కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/03 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 9తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 16తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 23తో ప్రారంభమయ్యే వారం
  • జూన్‌ 30తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 7తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2003
km 6/03 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జూన్‌ 9తో ప్రారంభమయ్యే వారం

పాట 26 (212)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది) జూన్‌ 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ప్రతి ప్రతిపాదనలో ఒక లేఖనం ప్రస్తావించబడేలా చూడండి.

15 నిమి: “క్రైస్తవ పరిచర్య—మన ముఖ్యమైన పని.”a పూర్తికాల సేవలో ప్రవేశించడం ద్వారా పొందగల ఆశీర్వాదాల్ని గూర్చి ఆలోచించమని యౌవనులను ప్రోత్సహించండి. నవంబరు 1, 2000 కావలికోట 19-20 పేజీల్లో “సంస్కృతికి, మనస్సాక్షికి ఘర్షణ వచ్చినప్పుడు” అనే ఉపశీర్షిక క్రిందున్న విషయాల ఆధారంగా వ్యాఖ్యానించండి.

20 నిమి: “ఉద్యోగవిరమణ—అధిక కార్యాలకు అనువైన కాలం.”b వీలైతే, యెహోవా సేవలో అధికంగా పాల్గొనేందుకు ఉద్యోగవిరమణ కాలాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రచారకుణ్ణి క్లుప్తంగా ఇంటర్వ్యూ చెయ్యండి. ఆయనెలాంటి సర్దుబాట్లు చేసుకున్నాడో తత్ఫలితంగా ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవించాడో అడగండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

జూన్‌ 16తో ప్రారంభమయ్యే వారం

పాట 1 (13)

8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

37 నిమి: మన పనిని అపార్థం చేసుకున్నప్పుడు. బ్రాంచి కార్యాలయం అందించే క్లుప్తప్రతి ఆధారంగా, అర్హతగల ఒక పెద్ద దీనిని నిర్వహించాలి.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

జూన్‌ 23తో ప్రారంభమయ్యే వారం

పాట 28 (224)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ ఏప్రిల్‌-జూన్‌ తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది) జూలై 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శనలో ప్రచారకుడు వీధి సాక్ష్యమిస్తున్నట్టు చూపండి.

20 నిమి: “‘పూర్తిగా సాక్ష్యమివ్వడానికి’ కష్టపడి పనిచెయ్యండి.”c ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. 5, 6 పేరాలు చర్చించిన తర్వాత, ఒక దుకాణంలో పనిచేసే గుమస్తాకు అనియత సాక్ష్యమిచ్చి, మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రం ఇవ్వడాన్ని క్లుప్తంగా ప్రదర్శించండి. 7, 8 పేరాలు చర్చించే ముందు వాటిని బిగ్గరగా చదివే ఏర్పాటు చెయ్యండి. ముగింపులో, “వారిని మర్చిపోకండి!” అనే బాక్సు చదివి, చర్చించండి.

15 నిమి: “సదా మారుతున్న లోకంలో ప్రకటించడం.”d 2-3 పేరాలు చర్చిస్తున్నప్పుడు, స్థానిక సేవాప్రాంతంలో సంభాషణ ఆరంభించేందుకు ఏ ప్రస్తుత సంఘటనల్ని ఉపయోగించవచ్చో ప్రేక్షకుల్ని అడగండి. 4వ పేరా చర్చిస్తున్నప్పుడు, పేర్కొనబడిన ప్రతిపాదనల్లో ఒక దానిని ఉపయోగించి క్లుప్తంగా ఒక ప్రదర్శన చేయండి.

పాట 2 (15), ముగింపు ప్రార్థన.

జూన్‌ 30తో ప్రారంభమయ్యే వారం

పాట 16 (143)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జూన్‌ క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. జూలై, ఆగస్టులలో ప్రతిపాదించే సాహిత్యాల్ని పునఃసమీక్షించండి. స్థానికంగా స్టాకులోవున్న రెండు బ్రోషుర్‌లను ఉన్నతపర్చండి. వాటిని పరిచర్యలో ఎలా ప్రతిపాదించాలో చక్కగా సిద్ధపడిన రెండు ప్రదర్శనలు చూపండి. సూచింపబడిన ప్రతిపాదనలకు, జూలై 1998 మన రాజ్య పరిచర్య 8వ పేజీ చూడండి. మరికొన్ని ప్రతిపాదనల్ని వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో “ప్రజెంటేషన్స్‌” దగ్గర “లిస్ట్‌ బై పబ్లికేషన్‌” అనే ఉపశీర్షిక క్రింద చూడండి.

15 నిమి: నిరుత్సాహాన్ని గురించి ఏమి చేయవచ్చు? కావలికోట నవంబరు 15, 1999, 28-9 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. “మంచి దృక్పథాన్ని కాపాడుకోవడం” అనే ఉపశీర్షిక క్రిందిభాగం వరకు పరిశీలించండి. లేఖన సలహాతోపాటు ఆచరణాత్మక సూచనల్ని పునఃసమీక్షించండి. తమ పరిచర్యలో ఆనందం కాపాడుకోవడానికి ఏది వారికి సహాయం చేసిందో వివరించడానికి ఒకరు లేదా ఇద్దరు ఫలవంతమైన ప్రచారకులను ముందుగానే ఏర్పాటుచేయండి.

20 నిమి: రాజ్యాన్ని ప్రకటించేందుకు దేవుని వాక్యాన్ని ఫలవంతంగా ఉపయోగించండి. ప్రేక్షకులతో సేవా పైవిచారణకర్త నిర్వహించే చర్చ. పరిచర్యలో మనం కలిసే ప్రతి వ్యక్తితో రాజ్యాన్ని గురించి క్షేమాభివృద్ధికరమైన లేఖనాంశాన్ని పంచుకోవడానికి మనం కృషిచేస్తాం. అయితే, మనం కేవలం బైబిలు వచనాలు చదవడంకంటే ఎక్కువేచెయ్యాలి. మనం వాటిని వివరించాలి, దృష్టాంతపర్చాలి, అన్వయించాలి. తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో 154-5 పేజీల్లో “మానవజాతికి అత్యవసరమైనది మానవ పరిపాలకులు అందించలేకపోతున్నారు” అని ఇటాలిక్కుల్లో ఉన్న ఉపశీర్షిక క్రిందగల కొన్ని లేఖనాల్ని ఉదాహరణలుగా ఉపయోగిస్తూ దీనినెలా చేయవచ్చో చూపండి. చర్చ తర్వాత, పునర్దర్శనంలో ఇంటి యజమానికి వ్యక్తిగతంగా రాజ్య పరిపాలనెలా ప్రయోజనకరమో చూపేందుకు ఒక లేఖనాన్ని సంక్షిప్త వివరణతో, సులభంగా దృష్టాంతపరచి, సంగ్రహంగా అన్వయించడాన్ని బాగా సిద్ధపడిన ప్రచారకుడు ప్రదర్శించడం చూపండి. ప్రచారకుడు లేఖనం చదవడంతో ప్రదర్శనను ఆరంభించండి. ప్రదర్శన తర్వాత, ఆ వచనమెలా వివరింపబడింది, దృష్టాంతపర్చబడింది, అన్వయింపబడిందో పునఃసమీక్షించండి. దేవుని వాక్యాన్ని ఫలవంతంగా ఉపయోగించే సామర్థ్యం పెంచుకోమని అందరినీ ప్రోత్సహించండి.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

జూలై 7తో ప్రారంభమయ్యే వారం

పాట 20 (93)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: స్థానిక అనుభవాలు. స్థానిక సాక్షులు (1) వేరే భాష మాట్లాడే ప్రజలకు సాక్ష్యమిస్తున్నప్పుడు లేదా (2) ఇంటింటి, వీధి సేవకాకుండా మరొక రంగంలో సాక్ష్యమిస్తున్నప్పుడు వారికి కలిగిన అనుభవాలు వివరించండి లేదా పునర్నటించి చూపండి. వేరే భాష మాట్లాడే వారిని కలిసినప్పుడు గుడ్‌ న్యూస్‌ ఫర్‌ ఆల్‌ నేషన్స్‌ అనే చిన్న పుస్తకాన్ని అలాగే ప్లీజ్‌ ఫాలోఅప్‌ (S-43) ఫారంను ఉపయోగించాలని అందరిని ప్రోత్సహించండి.—జూలై 2002, మన రాజ్య పరిచర్య 1వ పేజీ చూడండి.

25 నిమి: “దైవిక నామం తెలియజేయడం.”e ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. 4వ పేరా పరిశీలించేటప్పుడు, ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకంలో 124వ పేజీలో ఉన్న “దేవుని నామాన్ని తెలియజేయడం” అనే బాక్సులోని అంశాలమీద వ్యాఖ్యానించండి. సమర్థుడైన ప్రచారకునితో ఒక పునర్దర్శనాన్ని ప్రదర్శించి చూపండి. తర్కించడం (ఆంగ్లం) పుస్తకం 196-7 పేజీల్నుండి రెండు మూడు లేఖనాల్ని ఉపయోగిస్తూ, దేవున్ని తెలుసుకొని ఆయన నామాన్ని ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యమో చూపండి.

పాట 6 (45), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి