సత్క్రియలు చేయడంలో మాదిరిగా ఉండండి
1. జిల్లా సమావేశంవద్ద మన ప్రవర్తన విషయంలో మనమెందుకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి?
1 జిల్లా సమావేశాల వద్ద మనం పెద్ద సంఖ్యలో సమావేశమైనప్పుడు మన ప్రవర్తనా విధానాన్ని, తోటివారితో వ్యవహరించే పద్ధతిని ఇతరులు సులభంగా గమనిస్తారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ఈ బైబిలు ఉపదేశానికి ప్రత్యేక అవధానమివ్వాలి: ‘స్వస్థబుద్ధిగలిగి యుండి అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము.’ (తీతు 2:6, 7) ‘మన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూసేందుకు’ అదనపు కృషి అవసరమవ్వచ్చు. (ఫిలి. 2:4) రానున్న “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశంలో మనం ఈ ఉపదేశాన్ని అన్వయించగల కొన్ని ప్రాంతాలను పరిశీలిద్దాము.
2. రూమింగ్ ఏర్పాట్లకు సంబంధించి మనం ఏ విషయాలను మనస్సులో ఉంచుకోవాలి?
2 రూమింగ్ ఏర్పాట్లు: రూమింగ్ ఏర్పాట్లు చేసుకునేటప్పుడు మనం సత్క్రియలను ప్రదర్శించడానికి చక్కని అవకాశముంటుంది. మీరు ఉపయోగించాలనుకునే హోటల్ రూమ్‌ను మాత్రమే బుక్ చేసుకోండి. అడ్వాన్సుగా తగిన డబ్బు పంపించండి. హోటల్ చెక్-ఇన్, చెక్ అవుట్ సమయాల్లో రద్దీగా ఉన్నప్పుడు మనం దేవుని ఆత్మ ఫలాల్ని ప్రదర్శించడం ఎంతో ప్రశంసనీయం.—గల. 5:22.
3. సమావేశ ప్రాంతంలో మనం యెహోవా ఘనతను ఎలా అధికం చేయవచ్చు?
3 సమావేశ ప్రాంతంలో: మనం సమావేశాల కోసం అద్దెకు తీసుకునే హాళ్ళను, సాధారణంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు దుర్వినియోగం చేయడం, విధ్వంసం చేయడం, చెత్తా చెదారం పడవేయడమే కాక ఇంకా ఇతర విధాలుగా పాడుచేసివుంటారు. మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు మన పరిశుద్ధ దేవుడైన యెహోవా ప్రమాణానికి ఎంతో తక్కువ స్థాయిలో ఉంటాయి. ఈ పరిస్థితిని మార్చడానికి మీరేమి చేయవచ్చు? మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి, ఆడిటోరియమ్ ఊడ్వడానికి, కూర్చునే సీట్లు కడగడానికి, అవసరమైన ఇతర పనులు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. సమావేశ ప్రాంతమంతా మన పరిశుద్ధ దేవుని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా నిశ్చయపరచుకోండి. దాని ద్వారా ఇతరులకు మనపై కలిగే సదభిప్రాయము యెహోవా “కీర్తి ఘనత పేరు”ను అధికం చేస్తుంది.—ద్వితీ. 26:19.
4, 5. పిల్లలు యెహోవాకు స్తుతి ఎలా తీసుకురాగలరు, తల్లిదండ్రులకు ఎలాంటి బాధ్యత ఉంది?
4 తల్లిదండ్రులు, పిల్లలు: ఎంతోమంది యౌవనులు అగౌరవంగా ప్రవర్తించే ఈ లోకంలో మన పిల్లలు ప్రత్యేకంగా కనబడతారు, అది యెహోవాకు ఆయన సంస్థకు ఘనతను తెస్తుంది. అయితే కొన్నిసార్లు పిల్లలను సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్ల సమస్యలు తలెత్తాయి. (సామె. 29:15) తల్లిదండ్రులు తమ పిల్లలను హోటల్లో లేదా స్విమ్మింగ్ పూల్ వద్ద, సమావేశ ప్రాంతంలో ఒంటరిగా వదిలిపెట్టకూడదు.
5 తమ పిల్లల నుండి ఎలాంటి ప్రవర్తన ఆశించబడుతుందో సమావేశానికి వెళ్ళే ముందు తమ పిల్లలతో చర్చించడం సహాయకరంగా ఉన్నట్లు కొంతమంది తల్లిదండ్రులు కనుగొన్నారు. (ఎఫె. 6:4) స్వచ్ఛమైన క్రైస్తవ ప్రేమ “అమర్యాదగా నడువదు” లేదా “స్వప్రయోజనమును విచారించుకొనదు” అని అర్థం చేసుకోవడానికి వారు తమ పిల్లలకు సహాయపడతారు. (1 కొరిం. 13:5) జిల్లా సమావేశ సమయం యెహోవాచే ఉపదేశించబడేందుకు కేటాయించబడిన సమయం కాబట్టి, పిల్లలూ పెద్దలూ సమావేశ ప్రాంతంలోను ఇతర ప్రాంతాల్లోను తమ ప్రవర్తన ద్వారా ఈ ఏర్పాటుపట్ల గౌరవం చూపించాలి.—యెష. 54:13.
6. మన సత్ప్రవర్తన ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలదు?
6 ప్రజలకున్న తప్పుడు అభిప్రాయాలను సరిదిద్దడానికి, వారిని సత్యారాధనవైపు ఆకర్షించడానికి మన సత్ప్రవర్తన ఎంతో సహాయం చేస్తుంది. (మత్త. 5:16; 1 పేతు. 2:12) జిల్లా సమావేశం వద్ద మనం కలిసే వారందరూ మన ప్రవర్తనను బట్టి, మనం వారితో వ్యవహరించే విధానాన్ని బట్టి అనుకూలమైన సాక్ష్యం పొందుదురు గాక. ఈ విధంగా మనం “సత్కార్యములవిషయమై మాదిరిగా కనుపరచుకొ[ని]” యెహోవాను మహిమపరుస్తాము.—తీతు 2:7.
[4వ పేజీలోని బాక్సు]
ఇతరులను పరిగణలోకి తీసుకోండి
◼ మీరు ఉపయోగించాలనుకునే రూమ్ మాత్రమే బుక్ చేసుకోండి
◼ హోటల్ చెక్-ఇన్, చెక్ అవుట్ సమయాల్లో రద్దీగా ఉన్నప్పుడు సహనం చూపించండి
◼ సమావేశ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో సహకరించండి
◼ మీ పిల్లలను సరిగ్గా పర్యవేక్షించండి
◼ సముచితమైన టిప్ ఇవ్వండి