పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జన.-మార్చి.
“‘నాకు దేహములో బాగులే[దు]’ అని ఎవ్వరూ అనని ఒక కాలం రాబోతుందని బైబిలు ప్రవచనం సూచిస్తోంది. [యెషయా 33:24 చదవండి.] అది నిజంగా అద్భుతమైన విషయం కాదంటారా? [జవాబు చెప్పనివ్వండి.] అయితే, నేడు మానవాళి ఎయిడ్స్ వ్యాధితోపాటు అనేక ఇతర వ్యాధులతో సతమతమవుతోంది. ఎయిడ్స్ స్వైరవిహారం ఎన్నటికైనా ఆగుతుందా? అనే ప్రశ్నకు ఈ తేజరిల్లు! సంచిక జవాబునిస్తుంది.”
కావలికోట జన. 15
“ఇప్పటివరకు జరిగిన రక్తపాతమంతటి దృష్ట్యా మంచితనంపై దుష్టత్వం విజయం సాధించిందని మీరు భావిస్తున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] దేవుని గురించి బైబిలు ఏమి చెబుతోందో గమనించండి. [కీర్తన 83:18బి భాగం చదవండి.] దేవుడు సర్వలోకములో మహోన్నతుడైనప్పుడు దుష్టత్వం నిజంగా విజయం సాధించగలదా? [జవాబు చెప్పనివ్వండి.] ఆ ప్రశ్నకు ఈ కావలికోట సంచిక సంతృప్తికరమైన జవాబును ఇస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి.
“ఈ రోజుల్లో అనేకమంది యౌవనులు సొంత మొబైల్ ఫోన్ కోసం తహతహలాడుతున్నారు. అది వారికి మంచిదేనని మీరనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] బైబిలులోని ఈ వ్యాఖ్యానం ఎంత జ్ఞానవంతమైనదో గమనించండి. [ఎఫెసీయులు 5:15, 16 చదవండి.] సెల్ ఫోన్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ తరచూ వాటి మూలంగా అమూల్యమైన సమయం వృధా అయిపోతుండవచ్చు. మొబైల్ ఫోన్ల వాడకంపై సమతూక దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ఈ తేజరిల్లు! సంచిక మీకు సహాయపడుతుంది.”
కావలికోట ఫిబ్ర. 1
“నేడు అనేకమంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. మరితరులు పనిలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగంలో సంతోషం, భద్రత సాధ్యమేనని భావించవచ్చని మీకనిపిస్తోందా? [జవాబు చెప్పనివ్వండి. తర్వాత యెషయా 65:21-23 చదవండి.] ప్రతి ఒక్కరికీ ప్రతిఫలదాయకమైన పని ఉండే ఒక కాలం గురించి ఈ కావలికోట సంచిక చర్చిస్తుంది.”