జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించి గుర్తుంచుకోవలసిన విషయాలు
జ్ఞాపకార్థ ఆచరణ, ఈ సంవత్సరం ఏప్రిల్ 16, బుధవారం జరుగుతుంది. పెద్దలు ఈ క్రింది విషయాల్లో శ్రద్ధ వహించాలి:
◼ కూటమి నిర్వహించే సమయాన్ని నిర్ణయించేటప్పుడు, సూర్యాస్తమయానికి ముందుగా చిహ్నాలు అందించబడకుండా ఉండేలా నిశ్చయపరచుకోండి.
◼ ప్రసంగీకునితోపాటు ప్రతి ఒక్కరికీ ఈ ఆచరణ జరిగే ఖచ్చితమైన సమయాన్నీ, స్థలాన్నీ తెలియజేయాలి.
◼ జ్ఞాపకార్థ ఆచరణకు తగిన రొట్టెనూ, ద్రాక్షారసాన్నీ సేకరించి, సిద్ధంగా ఉండేలా చూడాలి.—1985 ఫిబ్రవరి 15, కావలికోట (ఆంగ్లం), 19వ పేజీ చూడండి.
◼ ప్లేట్లనూ, గ్లాసులనూ, సముచితమైన టేబుల్నీ, టేబుల్క్లాత్నీ ఆచరణ జరిగే స్థలానికి ముందుగానే తీసుకొచ్చి, వాటికి కేటాయించబడిన స్థలంలో ఉంచాలి.
◼ ఈ కూటమి జరిగే స్థలాన్ని, అది రాజ్యమందిరమైనా సరే, లేక మరో చోటైనా సరే, దానిని ముందుగానే బాగా శుభ్రపరచి ఉంచాలి.
◼ అటెండెంట్లనూ, చిహ్నాలు అందించే వారినీ ఎంపికచేసుకొని వారు చేయవలసిన పనుల గురించి, అనుసరించవలసిన సరైన పద్ధతి గురించి, హుందాగావుండే వస్త్రధారణ కేశాలంకరణల ప్రాముఖ్యత గురించి ముందుగానే సలహాలివ్వాలి.
◼ అనారోగ్యంతో ఉండి, హాజరుకాలేని స్థితిలోవున్న అభిషిక్తులు ఎవరైనా ఉంటే వారికి చిహ్నాలను అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
◼ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగించుకుంటున్నట్లయితే వరండాలో లేదా ప్రవేశ మార్గాల్లో, ఫుట్పాత్లపైనా, పార్కింగ్ స్థలాల్లోనూ అనవసర రద్దీలేకుండా జాగ్రత్త పడేందుకు సంఘాల మధ్య మంచి సమన్వయం ఉండాలి. వీలైన చోట ఆచరణకు ఆచరణకు మధ్య 45 నిమిషాల వ్యవధి ఇవ్వడం మంచిది.