ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరిలో: ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! లేదా ఇక్కడ ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు త్రిత్వమును నమ్మవలయునా?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమనుకున్న చోట్ల మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషుర్‌లను ప్రతిపాదించవచ్చు. మార్చిలో: గృహ బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి కృషి చేస్తూ నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించండి. ఏప్రిల్‌లో: కావలికోట, తేజరిల్లు! పత్రికలను ప్రతిపాదించండి. ఆసక్తిగల ప్రజలను పునర్దర్శిస్తున్నప్పుడు—వారిలో జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ఇతర దైవపరిపాలనా సందర్భాలకు హాజరైనప్పటికీ సంఘంతో క్రమంగా సహవసించనివారు కూడా ఉండవచ్చు—ఏకైక సత్య దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) పుస్తకాన్ని ప్రతిపాదించడంపై అవధానం ఉంచండి. గృహ బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి కృషి చేయండి, ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులు ఇప్పటికే జ్ఞానము పుస్తకాన్ని, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను అధ్యయనం చేసినట్లైతే వారితో ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నించండి. మేలో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. దీనికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాలలో దేనినైనా ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా అందించవలసిన పుస్తకాల స్టాకు సంఘంలో లేనట్లయితే, దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా మీకు ఇవ్వగలిగేంత అదనపు స్టాకు ఉందేమో దయచేసి చూడండి.
◼ సంఘ పైవిచారణకర్త గానీ, ఆయన నియమించిన వేరే ఎవరైనా గానీ మార్చి 1న లేక ఆ తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘ లెక్కల్ని ఆడిట్ చేయాలి. ఆడిట్ చేయడం పూర్తయ్యాక, దాన్ని తరువాతి అక్కౌంట్స్ రిపోర్టును చదివాక సంఘానికి ప్రకటించాలి. ప్రపంచవ్యాప్త పని కోసం లేదా సంస్థ ఏర్పాటు చేసిన వేరే ఫండ్ కోసం సంఘం పంపించిన విరాళాలకు ఎక్నాలెడ్జ్‌మెంట్ వస్తే దాన్ని కూడా చదవండి.
◼ సంఘ కార్యదర్శి, సేవా పైవిచారణకర్త క్రమ పయినీర్లందరి కార్యకలాపాలను సమీక్షించాలి. అవసరమైన గంటలను పూర్తి చేయడానికి ఎవరికైనా కష్టంగా ఉన్నట్లైతే పెద్దలు వారికి సహాయాన్ని అందించడానికి ఏర్పాట్లు చేయాలి. సలహాల కోసం S-201 వార్షిక ఉత్తరాలను సమీక్షించండి. 1986 అక్టోబరు మన రాజ్య పరిచర్య (ఆంగ్లం) మధ్య పేజీల్లోని 12-20 పేరాలను కూడా చూడండి.
◼ 2003వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఆదివారం, ఏప్రిల్ 27న ఇవ్వబడుతుంది. “బబులోనుకు తీర్పుతీర్చే గడియ సమీపించిందా?” అనేది దాని ప్రసంగాంశం. సంక్షిప్త ప్రతి అందజేయబడుతుంది. ఆ వారాంతంలో ప్రయాణ పైవిచారణకర్త సందర్శనం గానీ సమావేశం గానీ ఉన్న సంఘాలకు ఈ ప్రత్యేక ప్రసంగం తర్వాతి వారం ఇవ్వబడుతుంది. ఏప్రిల్ 27, 2003కు ముందే ఈ ప్రసంగం ఏ సంఘంలోను ఇవ్వబడకూడదు.
◼ పోస్టు ద్వారా వ్యక్తిగతంగా పత్రికలను తెప్పించుకొనే ఏర్పాటు తీసివేయబడింది కనుక, సంఘాలు కావలికోట, తేజరిల్లు! పత్రికల కొత్త సంచికలను అందుకున్న వెంటనే సాధ్యమైనంత త్వరగా ప్రచారకులకు ఇవ్వడం ప్రాముఖ్యం. అలా చేయడం మూలంగా, ప్రచారకులు వ్యక్తిగత కాపీలను అందుకుని, క్షేత్ర సేవలో ఆ పత్రికలను ప్రతిపాదించకముందే వాటిలోని సమాచారాన్ని చదువుకోవడానికి సాధ్యమవుతుంది.