దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2002, సెప్టెంబరు 2 నుండి డిసెంబరు 23, మధ్య వారాల్లో జరిగిన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నియామకాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగలిగినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. ప్రశ్నల ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. యెహోవాకు సన్నిహితమవ్వడంలో ఆయన అద్భుతమైన లక్షణాల గురించి ధ్యానించడం ఒక ప్రాముఖ్యమైన చర్య. (కీర్త. 143:5) [w00 10/15 4వ పేజీ, 6వ పేరా]
2. యెహెజ్కేలు 37:15-24 వచనాల్లో పేర్కొనబడిన, రెండు కఱ్ఱతునకలను జోడించడానికి ఒక ఆధునిక సమాంతరం ఉంది, అదేమిటంటే 1919లో నమ్మకమైన అభిషిక్తులు తమ ‘ఒకే రాజు ఒకే కాపరి’ క్రింద ఐక్యపర్చబడ్డారు. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 9/15 25వ పేజీ, 13వ పేరా చూడండి.]
3. అంత్యదినాలను వర్ణించే ప్రవచనాలలోని కొన్ని అంశాలు చరిత్రలోని ఇతర కాలాలకు వర్తిస్తాయన్నట్లు కనిపించవచ్చు. [kl 106వ పేజీ, 16వ పేరా]
4. మనం వినేది అధికారపూర్వకమైన మూలం అనిపించేదాని నుండి లేదా తనకు గొప్ప జ్ఞానముందని చెప్పుకునే వ్యక్తి నుండి వచ్చినప్పుడు అది తప్పని నిరాకరించడానికి గట్టి కారణం ఉండదు. [w00 12/1 29వ పేజీ, 7, 8 పేరాలు]
5. మనం దైవభక్తిగల జీవితాన్ని గడపడం, మనమెల్లప్పుడూ మంచిగా చూడబడతామనే దానికి హామీ ఇస్తుంది. [kl 118వ పేజీ, 2వ పేరా]
6. సంఘంలోని పెద్దలు, మన నాయకుడైన యేసుక్రీస్తు చేసినట్లుగానే తమతోటి ఆరాధకుల అవసరాలను చూసే దేవుని సేవకులు, దాసులు. (యోహా. 10:14, 15) [kl 137వ పేజీ, 20వ పేరా]
7. ఎదోమీయులు యూదావారి పట్ల తాము చూపిన ద్వేషాన్ని బట్టి జాతీయ స్థాయిలో నిర్మూలించబడతారని ఓబద్యా 16వ వచనం ప్రవచిస్తోంది. (ఓబ. 12) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w89 4/15 30వ పేజీ, బాక్సు చూడండి.]
8. జెఫన్యా 3:9, NWలో ప్రస్తావించబడిన “స్వచ్ఛమైన భాష”లో దేవుని గూర్చిన, ఆయన సంకల్పాలను గూర్చిన సత్యం యొక్క సరియైన అవగాహన ఇమిడి ఉంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w01 2/15 27వ పేజీ, 18వ పేరా చూడండి.]
9. గెత్సేమనే తోటలో యేసు అనుభవించిన తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణం, ఒక నీచమైన నేరస్థుడిగా తను మరణించడం యెహోవాపైకి ఆయన పవిత్ర నామముపైకి ఎక్కడ నింద తెస్తుందోనన్నదే. (మత్త. 26:38; లూకా 22:44) [w00 11/15 23వ పేజీ, 1వ పేరా]
10. జెకర్యా 9:6, 7 NW వచనాల్లో వర్ణించబడినట్లుగా “యూదాలో ఒక షేక్‌వలె” ఉండే ‘ఫిలిష్తీయుడు,’ నేడు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా శిక్షణనూ అవసరమైన అధికారాన్నీ పొందుతున్న వేరే గొఱ్ఱెల సభ్యులకు ప్రవచనార్థక చిత్రీకరణగా ఉన్నాడు. (మత్త. 24:45) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w95 7/1 23వ పేజీ, 14వ పేరా చూడండి.]
క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:
11. ప్రకటించే విషయంలో మనకున్న బాధ్యతను కావలివానిగా ఉండే విషయంలో యెహెజ్కేలుకున్న బాధ్యతతో ఎలా పోల్చవచ్చు? (యెహె. 33:1-11) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 1/1 28వ పేజీ, 13వ పేరా చూడండి.]
12. ఎండిన ఎముకల గురించి యెహెజ్కేలుకు ఇవ్వబడిన దర్శనానికి సమాంతరమైనది ఏది ఆధునిక కాలాల్లో కనిపిస్తుంది? (యెహె. 37:5-10) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w88 9/15 24వ పేజీ, 12వ పేరా చూడండి.]
13. మనపట్ల దేవునికున్న చిత్తాన్ని ఎలా క్లుప్తీకరించవచ్చు? [kl 170వ పేజీ, 3వ పేరా]
14. యెహెజ్కేలుకు ఇవ్వబడిన దర్శనంలోని పట్టణం దేనిని సూచిస్తుంది? (యెహె. 48:15-17) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w99 3/1 18వ పేజీ, 22వ పేరా చూడండి.]
15. యోహాను 11:9, 10 వచనాల్లో “పగటివేళ,” “రాత్రి” అన్నప్పుడు యేసు ఉద్దేశం ఏమిటి? [gt 89వ అధ్యాయం]
16. ముప్ఫై రోజులపాటు రాజుకు తప్ప ఏ దేవుని యొద్దనే గానీ మానవుని యొద్దనే గానీ మనవి చేయవద్దని రాజు ఇచ్చిన ఆజ్ఞకు దానియేలు ప్రతిస్పందించిన దాని నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (దాని. 6:7-10) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; dp 125వ పేజీ, 25-8 పేరాలు చూడండి.]
17. యెహోవా యొక్క ఏ సందేశాన్ని ప్రకటించడంలో శేషము జనముల మధ్య సింహమువలె ఉన్నారు. (మీకా 5:8) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w81 7/15 23వ పేజీ, 10వ పేరా చూడండి.]
18. హబక్కూకు 3:14లోని, “యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు” అనే పదబంధం యొక్క భావమేమిటి? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w00 2/1 22వ పేజీ, 15వ పేరా; w81 8/1 29వ పేజీ, 6, 7 పేరాలు చూడండి.]
19. జెఫన్యా 2:3లో “ఒకవేళ” అనే పదాన్ని ఉపయోగించడం దేన్ని సూచిస్తుంది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w01 2/15 19వ పేజీ, 8వ పేరా చూడండి.]
20. జెకర్యా 8:6 ప్రకారం, 1919 మొదలుకొని తర్వాతి సంవత్సరాల్లో, మానవ దృక్కోణం నుండి చూస్తే ఎంతో కష్టతరమైనదిగా అనిపించేదాన్ని యెహోవా ఎలా సాధించాడు? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w96 1/1 16వ పేజీ, 18, 19 పేరాలు చూడండి.]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. మనం యెహోవాతో _________________________ ద్వారా మాట్లాడతాం, అది భక్తి, గౌరవాలతో మనం దేవుడితో చేసే సంభాషణ; ఆయన మనతో మాట్లాడే ప్రధాన మాధ్యమం ఆయన _________________________. (కీర్త. 65:2; 2 తిమో. 3:16) [w00 10/15 5వ పేజీ, 2, 3 పేరాలు]
22. యేసు చెప్పిన ఉపమానంలోని తప్పిపోయిన కుమారుడు, లోకం అందించే _________________________ అనుభవించడానికి వెళ్ళిన దేవుని ప్రజలను సూచిస్తున్నాడు, కానీ కొంతకాలానికి వీరు _________________________తో తిరిగి వచ్చి మళ్ళీ దేవుని _________________________ సేవకులవుతారు. [gt 86వ అధ్యాయం]
23. ‘యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరడం’ _________________________లో సంభవించింది, అది సా.శ. 29లో మెస్సీయ రావడంతో ముగిసిన 69 వారాల సంవత్సరాల ఆరంభాన్ని సూచించింది. (దాని. 9:25) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; dp 190వ పేజీ, 20వ పేరా నుండి 191వ పేజీ 22వ పేరా వరకు చూడండి.]
24. యెహోవా యొక్క నమ్మకమైన ఆరాధకులెవరూ వివిధ _________________________లో భాగం వహించడం ద్వారా లేక మహా బబులోను యొక్క ఏ భాగంతోనైనా ఆధ్యాత్మికంగా సహచర్యం కలిగి ఉండడం ద్వారా _________________________ కార్యాలలో ఇమిడి ఉండరు. (సంఖ్యా. 25:1-9; 2 కొరిం. 6:14) [kl 125వ పేజీ, 15వ పేరా]
25. దేవునితో _________________________ మాట్లాడడం ఆయనతో మనకున్న _________________________ పటిష్ఠపర్చుకొనేందుకు సహాయపడుతుంది, ప్రతిదినం యెహోవాకు ప్రార్థించడం ఆయనకు మరింత _________________________ కావడానికి మనకు సహాయం చేస్తుంది. [kl 153-4 పేజీలు, 10వ పేరా]
క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. రాజ్యం ద్వారా, యేసుక్రీస్తు యెహోవా నామము పేరిట భూమిపై (సమాధానమును; పరిపూర్ణతను; పరిపాలనను) పునఃస్థాపించి, దేవుని న్యాయమైన సర్వాధిపత్యాన్ని నిరంతరం (పరిశుద్ధపరుస్తాడు; మహిమపరుస్తాడు; నిరూపిస్తాడు). [kl 91వ పేజీ, 5వ పేరా]
27. ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన “మహాబబులోను”పై ఈ ప్రపంచ (వాణిజ్య వ్యవస్థ; రాజకీయ వ్యవస్థ; సామాజిక విధానం) దాడి చేయడంతో “మహా శ్రమ” ప్రారంభమవుతుందని బైబిలు ప్రవచిస్తోంది. [kl 106వ పేజీ, 15వ పేరా]
28. వేటగాడు జంతువులను తన వలలో చిక్కించుకోవడానికి ఎలాగైతే వివిధ రకాల ఎరలను ఉపయోగిస్తాడో, అలాగే (దుష్టాత్మలు; భ్రష్ట మానవజాతి; ఆత్మ సామ్రాజ్యం) మానవులను తమ అధీనం చేసుకొనేందుకు వివిధ రకాల అభిచారాన్ని ప్రోత్సహిస్తారు. (కీర్త. 119:110 పోల్చండి.) [kl 111వ పేజీ, 6వ పేరా]
29. యోవేలు 1:4-6 వచనాల్లో ప్రస్తావించబడిన సూచనార్థక మిడుతల రాజ్యం (ఇశ్రాయేలు జనాంగానికి; అభిషిక్త క్రైస్తవులకు; రోమా సైన్యాలకు) ప్రాతినిధ్యం వహిస్తుంది. (అపొ. 2:1, 14-17) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w98 5/1 9వ పేజీ, 9వ పేరా చూడండి.]
30. మార్కు 10:29, 30 వచనాల్లో, యేసు తన శిష్యులు లోకంలో ఎక్కడికి వెళ్ళినా, వారు (అపరిచితులతో; శత్రువులతో; తోటి క్రైస్తవులతో) కలిగి ఉండే సంబంధం సహజ కుటుంబ సభ్యులతో కలిగివుండే దానికన్నా అమూల్యమైనదై ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. [gt 96వ అధ్యాయం]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:
ఫిలి. 4:13; యోవే. 2:32; అపొ. 5:32; యాకో. 4:17; రోమా. 12:2
31. ఈ విధానపు సాంస్కృతిక లేదా లౌకిక ప్రమాణాలు మన ఆలోచనా విధానాన్ని మలిచేందుకు మనం అనుమతించకూడదు. [w00 11/1 21వ పేజీ, 5వ పేరా]
32. యెహోవా దేవుడు సర్వశక్తిగలవాడు కాబట్టి, ఒక చెడ్డ అలవాటును మానుకోవడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందాలనే మన కోరిక నెరవేర్చబడేలా ఆయన మనల్ని బలపర్చగలడు. [kl 119వ పేజీ, 4వ పేరా]
33. దైవిక నామాన్ని ధరించిన వ్యక్తి గురించి తెలుసుకోవడం, ఆయనను గౌరవించడం, ఆయనపై ఆధారపడడం రక్షణ పొందడానికి అత్యావశ్యకం. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; w89 3/15 30వ పేజీ, బాక్సు చూడండి.]
34. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించే వారందరికీ ఆయన నమ్మకమైన సేవకులుగా ఆయనకు విధేయత చూపే వారందరికీ యెహోవా తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. [kl 179వ పేజీ, 19వ పేరా]
35. దేవుని గురించిన జ్ఞానము యెహోవా ఎదుట మనకు బాధ్యతను తెస్తుంది. [kl 182వ పేజీ, 4వ పేరా]