కొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
1 సమాచార మాధ్యమాలు, విద్యావేత్తలు భౌతిక సంపదలను విలువైన వాటిగా చూస్తారు, కానీ దేవుని వాక్యం మనల్ని “సత్క్రియలు అనే ధనముగలవారిగా ఉండండి” అని ప్రోత్సహిస్తోంది. (1 తిమో. 6:18) ఏప్రిల్ 2003లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమ అంశం అదే. ఈ సమావేశంలో మనం ఏ ప్రోత్సాహాన్ని పొందుతాము?
2 “దేవుని దృక్కోణం నుండి ధనవంతులుగా ఉండండి” అనే ప్రసంగంలో దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండడం అంటే ఏమిటో ప్రాంతీయ పైవిచారణకర్త చర్చిస్తాడు, ఆధ్యాత్మిక సంపదలను కూడబెట్టుకోవడానికి కష్టించి పనిచేస్తున్న కొందరిని ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు. సందర్శిస్తున్న ప్రసంగీకుడు ఇచ్చే మొదటి ప్రసంగంలో దేవుని ప్రజలు, “ఈ కోతకాలంలో సత్క్రియలు” ఎలా చేస్తున్నారో తెలియజేస్తాడు. నేడు జరుగుతున్న దేవుడు నియమించిన కోతపనిలో మనం ఇంకా ఎక్కువగా ఎలా భాగం వహించవచ్చో ఆలోచించడానికి మనలో ప్రతి ఒక్కరం ప్రోత్సహించబడతాము.
3 యౌవన క్రైస్తవులు ఆధ్యాత్మిక సంపదలను కూడబెట్టుకోవడం చూసినప్పుడు మనం ఎంతగా సంతోషిస్తామో! అది యెహోవాకు ఘనత తెస్తుంది, యౌవనులు భవిష్యత్తులో సేవాధిక్యతలను అందుకోవడానికి చక్కని పునాదిని వేస్తుంది. “యెహోవాను స్తుతించడంలోని సత్క్రియలకు యౌవనులను మెచ్చుకోవడం” అనే భాగం, యౌవన క్రైస్తవులు స్థానికంగా చేస్తున్న సత్క్రియలను ప్రముఖంగా తెలియజేస్తుంది.
4 సత్క్రియలు చేయడానికి కృషి చేయడంవల్ల వచ్చే ప్రతిఫలాలు ఏమిటి? సందర్శిస్తున్న ప్రసంగీకుడు “సత్క్రియలు చేస్తూ యెహోవా ఆశీస్సులను అనుభవిస్తుండండి” అనే తన ఆఖరి ప్రసంగంలో ఆ విషయాన్ని చర్చిస్తాడు. (1) వ్యక్తిగతంగా, (2) కుటుంబాలుగా, (3) ఒక సంఘంగా, (4) ఒక ప్రపంచవ్యాప్త సంస్థగా మనం పొందగల ఆశీర్వాదాల గురించి ఆయన చర్చిస్తాడు.
5 యెహోవాకు సమర్పించుకున్నవారు బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే వెంటనే సంఘ పైవిచారణకర్తకు తెలియజేయండి.
6 మీ ప్రాంతంలో జరిగే సమావేశ తేదీ ప్రకటించబడినప్పుడు, దానికి హాజరవడానికి వెంటనే నిర్దిష్టమైన ఏర్పాట్లు చేసుకోండి. ప్రారంభపు పాటలో, ప్రార్థనలో భాగం వహించడానికి ముందుగానే వెళ్ళేందుకు ప్రయత్నించండి. ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమమంతటికీ హజరై జాగ్రత్తగా వింటే, మన దేవుడైన యెహోవా దృష్టిలో మనల్ని నిజంగా ధనవంతుల్ని చేసే మార్గంలో కొనసాగడానికి అది మనల్ని బలపరుస్తుంది.