పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“బాల వేశ్యావృత్తి అంత సంతోషకరమైన విషయం కాదు. అసలు దాని గురించి చాలామంది చర్చించరు, అయినా అది రోజురోజుకూ సర్వసాధారణమైపోతోంది. దానికి పరిష్కారమేమిటని మీరు భావిస్తున్నారు? [ప్రతిస్పందించనీయండి.] బాలలపై జరుగుతున్న అతి దారుణమైన ఈ అత్యాచారాన్ని దేవుడు త్వరలోనే అంతం చేస్తాడని పరిశుద్ధ లేఖనాలు వాగ్దానం చేస్తున్నాయి. [సామెతలు 2:21, 22 చదవండి.] అది ఎలా ఆపబడుతుందో ఈ పత్రిక వివరిస్తుంది.”
కావలికోట మే 15
“దౌర్జన్యం గురించిన వార్తలు మనం రోజూ వింటుంటాం. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడైనా ఉండేవని మీరు భావిస్తున్నారా? [ప్రతిస్పందించనీయండి.] బైబిలు ఏమని చెబుతోందో గమనించండి. [మత్తయి 24:37 చదవండి.] నోవహు కాలంలో దుష్టత్వం ఎక్కువగా ఉండడం వల్ల దేవుడు, నోవహును ఆయన కుటుంబాన్ని తప్ప అందరినీ నాశనం చేశాడు. ఆ సంఘటనలకు నేడు మన జీవితంలో ఏమి ప్రాముఖ్యత ఉందో ఈ పత్రిక మీకు తెలియజేస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“ఎంపిక చేసుకునే మీ స్వాతంత్ర్యాన్ని మీరు విలువైనదిగా ఎంచుతారు కదూ? [ప్రతిస్పందించనీయండి.] అయితే కేవలం అలాంటి స్వాతంత్ర్యం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి సరైన ఎంపికే చేసుకుంటాడనే హామీ ఉండదు. జ్ఞానవంతమైన ఎంపిక చేసుకోవడానికి మనకు సహాయపడగల సూత్రాలేమైనా ఉన్నాయా? [ప్రతిస్పందించిన తర్వాత, గలతీయులు 6:7 చదివి 12వ పేజీ సూచించండి.] ఈ పత్రికలో మీకు జవాబు లభిస్తుంది.”
కావలికోట జూన్ 1
“విరాళంగా ఇవ్వబడిన మూలధనం దుర్వినియోగం చేయబడుతోందనే నివేదికలు, ధర్మసంస్థలకు విరాళాలు ఇవ్వడం మంచిదేనా అని కొందరిని సందేహింపజేస్తున్నాయి. అయితే అవసరంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఈ విషయంలో ఏమి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనీయండి. ఆ తర్వాత హెబ్రీయులు 13:16 చదవండి.] దేవునికి సంతోషం కలిగించే దానం గురించి ఈ పత్రిక మీకు వివరిస్తుంది.”