కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/03 పేజీ 5
  • సరైన సమయంలో సహాయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సరైన సమయంలో సహాయం
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిష్క్రియులుగా ఉన్నవారిని మరచిపోవద్దు
    మన రాజ్య పరిచర్య—2007
  • ప్రశ్నా భాగం
    మన రాజ్య పరిచర్య—2000
  • “నా దగ్గరికి తిరిగిరండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • వీలైనంత త్వరగా తిరిగివచ్చేందుకు వారికి సహాయం చేయండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 2/03 పేజీ 5

సరైన సమయంలో సహాయం

1 అపొస్తలుడైన పేతురు తోటి విశ్వాసులను బలపరచవలసిన అవసరాన్ని చూసినప్పుడు, వారికి ప్రేమపూర్వకమైన జ్ఞాపికలనూ ప్రోత్సాహాన్నీ ఇవ్వడానికి వారిపట్ల ఆయనకున్న శ్రద్ధ ఆయనను కదిలించింది. (2 పేతు. 1:12-14; 3:1) “యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞాన విషయములో . . . సోమరులైనను నిష్పలులైనను కాకుండ” ఉండడానికి ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకొమ్మని ఆయన “విశ్వాసము పొందినవా[రిని]” ప్రోత్సహించాడు. (2 పేతు. 1:1, 5-8) వారు యెహోవా నుండి పొందిన పిలుపును, ఏర్పాటును నిశ్చయపరచుకోవడానికి వారికి సహాయం చేయాలన్నదే పేతురు ఉద్దేశం. అలా చేస్తే వారు చివరికి “శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడ”వచ్చు. (2 పేతు. 1:10, 11; 3:14) ఆయనిచ్చిన ప్రోత్సాహం చాలామందికి సరైన సమయంలో సహాయంగా ఉంది.

2 నేడు క్రైస్తవ పైవిచారణకర్తలు దేవుని ప్రజలపట్ల అలాంటి శ్రద్ధతోనే ఉన్నారు. ఈ “అపాయకరమైన కాలము”లలో యెహోవా సేవకుల్లోని అనేకులు కష్టమైన పరిస్థితులను సహించాలి. (2 తిమో. 3:1) అధికమవుతున్న ఆర్థిక, కుటుంబ, వ్యక్తిగత సమస్యలవల్ల చాలామంది దావీదులానే ఇలా భావిస్తారు: “లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలయెత్తి చూడలేకపోతిని; లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి, నా హృదయము అధైర్యపడి యున్నది.” (కీర్త. 40:12) ఈ ఒత్తిళ్ళు, వాటికి గురవుతున్నవారు ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేసి, క్రైస్తవ పరిచర్యలో భాగం వహించడాన్ని ఆపేసేంత భారంగా తయారయ్యే అవకాశం ఉంది. వారు కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ వారు యెహోవా ‘ఆజ్ఞలను మరచిపోలేదు.’ (కీర్త. 119:176) అలాంటి వారికి అవసరమైన సహాయాన్ని అందజేయడానికి పెద్దలకు ఇదే తగిన సమయం.—యెష. 32:1, 2.

3 ఆ అవసరాన్ని తీర్చడానికి, ప్రస్తుతం ప్రకటనా పనిలో అంత చురుగ్గా లేనివారికి సహాయపడేందుకు ప్రత్యేకమైన కృషి చేయమని పెద్దలు ప్రోత్సహించబడ్డారు. అలా చేయడానికి ఇప్పుడు తీవ్రమైన కృషి చేయబడుతోంది, అది మార్చి నెలాఖరు వరకూ కొనసాగుతుంది. సంఘ కార్యకలాపాల్లో వారు తిరిగి భాగం వహించేందుకు సహాయపడాలన్న ఉద్దేశంతో వారికి ఆధ్యాత్మిక సహాయాన్ని అందించడానికి నిష్క్రియులైన వారిని సందర్శించమని పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు కోరబడుతున్నారు. అవసరమైన చోట వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇతర ప్రచారకుల సహాయాన్ని కూడా కోరవచ్చు. ఒకవేళ మీ సహాయం కోరబడితే మీరు చేసే కృషి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు, ప్రత్యేకించి మీరు దయాపూర్వకంగా, అర్థం చేసుకునే విధంగా ప్రోత్సాహాన్నిస్తే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

4 ఒక వ్యక్తి సంఘ కార్యకలాపాల్లో తిరిగి భాగం వహించడం ప్రారంభించినప్పుడు అందరూ సంతోషించడానికి కారణముంటుంది. (లూకా 15:6) నిష్క్రియులైనవారిని ప్రోత్సహించడానికి మనం చేసే కృషి నిజంగా “సమయోచితముగా పలుకబడిన మాట”వలే ఉంటుంది.—సామె. 25:11.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి