వుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి ఉపయోగించండి
ఏకైక సత్యదేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) పుస్తకం, కొత్తవాళ్ళు సత్యంలో ముందుకు సాగేందుకు, యెహోవా పట్ల ఆయన సంస్థ పట్ల తమ కృతజ్ఞతను ప్రగాఢపరచుకునేందుకు సహాయం చేయడానికి రూపొందించబడింది. బైబిలు విద్యార్థులతో అధ్యయనం చేయడానికి దీన్ని రెండవ పుస్తకంగా ఉపయోగించవచ్చు. 2000, జూన్ మన రాజ్య పరిచర్యలోని 4వ పేజీలో ఇలా వివరించబడింది: “నెమ్మదిగానే అయినప్పటికీ, ఒక వ్యక్తి అభివృద్ధి సాధిస్తున్నాడనీ, తను నేర్చుకుంటున్న విషయాల పట్ల మెప్పుదల చూపిస్తున్నాడనీ స్పష్టమైతే, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ నుండి, జ్ఞానము పుస్తకం నుండి అధ్యయనం పూర్తి అయిన తర్వాత అప్పుడు రెండవ పుస్తకాన్నుండి బైబిలు అధ్యయనం కొనసాగించండి. . . . ప్రతి సందర్భంలోనూ దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్, జ్ఞానము పుస్తకం మాత్రం మొదట అధ్యయనం చేయాలి. రెండవ పుస్తకం పూర్తికాకముందే విద్యార్థి బాప్తిస్మం తీసుకున్నాసరే, బైబిలు అధ్యయనాన్ని, పునర్దర్శనాలను, ఆ అధ్యయనం కొనసాగడానికి తీసుకున్న సమయాన్ని రిపోర్టు చేయాలి.”
దేవుణ్ణి ఆరాధించండి పుస్తకంతో అధ్యయనం చేయడం ద్వారా ఇంకా ఎవరు ప్రయోజనం పొందవచ్చు? అదే ఆర్టికల్ ఇంకా ఇలా కొనసాగింది: “గతంలో [దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ను,] జ్ఞానము పుస్తకాన్ని అధ్యయనం చేసి సమర్పణా బాప్తిస్మముల వరకూ ఎదగలేకపోయిన వారెవరి గురించైనా మీకు తెలిస్తే, వాళ్ళు తిరిగి అధ్యయనం ప్రారంభించాలని ఇష్టపడుతున్నారేమో తెలుసుకోవటానికి మీరు చొరవ తీసుకోవచ్చు.” అలాంటివారితో ఈ మార్చి, ఏప్రిల్ నెలల్లో దేవుణ్ణి ఆరాధించండి పుస్తకంతో బైబిలు అధ్యయనాలు ఆరంభించడానికి ప్రత్యేక ప్రయత్నం చేద్దాం.