రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది వీడియోను మీరు తప్పకుండా చూడండి
రక్త రహిత చికిత్సలో ఎంపిక చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి మీకు ఎంత వరకు తెలుసు? కొన్ని రక్త మార్పిడి ప్రత్యమ్నాయాలు ఏమిటో అవి ఎలా పని చేస్తాయో మీరు అర్థం చేసుకున్నారా? ఆంగ్లంలోవున్న ఈ వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన దాన్ని ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నలతో బేరీజు వేసుకోండి.—గమనిక: ఈ వీడియోలో కొన్ని ఆపరేషన్ దృశ్యాలు ఉన్నాయి కాబట్టి, తల్లితండ్రులు దీన్ని చిన్నపిల్లలతో చూసే విషయంలో తమకు సముచితమని తోచిన విధంగా నిర్ణయం తీసుకోవాలి.
(1) యెహోవాసాక్షులు రక్తమార్పిడులను నిరాకరించడానికి ముఖ్య కారణం ఏమిటి, బైబిల్లో ఆ సూత్రం ఎక్కడుంది? (2) చికిత్స విషయానికొచ్చేసరికి మనం ఏమి కోరుకుంటాం? (3) రోగులకు ఏ ప్రాథమిక హక్కు ఉంది? (4) రక్తమార్పిడులను నిరాకరించడం తెలివైన, బాధ్యతాయుతమైన నిర్ణయమని ఎందుకు అనవచ్చు? (5) రక్తం విపరీతంగా కోల్పోయిన సందర్భంలో, డాక్టర్లు మొట్టమొదటగా చేసే రెండు అత్యవసరమైన పనులు ఏమిటి? (6) రక్తమార్పిడులలో ఆరోగ్యానికి హాని కలిగించేవి ఏమిటి? (7) ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం ఎక్కువగా కోల్పోకుండా ఉపయోగించేందుకు శస్త్ర చికిత్సకులకు అందుబాటులో ఉన్న కొన్ని పరికరాలు ఏమిటి? (8) రక్తమార్పిడికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉపయోగిస్తున్నప్పుడు దాని గురించి మీరు ఏమి తెలుసుకోవాలి? (9) రక్తమార్పిడులు లేకుండా సంక్లిష్టమైన, పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసే అవకాశముందా? (10) యెహోవాసాక్షుల కోసం ఏమి చేయడానికి చాలామంది వైద్యులు సుముఖంగా ఉన్నారు, రోగులందరి సంక్షేమం కోసం చివరికి ఏది ఒక ప్రమాణం కావచ్చు?
రక్త రహిత చికిత్స అనే ఈ వీడియో మీ బైబిలు విద్యార్థులెవరితోనైనా, రక్తం విషయంలో మన స్థానం గురించి ప్రశ్నించే సాక్షేతర జీవిత భాగస్వామి లేదా బంధువులు, తోటిపనివారు, టీచర్లు, తోటి విద్యార్థుల వంటివారెవరితోనైనా కలిసి చూడడం సహాయకరంగా ఉంటుందన్నది నిస్సంశయం. ఈ వీడియోలో చూపించబడిన చికిత్సలను చేయించుకోవాలనుకునేవారు వ్యక్తిగతంగా మంచి మనస్సాక్షితో నిర్ణయం తీసుకోవాలి.—జూన్ 15, అక్టోబరు 15 2000 కావలికోట సంచికల్లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.