ పేరా-189వ పేజీ, 4వ పేరా)
నం. 1: ఎలా జవాబివ్వాలో తెలుసుకోండి (be 68వ పేజీ, 2వ పేరా-70వ పేజీ, 4వ పేరా)
నం. 2: లేవీయకాండము 11:1-25
నం. 3: కేవలం విధేయత చూపిస్తే చాలు నిత్యం జీవించవచ్చు అని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించలేదు? (rs 307వ పేజీ, 3వ పేరా-308వ పేజీ, 1వ పేరా)
నం. 4: మోసగించడాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు?
జూన్ 28 బైబిలు పఠనం: లేవీయకాండము 14-16 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: ఇతరులను గౌరవించడం (be 190వ పేజీ, 1-4 పేరాలు)
మౌఖిక పునఃసమీక్ష
జూలై 5 బైబిలు పఠనం: లేవీయకాండము 17-20 పాట 1 (13)
ప్రసంగ లక్షణం: గౌరవపూర్వక అభివాదం (be 191వ పేజీ, 1వ పేరా-192వ పేజీ, 1వ పేరా)
నం. 1: ఉత్తరాల ద్వారా సందేశాన్ని అందజేయడం (be 71-3 పేజీలు)
నం. 2: లేవీయకాండము 17:1-16
నం. 3: యెహోవా సంస్థపై నమ్మకం ఉంచండి
నం. 4: యేసు బలి విలువ మొదట ఎవరికి అన్వయించబడింది, దాని ఉద్దేశమేమిటి? (rs 308వ పేజీ, 2-3 పేరాలు)
జూలై 12 బైబిలు పఠనం: లేవీయ కాండము 21-24 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: గౌరవపూర్వకంగా మాట్లాడడం (be 192వ పేజీ, 2వ పేరా-193వ పేజీ, 2వ పేరా)
నం. 1: ప్రగతిశీలురై ఉండండి—అభివృద్ధిని సాధించండి (be 74వ పేజీ, 1వ పేరా-75వ పేజీ, 3వ పేరా)
నం. 2: లేవీయకాండము 22:1-16
నం. 3: యేసు బలి ప్రయోజనాన్ని మన రోజుల్లో ఇంకా ఎవరు పొందుతున్నారు? (rs 309వ పేజీ, 1-3 పేరాలు)
నం. 4: యెహోవా యూదుల కులదైవమా?
జూలై 19 బైబిలు పఠనం: లేవీయకాండము 25-27 పాట 17 (187)
ప్రసంగ లక్షణం: నిశ్చయతతో చెప్పడం (be 194వ పేజీ, 1వ పేరా-195వ పేజీ, 2వ పేరా)
నం. 1: మీకివ్వబడిన వరాన్ని ఉపయోగించండి (be 75వ పేజీ, 4వ పేరా-77వ పేజీ, 2వ పేరా)
నం. 2: లేవీయకాండము 25:1-19
నం. 3: తీవ్రవాదం ఎలా అంతమవుతుంది?
నం. 4: విమోచన క్రయధనం ఫలితంగా భవిష్యత్తులో ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి? (rs 310వ పేజీ, 1-4 పేరాలు)
జూలై 26 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 1-3 పాట 22 (130)
ప్రసంగ లక్షణం: నిశ్చయత ఎలా వెల్లడవుతుంది? (be 195వ పేజీ, 3వ పేరా-196వ పేజీ, 4వ పేరా)
నం. 1: క్రైస్తవులు అసూయాపరులుగా ఉండాలా? (w02 10/15, 28-31 పేజీలు)
నం. 2: w02 6/15, 18-19 పేజీలు, 6-9 పేరాలు
నం. 3: యేసు బలి నుండి ప్రయోజనం పొందడానికి మనం ఏమి చేయాలి? (rs 310వ పేజీ, 5వ పేరా-311వ పేజీ, 3వ పేరా)
నం. 4: మన ప్రియమైనవారు చనిపోయినప్పుడు దుఃఖించడం తప్పా?
ఆగ. 2 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 4-6 పాట 13 (124)
ప్రసంగ లక్షణం: ఔచిత్యంతోనే అయినా దృఢంగా మాట్లాడడం (be 197వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: యెహోవా దృష్టిలో మన రోజులను విలువైనవిగా చేసుకోవడం (w02 11/15, 20-3 పేజీలు)
నం. 2: సంఖ్యాకాండము 6:1-17
నం. 3: ఒకరినొకరు ద్వేషించుకోకుండా బైబిలు ప్రజలకెలా సహాయపడగలదు?
నం. 4: మనం జీవించే విధానంపై విమోచన క్రయధనం ఎలాంటి ప్రభావం చూపించాలి? (rs 311వ పేజీ, 4-6 పేరాలు)
ఆగ. 9 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 7-9 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: సాక్ష్యమిచ్చేటప్పుడు ఔచిత్యంతో ఉండడం (be 197వ పేజీ, 4వ పేరా-198వ పేజీ, 4వ పేరా)
నం. 1: వర్గరహిత సమాజం నిజంగా వస్తుందా? (w02 1/1, 4-7 పేజీలు)
నం. 2: సంఖ్యాకాండము 8:1-19
నం. 3: అపొస్తలుడైన పౌలు క్రైస్తవులు ప్రభువుతో కూడ ‘కొనిపోబడుదురు’ అని అన్నప్పుడు, చర్చించబడుతున్న విషయమేమిటి? (rs 312వ పేజీ, 1-2 పేరాలు)
నం. 4: క్రీస్తు విరోధి ఎవరు?
ఆగ. 16 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 10-13 పాట 5 (46)
ప్రసంగ లక్షణం: సరైన సమయంలో సరైన పదాలు (be 199వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: యెహోవాను నమ్ముకోండి—ఆయనే నిజమైన దేవుడు (w02 1/15, 5-7 పేజీలు)
నం. 2: సంఖ్యాకాండము 12:1-16
నం. 3: దేవుని ప్రతీకారం ఆయన ప్రేమతో సంగతంగా ఉంటుందా?
నం. 4: లోకమంతా చూస్తుండగా క్రీస్తు మేఘం మీద ప్రత్యక్షమై విశ్వసనీయులైన క్రైస్తవులను పరలోకానికి తీసుకువెళ్తాడా? (rs 313వ పేజీ, 1-3 పేరాలు)
ఆగ. 23 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 14-16 పాట 12 (113)
ప్రసంగ లక్షణం: కుటుంబంతోను ఇతరులతోను ఔచిత్యాన్ని ఉపయోగించడం (be 200వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: విభిన్న వైఖరులను పెంపొందించుకున్న సహోదరులు (w02 1/15, 21-3 పేరాలు)
నం. 2: w02 7/15, 23-4 పేజీలు, 15-19 పేరాలు
నం. 3: క్రైస్తవులు తమ భౌతిక శరీరాలతో పరలోకానికి తీసుకుపోబడడం సాధ్యమా? (rs 314వ పేజీ, 1-2 పేరాలు)
నం. 4: h క్రూరత్వంతో నిండిన వీడియో గేములు క్రైస్తవులకు ఎందుకు తగవు?
ఆగ. 30 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 17-21 పాట 20 (93)
ప్రసంగ లక్షణం: క్షేమాభివృద్ధికరంగా అనుకూలంగా మాట్లాడడం (be 202వ పేజీ, 1వ పేరా-203వ పేజీ, 2వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
సెప్టెం. 6 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 22-25 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: స్వరాన్ని అనుకూలంగా ధ్వనింపజేయడం (be 203వ పేజీ, 3వ పేరా-204వ పేజీ, 1వ పేరా)
నం. 1: ఆ ప్రాచీన లోకం ఎందుకు నాశనమైంది? (w02 3/1, 5-7 పేజీలు)
నం. 2: సంఖ్యాకాండము 22:1-19
నం. 3: విశ్వసనీయులైన క్రైస్తవులు మరణించకుండానే పరలోకానికి రహస్యంగా తీసుకుపోబడతారా? (rs 314వ పేజీ, 3వ పేరా-315వ పేజీ, 2వ పేరా)
నం. 4: i క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎందుకు చదివి వినిపించాలి?
సెప్టెం. 13 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 26-29 పాట 4 (43)
ప్రసంగ లక్షణం: తోటి విశ్వాసులతో సంభాషించేటప్పుడు (be 204వ పేజీ, 2వ పేరా-205వ పేజీ, 4వ పేరా)
నం. 1: అశక్తతలు ఎలా అంతం అవుతాయి? (w02 5/1, 4-7 పేజీలు)
నం. 2: సంఖ్యాకాండము 29:1-19
నం. 3: మహాశ్రమల సమయంలో నిజ క్రైస్తవులకు ఎలాంటి రక్షణ ఉంటుంది? (rs 315వ పేజీ, 3వ పేరా-316వ పేజీ, 3వ పేరా)
నం. 4: దేవుని వాగ్దానములు యేసుక్రీస్తునందు అవునన్నట్టు ఎలా ఉన్నాయి?
సెప్టెం. 20 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 30-32 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: విషయాన్ని నొక్కి చెప్పడానికి మళ్ళీ చెప్పడం (be 206వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: నీతిని విత్తండి దేవుని ప్రేమపూర్వక దయను కోయండి (w02 7/15, 28-31 పేజీలు)
నం. 2: సంఖ్యాకాండము 30:1-16
నం. 3: క్రీస్తుతో ఉండడానికి కొందరు క్రైస్తవులు పరలోకానికి ఎందుకు తీసుకుపోబడతారు? (rs 316వ పేజీ, 5-8 పేరాలు)
నం. 4: j పోర్నోగ్రఫీకి ఎందుకు దూరంగా ఉండాలి?
సెప్టెం. 27 బైబిలు పఠనం: సంఖ్యాకాండము 33-36 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: క్షేత్ర పరిచర్యలో, ప్రసంగాల్లో మళ్ళీ చెప్పడం (be 207వ పేజీ, 1వ పేరా-208వ పేజీ, 3వ పేరా)
నం. 1: నిజమైన పరిశుద్ధులు మీకెలా సహాయం చేయగలరు? (w02 9/15, 4-7 పేజీలు)
నం. 2: w02 8/1, 18-19 పేజీలు, 15-19 పేరాలు
నం. 3: k ‘మీరు పైకెత్తబడడాన్ని నమ్ముతారా?’ (rs 316వ పేజీ, 9వ పేరా-317వ పేజీ, 2వ పేరా)
నం. 4: సరదా కోసం సాహసకృత్యాలు ఎందుకు చేయకూడదు?
అక్టో. 4 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 1-3 పాట 21 (191)
ప్రసంగ లక్షణం: చర్చాంశాన్ని విపులీకరించడం (be 209వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: దేవుని గురించిన ఖచ్చితమైన పరిజ్ఞానంలో ఓదార్పు (w02 10/1, 5-7 పేజీలు)
నం. 2: ద్వితీయోపదేశకాండము 1:1-18
నం. 3: సత్యాన్ని మీ సొంతం చేసుకోవడం అంటే ఏమిటి?
నం. 4: పూర్తిగా కొత్త వ్యక్తులు, కొత్త ప్రదేశాలు అదివరకే పరిచయమున్నట్లుగా అనిపించే వింత అనుభూతి పునర్జన్మ ఉందని నిరూపిస్తుందా? (rs 317వ పేజీ, 3వ పేరా-319వ పేజీ, 1వ పేరా)
అక్టో. 11 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 4-6 పాట 17 (187)
ప్రసంగ లక్షణం: సముచితమైన చర్చాంశాన్ని ఉపయోగించడం (be 210వ పేజీ, 1వ పేరా-211వ పేజీ, 1వ పేరా; 211వ పేజీ, బాక్సు)
నం. 1: సా.శ.పూ. 537 నుండి సా.శ.పూ. 997 వరకు వెనక్కి లెక్కించడం (si 285వ పేజీ, 5-7 పేరాలు)
నం. 2: ద్వితీయోపదేశకాండము 4:1-14
నం. 3: యోహాను 9:1, 2 వచనాల్లోని వృత్తాంతం పునర్జన్మను ఎందుకు నిరూపించదు? (rs 319వ పేజీ, 2వ పేరా-320వ పేజీ, 2వ పేరా)
నం. 4: “ఆత్మానుసారమైన మనస్సు”లో ఏమి ఇమిడివుంది?
అక్టో. 18 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 7-10 పాట 28 (224)
ప్రసంగ లక్షణం: ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం (be 212వ పేజీ, 1వ పేరా-213వ పేజీ, 2వ పేరా)
నం. 1: సా.శ.పూ. 997 నుండి సా.శ.పూ. 2370 వరకు వెనక్కి లెక్కించడం (si 285-6 పేజీలు, 8-11 పేరాలు)
నం. 2: w02 8/15, 15-16 పేజీలు, 3-6 పేరాలు
నం. 3: పునర్జన్మకు బైబిలు అందించే నిరీక్షణకు ఎంత తేడావుంది? (rs 320వ పేజీ, 3-4 పేరాలు)
నం. 4: l యెహోవా మతభ్రష్టులను ఎలా దృష్టిస్తాడు?
అక్టో. 25 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 11-13 పాట 9 (37)
ప్రసంగ లక్షణం: మరీ ఎక్కువ ముఖ్యాంశాలను కాదు (be 213వ పేజీ, 3వ పేరా-214వ పేజీ, 5వ పేరా)
మౌఖిక పునఃసమీక్ష
నవం. 1 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 14-18 పాట 7 (51)
ప్రసంగ లక్షణం: ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతం (be 215వ పేజీ, 1వ పేరా-216వ పేజీ, 5వ పేరా)
నం. 1: సా.శ.పూ. 2370 నుండి సా.శ.పూ. 4026 వరకు వెనక్కి లెక్కించడం (si 286-7 పేజీలు, 12-15 పేరాలు)
నం. 2: ద్వితీయోపదేశకాండము 14:1-23
నం. 3: a ‘నేను పునర్జన్మను నమ్ముతాను’ అని ఎవరైనా అంటే (rs 321వ పేజీ, 1-3 పేరాలు)
నం. 4: క్రైస్తవులు తమ జీవితాన్ని సరళంగా ఎందుకుంచుకోవాలి?
నవం. 8 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 19-22 పాట 24 (185)
ప్రసంగ లక్షణం: పరిచర్యలో ప్రజల శ్రద్ధను ఆకట్టుకోవడం (be 217వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: యేసు భూమి మీద ఉన్నప్పుడు (si 291వ పేజీ, 16-17 పేరాలు)
నం. 2: ద్వితీయోపదేశకాండము 21:1-17
నం. 3: ఎందుకిన్ని మతాలున్నాయి? (rs 322వ పేజీ, 1వ పేరా-323వ పేజీ, 2వ పేరా)
నం. 4: నిరుత్సాహాన్ని అధిగమించడానికి బైబిలు ఉదాహరణలు మనకెలా సహాయపడగలవు?
నవం. 15 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 23-27 పాట 18 (162)
ప్రసంగ లక్షణం: ఉపోద్ఘాతంలో మీరు చర్చించే విషయాన్ని తెలియజేయడం (be 217వ పేజీ, 5వ పేరా-219వ పేజీ, 2వ పేరా)
నం. 1: యేసు పరిచర్య కాలవివరాలు (si 291వ పేజీ, 18-19 పేరాలు)
నం. 2: ద్వితీయోపదేశకాండము 24:1-16
నం. 3: దేవుని మద్దతు ఉన్నవారిని ఎలా గుర్తించాలి?
నం. 4: అన్ని మతాల్లోను మంచి ఉందన్నది నిజమేనా? (rs 323వ పేజీ, 3-5 పేరాలు)
నవం. 22 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 28-31 పాట 3 (32)
ప్రసంగ లక్షణం: సమర్థమైన ముగింపులు (be 220వ పేజీ, 1-3 పేరాలు)
నం. 1: అపొస్తలుల కాలాల్లోని సంవత్సరాలను లెక్కించడం (si 291-2 పేజీలు, 20-3 పేరాలు)
నం. 2: ద్వితీయోపదేశాకాండము 29:1-18
నం. 3: తల్లిదండ్రుల మతాన్ని వదిలిపెట్టడం సబబేనా? (rs 324వ పేజీ, 1-3 పేరాలు)
నం. 4: క్రైస్తవులు వినయంతో ఎందుకుండాలి?
నవం. 29 బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 32-34 పాట 6 (45)
ప్రసంగ లక్షణం: మనస్సులో పెట్టుకోవలసిన విషయాలు (be 220వ పేజీ, 4వ పేరా-221వ పేజీ, 4వ పేరా)
నం. 1: పౌలు రెండవ మిషనరీ యాత్ర (si 292-3 పేజీలు, 24-5 పేరాలు)
నం. 2: (w02 10/15, 11వ పేజీ, 10-13 పేరాలు)
నం. 3: మనం దేవుని నామమును పరిశుద్ధపరచగల మార్గాలు
నం. 4: ఇతర మతవిశ్వాసాలతో కలవడంపై బైబిలు దృక్కోణం ఏమిటి? (rs 325వ పేజీ, 1వ పేరా-326వ పేజీ, 1వ పేరా)
డిసెం. 6 బైబిలు పఠనం: యెహోషువ 1–5 పాట 5 (46)
ప్రసంగ లక్షణం: క్షేత్ర పరిచర్యలో (be 221వ పేజీ, 5వ పేరా-222వ పేజీ, 6వ పేరా)
నం. 1: పౌలు మూడవ మిషనరీ యాత్ర, ముగింపు సంవత్సరాలు, సా.శ. 56-100 (si 293వ పేజీ, 26-30 పేరాలు)
నం. 2: యెహోషువ 4:1-14
నం. 3: సంస్థీకరించబడిన మతంలో భాగంగావుండడం అవసరమా? (rs 326వ పేజీ, 2వ పేరా-327వ పేజీ, 2వ పేరా)
నం. 4: క్రిస్మస్ క్రైస్తవుల వేడుకేనా?
డిసెం. 13 బైబిలు పఠనం: యెహోషువ 6-8 పాట 23 (200)
ప్రసంగ లక్షణం: చెబుతున్న వివరాలు ఖచ్చితమైనవిగా ఉండడం (be 223వ పేజీ, 1-5 పేరాలు)
నం. 1: క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి కీలకం (w02 11/1, 4-7 పేజీలు)
నం. 2: యెహోషువ 6:10-23
నం. 3: ఇంటింటికి వెళ్ళి ప్రకటించడంలో ఎందుకు కొనసాగాలి?
నం. 4: తోటిమనిషిని ప్రేమించడం నిజంగా అంత ప్రాముఖ్యమా? (rs 327వ పేజీ, 4వ పేరా)
డిసెం. 20 బైబిలు పఠనం: యెహోషువ 9-11 పాట 11 (85)
ప్రసంగ లక్షణం: “నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టండి” (be 224వ పేజీ, 1-4 పేరాలు)
నం. 1: మీ చేతులను బలపర్చుకోండి (w02 12/1, 30-1 పేజీలు)
నం. 2: w02 11/15, 18-19 పేజీలు, 19-23 పేరాలు
నం. 3: దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగివుండడం నిజంగా ప్రాముఖ్యమైన విషయమా? (rs 327వ పేజీ, 5వ పేరా-328వ పేజీ, 1వ పేరా)
నం. 4: b సమాధానముగలవారిగా ఉండడమంటే ఏమిటి?
డిసెం. 27 బైబిలు పఠనం: యెహోషువ 12-15 పాట 16 (143)
ప్రసంగ లక్షణం: సమాచారం ఖచ్చితమైనదేనా అన్నది పరిశీలించడం (be 225వ పేజీ, 1-3 పేరాలు)
మౌఖిక పునఃసమీక్ష
[అధస్సూచీలు]
a సహోదరులను మాత్రమే నియమించండి.
b సహోదరులను మాత్రమే నియమించండి.
c సహోదరులను మాత్రమే నియమించండి.
d సహోదరులను మాత్రమే నియమించండి.
e సహోదరులను మాత్రమే నియమించండి.
f సహోదరులను మాత్రమే నియమించండి.
g సహోదరులను మాత్రమే నియమించండి.
h సహోదరులను మాత్రమే నియమించండి.
i సహోదరులను మాత్రమే నియమించండి.
j సహోదరులను మాత్రమే నియమించండి.
k ప్రతిపాదనలకు వచ్చే ప్రతిస్పందనలు, అభ్యంతరాలు వంటివి స్థానిక క్షేత్రానికి తగినవైతే సమయాన్ని బట్టి వాటిని పరిశీలించండి.
l ప్రతిపాదనలకు వచ్చే ప్రతిస్పందనలు, అభ్యంతరాలు వంటివి స్థానిక క్షేత్రానికి తగినవైతే సమయాన్ని బట్టి వాటిని పరిశీలించండి.
a ప్రతిపాదనలకు వచ్చే ప్రతిస్పందనలు, అభ్యంతరాలు వంటివి స్థానిక క్షేత్రానికి తగినవైతే సమయాన్ని బట్టి వాటిని పరిశీలించండి.
b ప్రతిపాదనలకు వచ్చే ప్రతిస్పందనలు, అభ్యంతరాలు వంటివి స్థానిక క్షేత్రానికి తగినవైతే సమయాన్ని బట్టి వాటిని పరిశీలించండి.