ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరు, జనవరి నెలల్లో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. దీనికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం), మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాలలో దేనినైనా ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా అందించవలసిన పుస్తకాల స్టాకు సంఘంలో లేనట్లయితే, దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా మీకు ఇవ్వగలిగేంత ఎక్కువ స్టాకు ఉందేమో దయచేసి చూడండి. ఫిబ్రవరి నెలలో: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” త్రిత్వమును మీరు నమ్మవలయునా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు. సముచితమనుకున్న చోట్ల, సర్వమానవాళి కొరకైన గ్రంథం, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషుర్‌లను ప్రతిపాదించవచ్చు. మార్చి నెలలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ప్రత్యేక ప్రయత్నం చెయ్యాలి.
◼ 2004వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్ 4, ఆదివారం సూర్యాస్తమయం తర్వాత అని దయచేసి గుర్తుంచుకోండి. ఒకవేళ ఒకే రాజ్యమందిరాన్ని, ఇతర సదుపాయాలను ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తున్నట్లయితే, సహోదరులు అందుబాటులో ఉన్న హాళ్ళకు అవసరమైన రిజర్వేషన్లు లేక కాంట్రాక్టులు చేసుకోవడానికి వీలుగా ఈ తేదీ ఇంత ముందుగా తెలియజేయబడుతోంది. జ్ఞాపకార్థ ఆచరణ ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరిగేలా ఆ భవనంలోని ఇతర కార్యకలాపాల వల్ల భంగంవాటిల్లకుండా ఉండేందుకు పెద్దలు హాలు యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవాలి. జ్ఞాపకార్థ ఆచరణకు ప్రసంగీకుణ్ణి నియమిస్తున్నప్పుడు, పెద్దలసభ ఆ సందర్భం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, ఏదో వంతులవారీగా అని గానీ, ప్రతి సంవత్సరం ఒకే సహోదరుణ్ణి గానీ నియమించకుండా యోగ్యుడైన పెద్దను ఎంపికచేయాలి. ఒకవేళ ప్రసంగం ఇవ్వగలిగే అభిషిక్తుడైన పెద్ద గనుక ఉంటే ఆయననే ఎంపికచేయాలి.
◼ ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శన సమయంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్వహించబడే విధానంలో మార్పు చేయబడింది. జనవరి 2003 నుండి ప్రారంభపు పాట, ప్రార్థన తర్వాత పాఠశాల దాదాపు 25 నిమిషాలు నిర్వహించబడుతుంది. ప్రసంగ లక్షణంపై ఇచ్చే ప్రసంగానికి అయిదు నిమిషాలు, ఉపదేశ ప్రసంగానికి పది నిమిషాలు, బైబిలు ఉన్నతాంశాలకు పది నిమిషాలు ఉంటాయి. 2వ, 3వ, 4వ నియామకాలు నిర్వహించబడవు. పాఠశాల తర్వాత అరగంట సేపు సేవా కూటం ఉంటుంది. ఒక పాట తర్వాత అరగంట సేపు ప్రాంతీయ పైవిచారణకర్త కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ముగింపు పాట ప్రార్థన నిర్వహించబడతాయి.
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
కుటుంబ సంతోషానికిగల రహస్యము—నేపాలీ
దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?—గుజరాతీ
మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? (కరపత్రం నం. 26)—గుజరాతీ, తమిళం
తక్దీర్ మన జీవితాల్ని ఏలుతోందా? లేక ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? (కరపత్రం నం. 71)—ఉర్దూ, హిందీ
మహాగొప్ప నామము (కరపత్రం నం. 72)—హిందీ
యెహోవాసాక్షులు ఎవరు? (కరపత్రం నం. 73)—హిందీ
జహన్నమ్ దైవిక నీతిలో ఒక భాగమా? (కరపత్రం నం. 74)—హిందీ