కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/03 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఉపశీర్షికలు
  • జనవరి 13తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 20తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 27తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2003
km 1/03 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జనవరి 13తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను, (పత్రికలను పరిచయం చేసే కాలమ్‌లో మొదటిది) జనవరి 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒకే పత్రిక గురించి అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి.

15 నిమి: మాట మాట్లాడకుండానే గెలుచుకున్నారు. ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. చక్కని క్రైస్తవ ప్రవర్తన శక్తివంతమైన సాక్ష్యం. అది అవిశ్వాసులైన కొందరు జీవిత భాగస్వాములను యెహోవా ఆరాధకులుగా మారేలా కదిలించింది. (1 పేతు. 3:1, 2) 1999, జనవరి 1, కావలికోట, 4వ పేజీ; 1995, అక్టోబరు 1, కావలికోట, 10, 11 పేజీలు; 1995 వార్షిక పుస్తకం (ఆంగ్లం) 46వ పేజీల్లోని అనుభవాలను చెప్పండి. ఈ విషయంలో బైబిలు సలహా పాటించడం వల్ల కలుగుతాయని తాము గమనించిన సానుకూల ఫలితాల గురించి వ్యాఖ్యానించడానికి ఇద్దరినో ముగ్గురినో ముందుగానే ఏర్పాటు చేసుకోండి.

20 నిమి: “మన సమర్పణకు అనుగుణంగా జీవించడం.”a 3వ పేరా చర్చించిన తర్వాత బాప్తిస్మం పొందిన ఒక యౌవనస్థుణ్ణి లేదా ఒక టీనేజర్‌ను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. బాప్తిస్మం పొందినప్పటి నుండి ఆయన ఎలాంటి శోధనలను ఎదుర్కొన్నాడు? వాటిని విజయవంతంగా అధిగమించడానికి ఆయనకు ఏమి సహాయపడింది? ఆయన తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడం వల్ల ఎలా ప్రయోజనం పొందాడు?

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

జనవరి 20తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: మీరు లేఖనాలను ప్రతిదినం పరిశోధిస్తున్నారా? ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం—2003ని సద్వినియోగం చేసుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి. 3, 4 పేజీల్లోనున్న ముందుమాటలోని వ్యాఖ్యానాలను చర్చించండి. కుటుంబ సభ్యులందరూ కలిసి లేఖనాన్ని ఎలా చర్చించవచ్చో తెలుపుతూ సలహాలివ్వండి. లేఖనాన్ని ప్రతిదినం పరిశీలించడం వల్ల కలిగే ప్రయోజనాలను చూపించడానికి, మరుసటి నెలలోని లేఖనాల, వ్యాఖ్యానాల రెండు లేక మూడు ఉదాహరణలను చర్చించండి. భార్యా భర్తా కలిసి ఈరోజు లేఖనాన్ని, వ్యాఖ్యానాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఒక చిన్న ప్రదర్శనను కూడా చేర్చండి.

22 నిమి: “ఇతరులకు స్వచ్ఛమైన భాషను నేర్పించండి.”b 6వ పేరాను చర్చించిన తర్వాత సమర్థవంతుడైన ఒక ప్రచారకుని చేత 2002 జనవరి, మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌లోని 4వ పేజీలో సూచించిన పద్ధతుల్లో ఒకదాన్ని ఉపయోగిస్తూ పునర్దర్శనానికి వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గరే బైబిలు అధ్యయనం ఎలా ప్రారంభించవచ్చో ప్రదర్శించండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని ఒక పేరాను పరిశీలించడాన్ని కూడా చేర్చండి. ప్రచారకుడు దాని తర్వాతి పేరాకు సంబంధించి ఒక ప్రశ్న అడిగి, దానికి జవాబు మళ్ళీ కలుసుకున్నప్పుడు చెబుతాననే ఏర్పాటుతో ముగించేలా చూడండి. ఈ విధంగా బైబిలు అధ్యయనం చేయడానికి తాము కలుసుకున్న వారిలో ఎవరైనా ఇష్టపడుతుండవచ్చేమో ఆలోచించమని అందరినీ ప్రోత్సహించండి.

పాట 23 (200), ముగింపు ప్రార్థన.

జనవరి 27తో ప్రారంభమయ్యే వారం

పాట 18 (162)

10 నిమి: స్థానిక ప్రకటనలు. క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జనవరి-మార్చి తేజరిల్లు!ను, (పత్రికలను పరిచయం చేసే కాలమ్‌లో మూడవది) ఫిబ్రవరి 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో గృహస్థుడు పత్రికలను తీసుకుంటాడు, ఒక ప్రదర్శనలో తీసుకోడు. రెండింటిలోనూ ప్రచారకుడు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? కరపత్రాన్ని గృహస్థునికిస్తూ ముగించేలా చూడండి. మనం కరపత్రాన్ని ఇచ్చినప్పుడు పత్రికలను కూడా తీసుకున్నవారిని ఎలా పునర్దర్శనం చేయవచ్చో క్లుప్తంగా వివరించండి.—2001 నవంబరు మన రాజ్య పరిచర్య 4వ పేజీ, 10వ పేరా చూడండి.

35 నిమి: “‘ఆసక్తిగల రాజ్య ప్రచారకులు’ జిల్లా సమావేశం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందడం.” ఇది కావలికోట అధ్యయన నిర్వాహకుని చేత నిర్వహించబడాలి. ఒక్క నిమిషం ఉపోద్ఘాతం తర్వాత, ఆర్టికల్‌లో ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ ప్రేక్షకులతో జిల్లా సమావేశ కార్యక్రమంపై చర్చను ప్రారంభించండి. మీకు కేటాయించబడిన సమయాన్ని వివిధ భాగాలకు జాగ్రత్తగా విభజించుకోండి. కీలకాంశాలను జ్ఞాపకం చేసేందుకు క్లుప్తమైన వ్యాఖ్యానాలను చేర్చవచ్చు. ప్రేక్షకులు తాము నేర్చుకున్న వాటిని ఎలా అన్వయించుకుంటున్నారో, అలా చేయడంవల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారో తెలపమని సందర్భోచితంగా అడగండి.

పాట 20 (93), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 3తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

10 నిమి: స్థానిక అవసరాలు.

12 నిమి: వారి విశ్వాసాన్ని అనుకరించండి. యెహోవాను అనేక సంవత్సరాల నుండి నమ్మకంగా సేవిస్తున్న వినమ్రుడైన ఒక పెద్దను ఇంటర్వ్యూ చేయండి. (హెబ్రీ. 13:7) ఆయన సత్యాన్ని ఎలా తెలుసుకున్నాడు? సత్యంలో స్థిరంగా నిలబడడానికి ఆయన ఎలాంటి ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆయన అభివృద్ధి చెందడానికి ఎలాంటి ఆధ్యాత్మిక ఏర్పాట్లు లేదా ప్రోత్సాహం దోహదపడ్డాయి? సంఘంలో అలాంటి బాధ్యతాయుతమైన స్థానానికి చేరుకోవడానికి ఆయనేమి చేశాడు? (1 తిమో. 3:1) సంఘంలోని తన బాధ్యతలతోపాటు ఉద్యోగంలోని కుటుంబంలోని తన విధులను సమన్వయం చేసుకోవడానికి ఆయనకు ఏమి తోడ్పడింది? (1 తిమో. 5:8) సంఘంలో ఇతరులకు సహాయం చేసే ఆధిక్యత గురించి ఆయనెలా భావిస్తున్నాడు?

18 నిమి: “వినయం అవసరమయ్యే పని.”c 3వ పేరా చర్చించేటప్పుడు, క్షేత్రంలో ఎవరైనా ఎగతాళి చేస్తూ లేదా అమర్యాదగా, గొడవపడే విధంగా లేదా కోపంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఎలా ప్రతిస్పందించాలనే దాని గురించి సలహాలిమ్మని ప్రేక్షకులను కోరండి. 4వ పేరా చర్చిస్తున్నప్పుడు అంతర్దృష్టి (ఆంగ్లం) 1వ సంపుటి 1160వ పేజీలోని 3వ పేరాలోనున్న వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 3 (32), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి