ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్‌లో: కావలికోట, తేజరిల్లు! పత్రికలను ప్రతిపాదించండి. ఆసక్తిగలవారిని—వీరిలో జ్ఞాపకార్థ ఆచరణకు మరియు/లేదా ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకు హాజరైనప్పటికీ సంఘంతో చురుగ్గా సహవసించని వారు కూడా ఉండవచ్చు—పునర్దర్శిస్తున్నప్పుడు ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) పుస్తకాన్ని ప్రతిపాదించడంపై అవధానం నిలపండి. గృహ బైబిలు అధ్యయనాన్ని ఆరంభించేందుకు, ప్రత్యేకించి ఇప్పటికే జ్ఞానము పుస్తకము, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లతో అధ్యయనం పూర్తి చేసినవారితో ఈ కొత్త పుస్తకం నుండి అధ్యయనం చేయడానికి అన్ని విధాల కృషి చేయాలి. మేలో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. దీనికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాలలో దేనినైనా ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా అందించవలసిన పుస్తకాల స్టాకు సంఘంలో లేనట్లయితే, దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా మీకు ఇవ్వగలిగేంత అదనపు స్టాకు ఉందేమో దయచేసి చూడండి. జూన్‌లో: జ్ఞానము పుస్తకాన్ని లేదా దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. గృహస్థుల దగ్గర ఈ ప్రచురణలు అప్పటికే ఉంటే సంఘంలో స్టాకున్న మరో సముచితమైన బ్రోషుర్‌ను ఉపయోగించండి. జూలై, ఆగస్టుల్లో: క్రింద ప్రస్తావించబడిన 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.
◼ సంఘ పైవిచారణకర్తల, కార్యదర్శులందరి చిరునామాలనూ టెలిఫోన్ నంబర్లనూ బ్రాంచి కార్యాలయం అప్-టు-డేట్‌గా నమోదు చేసుకోవాలి. కాబట్టి చిరునామా లేదా టెలిఫోన్ నంబరు మారినట్లయితే సంఘ సేవా కమిటి, సంఘ పైవిచారణకర్త/కార్యదర్శి చిరునామా మార్పు పత్రం (S-29)ను పూరించి, సంతకం చేసి వెంటనే బ్రాంచి కార్యాలయానికి పంపించాలి. టెలిఫోన్ ఎస్‌టిడి కోడ్‌లు మారితే వాటిని కూడా తెలియజేయాలి.
◼ క్రమ పయినీరు సేవా దరఖాస్తు (S-205) ఫారాలూ, సహాయ పయినీరు సేవా దరఖాస్తు (S-205b) ఫారాలూ సంఘంలో కావలసినన్ని ఉండేలా సంఘ కార్యదర్శులు చూసుకోవాలి. ఈ ఫారాలను సాహిత్యాలను కోరే పత్రం (S-14) ద్వారా ఆర్డర్ చేయవచ్చు. కనీసం ఒక సంవత్సరానికి సరిపడేన్ని ఫారాలు ఉండేలా చూడండి. వచ్చిన క్రమ పయినీరు దరఖాస్తులన్నీ పూర్తిగా నింపబడ్డాయో లేదో నిర్ధారించుకోవడానికి వాటిని పరిశీలించండి. దరఖాస్తుదారులకు తాము బాప్తిస్మం తీసికొన్న ఖచ్చితమైన తారీఖు గుర్తులేకపోతే, వాళ్ళు ఆ తారీఖును అంచనా వేసుకొని వ్రాసిపెట్టుకోవాలి.
◼ మీరు సొంత పనులమీద విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశంలోని సంఘ కూటాలకు, ప్రాంతీయ సమావేశానికి, లేదా జిల్లా సమావేశానికి హాజరవ్వాలనుకుంటే వాటి తేదీలు, సమయాలు, చిరునామాలను గురించిన సమాచారం కోసం మీరు వెళ్ళే దేశాన్ని పర్యవేక్షించే బ్రాంచి కార్యాలయానికి వ్రాసి తెలుసుకోండి. బ్రాంచి కార్యాలయాల చిరునామాలు ఇప్పటి వార్షికపుస్తకం (ఆంగ్లం) చివరిపేజీలో ఉన్నాయి.
◼ ప్రతి సంఘానికి ఫిబ్రవరి నెల స్టేట్‌మెంట్‌తో పాటు వార్షిక ఐటమ్స్ కోసం స్పెషల్ రిక్వెస్ట్ ఫారమ్ పంపించబడింది. 2003 సమావేశపు బ్యాడ్జి కార్డులు, 2004 సంవత్సరానికి కావల్సిన వార్షిక ఐటమ్స్‌ను ఇంకా రిక్వెస్ట్ చెయ్యని సంఘాలు తమ రిక్వెస్ట్‌లను వెంటనే పంపించాలి.
◼ లిటరేచర్ ఐటమ్స్ కోసమైన వార్షిక క్యాలెండర్ ప్రకారం, లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌లో (S-14) ఇవ్వబడిన ఫారాలను రాబోయే సేవా సంవత్సరం కోసం ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో రిక్వెస్ట్ చెయ్యాలి. కాబట్టి దయచేసి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌లోని అన్ని ఫారాలనూ ఒక సంవత్సరానికి సరిపడా ఆర్డర్ చెయ్యండి. దాన్ని ఏప్రిల్ నెల కోసం మీరు ఆర్డర్ చేసే సాహిత్యం రిక్వెస్ట్‌తో పాటు పంపించండి. ఫారాలను ఆర్డర్ చేయడానికి దయచేసి ప్రత్యేకమైన ఉత్తరాన్ని గానీ ప్రత్యేకమైన లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌ను గానీ ఉపయోగించకండి; అది మీ సాహిత్య రిక్వెస్ట్‌తో కలిపి పంపించబడాలి. దయచేసి వాచ్‌టవర్ లిటరేచర్ రిక్వెస్ట్ గైడ్, 4వ సెక్షన్, 1వ పేజీ చూడండి.
◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:
“హౌ టు ఇంప్రూవ్ యువర్ స్పీకింగ్ అండ్ టీచింగ్ అబిలిటీ—అస్సామీ, మిజో
ఈ లోకం నిలుస్తుందా? (కరపత్రం సంఖ్య. 19)—మణిపురి
లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (కరపత్రం సంఖ్య. 22)—మణిపురి