దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఈ క్రింది ప్రశ్నలు ఫిబ్రవరి 24, 2003వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త 2003, జనవరి 6 నుండి ఫిబ్రవరి 24 మధ్య వారాల్లోని నియామకాల సమాచారాన్ని 30 నిమిషాలు పునఃసమీక్షిస్తారు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేని వాటికి మీరు స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. తప్పా ఒప్పా: వ్రాసిన దానికి కాస్త అటూ ఇటూ తేడా ఉన్నా చదివేది మాత్రం బాగానే ఉందనిపించేలా నిర్ధారించుకోవడమే సరిగ్గా చదవడానికి కీలకం. వివరించండి. [be 83వ పేజీ]
2. ఖాళీలను పూరించండి: సరిగ్గా చదివేందుకు ఒక వ్యక్తి _________________________ , _________________________ , _________________________, బిగ్గరగా చదువుతూ అభ్యసించాలి. [be 85వ పేజీ]
3. స్పష్టంగా మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం? (1 కొరిం. 14:8, 9) [be 86వ పేజీ]
4. సంభాషణను అస్పష్టం చేసే కొన్ని విషయాలు ఏమిటి, మరింత స్పష్టంగా మాట్లాడడానికి మనం ఏమి చేయవచ్చు? [be 87-8 పేజీలు]
5. గత రెండు నెలల్లో జరిగిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఉపయోగించిన పదాల్లో, సరిగ్గా ఉచ్చరించడానికి మీరు అభ్యసించవలసిన అవసరముందనిపించిన కొన్ని పదాలు ఏవి? [be 92వ పేజీ]
ఒకటవ నియామకం
6. తప్పా ఒప్పా: వినడానికి మన కళ్ళు సహాయం చేసే అవకాశముంది. వివరించండి. [be 14వ పేజీ]
7. ఖాళీలను పూరించండి: _________________________ , _________________________ , _________________________ అన్నీ దేవుడిచ్చిన సమయ సూచికలుగా పని చేస్తాయి. [si 279వ పేజీ, 7వ పేరా]
8. ఖాళీలను పూరించండి: బైబిలు వాడుకలో “దినము” అనే పదం _________________________ గంటలు, _________________________ గంటలు, _________________________ సంవత్సరాలు, లేదా _________________________ కాలాన్ని సూచించవచ్చు, అది దేన్ని సూచిస్తోందో ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. [si 279వ పేజీ, 8వ పేరా]
9. నిరుత్సాహాన్ని విజయవంతంగా అధిగమించేందుకు హన్నా, మార్కు, ఏలీయాల ఉదాహరణలు మనకెలా సహాయపడవచ్చు? ఇతరులకు సహాయపడడానికి వీరి ఉదాహరణలను మనమెలా ఉపయోగించవచ్చు? [w01 2/1 20-3 పేజీలు]
10. ప్రాచీన అథ్లెటిక్ ఆటలపోటీల గురించిన అవగాహన కొన్ని బైబిలు వచనాలను అర్థం చేసుకోవడాన్ని ఎలా సులభతరం చేస్తుంది? ఈ సమాచారం మన జీవితాలను ఎలా ప్రభావితం చెయ్యాలి? [w01 1/1 28-31 పేజీలు]
వారపు బైబిలు పఠనం
11. తప్పా ఒప్పా: 1914లో దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడింది కాబట్టి “నీ రాజ్యము వచ్చుగాక” అని ఇప్పుడు ప్రార్థించడం సముచితం కాదు. (మత్త. 6:9, 10) వివరించండి. [be 279వ పేజీ; w96 6/1 31వ పేజీ]
12. తప్పా ఒప్పా: మత్తయి 11:24 లో నమోదైన యేసు మాటలకు సొదొమ గొమొఱ్ఱాలో అగ్ని చేత నాశనం చేయబడినవారు పునరుత్థానం చేయబడతారని అర్థం. వివరించండి.
13. బహుత్వ ఎంపిక: మత్తయి 24:45-47 వచనాల్లో యేసు ప్రస్తావించిన “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” (ఎ) యెహోవాసాక్షుల పరిపాలక సభ; (బి) ఏదైనా నిర్దిష్టమైన సమయంలోని భూమ్మీది అభిషిక్త క్రైస్తవులందరి గుంపు; (సి) స్వయంగా యేసుక్రీస్తే. ఈ దాసుడు “యింటివారికి” ప్రాతినిధ్యం వహించే (ఎ) ఒక్కొక్క వ్యక్తిగా అభిషిక్తులందరికీ; (బి) వేరే గొఱ్ఱెలకు; (సి) క్రైస్తవ సాహిత్యాలను చదివే వాళ్ళందరికీ సమయోచితంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తాడు. యజమాని తన యావదాస్తిమీద ఈ దాసుడ్ని (ఎ) 1914లో; (బి) సా.శ. 33లో; (సి) 1919లో నియమించాడు.
14. బహుత్వ ఎంపిక: మత్తయి 13:47-50 వచనాల్లో యేసు చెప్పిన ఉపమానంలోని చేపల వల, అభిషిక్త క్రైస్తవుల సంఘంతోపాటు (ఎ) దేవుని మెస్సీయా రాజ్యాన్ని; (బి) వారి తోటివారైన వేరే గొఱ్ఱెలను; (సి) క్రైస్తవమత సామ్రాజ్యాన్ని సూచిస్తోంది.
15. మత్తయి 5:24 వ వచనంలో నమోదైన యేసు మాటల ప్రకారం, మీరు మీతోటి ఆరాధకుని మనసు నొప్పించినట్లు భావిస్తే ఏమి చెయ్యాలి? [g96 2/8, 26-7 పేజీలు]