కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/03 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2003
మన రాజ్య పరిచర్య—2003
km 3/03 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చిలో: గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషి చేస్తూ జ్ఞానము పుస్తకాన్ని అందించండి. ఏప్రిల్‌లో: కావలికోట, తేజరిల్లు!లను ప్రతిపాదించండి. ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు ఇవ్వదలచుకుంటే ఇవ్వవచ్చునని ప్రచారకులు గృహస్థులకు సూచించాలి. ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) పుస్తకాన్ని ప్రతిపాదించడంపై శ్రద్ధ చూపించండి. గృహ బైబిలు అధ్యయనాన్ని ఆరంభించేందుకు, ప్రత్యేకించి ఇప్పటికే జ్ఞానము పుస్తకము, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లతో అధ్యయనం పూర్తి చేసినవారితో ఆరంభించేందుకు అన్ని విధాల ప్రయత్నించండి. మేలో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. దీనికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాలలో దేనినైనా ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా అందించవలసిన పుస్తకాల స్టాకు సంఘంలో లేనట్లయితే, దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా మీకు ఇవ్వగలిగేంత అదనపు స్టాకు ఉందేమో దయచేసి చూడండి. జూన్‌లో: జ్ఞానము పుస్తకాన్ని లేదా దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. గృహస్థుల దగ్గర ఇవి అప్పటికే ఉంటే సంఘంలో స్టాకున్న మరో సముచితమైన పుస్తకాన్ని ఉపయోగించండి.

◼ ఏప్రిల్‌లో సహాయ పయినీరు సేవ చేయాలనుకునే ప్రచారకులు ఇప్పుడే పథకాలను వేసుకొని, తమ దరఖాస్తులను ముందుగానే ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పెద్దలు క్షేత్రసేవకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి, తగినన్ని పత్రికలు, ఇతర సాహిత్యాలు అందుబాటులో ఉంచడానికి సహాయంగా ఉంటుంది. సహాయ పయినీరు సేవ చేయడానికి ఆమోదం పొందిన వారి పేర్లను ప్రతి నెలా సంఘంలో ప్రకటించాలి.

◼ సాహిత్యాలను పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసే రిక్వెస్ట్‌లను బ్రాంచి కార్యాలయం అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను బ్రాంచికి పంపించే ముందు ప్రతి నెలా దాని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావల్సిన సాహిత్యాలను తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల బాధ్యతను నిర్వహిస్తున్న సహోదరునికి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.

◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:

దైవపరిపాలనా పరచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి —ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ

బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను?—అస్సామీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి