క్రైస్తవ పరిచర్య—మన ముఖ్యమైన పని
1 మనందరికి వివిధరకాల పనులుంటాయి. వాటిలో దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇంటివారికి అవసరమైనవి చేకూర్చడం కూడా ఒకపనే. (1 తిమో. 5:8) అయితే, ఆ దైవికాజ్ఞలో భాగమైన చేకూర్చడమనేది మన రాజ్యప్రచార పనికంటే, శిష్యులనుచేసే పనికంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది కాకూడదు.—మత్త. 24:14; 28:19, 20.
2 ‘రాజ్యాన్ని మొదట వెదకడంలో’ యేసు మనకు మాదిరి ఉంచాడు. (మత్త. 6:33; 1 పేతు. 2:21) తనకు వస్తుసంపద పెద్దగా లేకపోయినా, తండ్రి చిత్తం చేయడంలో ఆయన పూర్తిగా మునిగిపోయాడు. (లూకా 4:43; 9:58; యోహా. 4:34) అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ సాక్ష్యమిచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమించాడు. (లూకా 23:43; 1 తిమో. 6:13) కోతపనిలో తన శిష్యులుకూడా అదేరీతిలో అత్యంత శ్రద్ధగలవారై ఉండాలని ఆయన వారికి ఉద్బోధించాడు.—మత్త. 9:37, 38.
3 యేసును నేడు అనుకరించడం: క్రైస్తవ పరిచర్య మీద దృష్టి నిల్పడానికి నిరాడంబరంగా జీవించేందుకు కృషిచేయడం ద్వారా మనం యేసును అనుకరించగలం. జీవనావసర వస్తువులు మనదగ్గరవుంటే, ఈ లోకసంబంధ వస్తు సంపదల్ని అధికంగా సంపాదించే ప్రయాసం వద్దనే బైబిలు సలహాను మనం లక్ష్యపెట్టాలి. (మత్త. 6:19, 20; 1 తిమో. 6:7, 8) ప్రకటనా పనిలో విస్తృతంగా భాగంవహించేలా ప్రయత్నించడం ఎంతమేలో గదా! మనకు క్లిష్ట పరిస్థితులు ఎదురైతే, మన జీవన చింతలు రాజ్యసువార్త ప్రకటించే మన ముఖ్యమైన పనిని మరుగు చేయకుండునట్లు యేసువలే మనం తీవ్రంగా శ్రమిద్దాం.—లూకా 8:14; 9:59-62.
4 అనేక బాధ్యతలున్న వారు సహితం ప్రకటనా పనికి ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద కుటుంబం, బాధ్యతగల ఉద్యోగంతోపాటు క్రైస్తవ సంఘంలో పెద్దగా సేవచేస్తున్న ఒక సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “పరిచర్యను నా ముఖ్యపనిగా దృష్టిస్తాను.” ఒక పయినీరు సహోదరి ఇలా చెబుతోంది: “మంచి ఉద్యోగంకంటే పయినీరు సేవ మరెంతో విలువైనది.”
5 మన పరిస్థితులెట్లున్నా, మనం యేసు మాదిరిని అనుకరిద్దాం. ఎలా? క్రైస్తవ పరిచర్యను మన ముఖ్యపనిగా చేసుకోవడం ద్వారానే.