కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/03 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 2/03 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జన.-మార్చి.

“ఎయిడ్స్‌తో సహా వ్యాధులన్నింటినీ వైద్యశాస్త్రం ఎన్నటికైనా నిర్మూలిస్తుందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] “నాకు దేహములో బాగులే[దు]” అని ఎవ్వరూ అనని ఒక కాలం రాబోతుందని మన సృష్టికర్త వాగ్దానం చేశాడు. [యెషయా 33:24 చదవండి.] ఎయిడ్స్‌ స్వైరవిహారం ఎన్నటికైనా ఆగుతుందా? అనే ప్రశ్నకు ఈ తేజరిల్లు! సంచిక జవాబిస్తుంది.”

కావలికోట ఫిబ్ర. 15

“వ్యక్తిత్వంగల దేవుడు ఉన్నాడా అని కొంతమంది ప్రజలు ఆలోచిస్తుంటారు. ఆయన ఉనికిలో ఉన్నాడు కానీ తమనుండి చాలా దూరంగా ఉన్నాడు అని మరికొందరు అంటారు. మీరు ఈ విషయం గురించి ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం ఎందుకు అంత ప్రాముఖ్యమో ఇక్కడ గమనించండి. [యోహాను 17:3 చదవండి.] ఈ విషయంలో ఈ సంచిక ప్రారంభపు ఆర్టికల్‌లు ఆసక్తికరంగా ఉన్నాయని మీరు తెలుసుకుంటారు.”

తేజరిల్లు! జన.-మార్చి.

“అనేకమంది ప్రజలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చెడు అలవాట్లు ఉంటాయి, వాటిని అధిగమించడానికి మనం కృషి చేయాలని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మనలో చాలామంది అలా చేయాలనుకుంటున్నప్పటికీ, ఈ వచనంలో చెప్పబడిన పరిస్థితి మన విషయంలో కూడా నిజమయ్యే అవకాశముందని మీకు అనిపించవచ్చు. [రోమీయులు 7:18, 19 చదవండి.] తేజరిల్లు! యొక్క ఈ సంచిక [26వ పేజీని చూపించండి] దేవుని దృక్కోణాన్ని వివరిస్తుంది, ఎలాంటి చెడు అలవాటునైనా అధిగమించడానికి సహాయం చేయగలదు.”

కావలికోట మార్చి 1

“ఆసక్తికరమైన ఈ లేఖనంపై మీ అభిప్రాయం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. [మత్తయి 5:10 చదవండి.] ఒక వ్యక్తి హింసించబడుతున్నప్పుడు ఆయన ఎలా సంతోషంగా ఉండగలడు? [ప్రతిస్పందించనివ్వండి.] బాధలు అనుభవిస్తున్నప్పటికీ తమ సంతోషాన్ని కాపాడుకొన్న కొంతమంది గురించి ఈ పత్రికలోని మొదటి రెండు ఆర్టికల్‌లు చెబుతున్నాయి. వారు అలా ఎలా ఉండగలిగారో చదవడం మీకు ఆసక్తికరంగా ఉంటుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి