కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/02 పేజీ 1
  • రాజ్య సందేశాన్ని ప్రకటించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్య సందేశాన్ని ప్రకటించండి
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • ‘ఎన్నటికీ నాశనముకాని’ రాజ్యము
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • దేవుని రాజ్యం పరిపాలిస్తుంది
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ‘ఎన్నటికి నాశనం కాని’ రాజ్యము
    అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 12/02 పేజీ 1

రాజ్య సందేశాన్ని ప్రకటించండి

1 “నే[ను] . . . దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితి[ని].” (లూకా 4:43) యేసు ఆ మాటలలో తన పరిచర్య ముఖ్యాంశం దేవుని రాజ్యమని స్పష్టంగా తెలియజేశాడు. నేడు మనం ప్రకటిస్తున్న సందేశం కూడా ఆ రాజ్యంపై కేంద్రీకృతమైనదే, మత్తయి 24:14 లో తెలియజేయబడినట్లుగా, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” ప్రజలు దేవుని రాజ్యం గురించిన ఏ సత్యాలను వినాల్సిన అవసరముంది?

2 దేవుని రాజ్యం ఇప్పుడు పరలోకము నుండి పరిపాలిస్తోంది, అతి త్వరలో అది మొత్తం మానవ పరిపాలనా స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. అపవాది ఇంతకు ముందే పరలోకం నుండి గెంటివేయబడ్డాడు, ప్రస్తుత దుష్ట విధానం దాని అంత్యదినాల్లోకి ప్రవేశించింది. (ప్రక. 12:10, 12) సాతాను దుష్ట విధానం పూర్తిగా నాశనం చేయబడుతుంది, కానీ దేవుని రాజ్యం మాత్రం చెక్కుచెదరదు. అది నిరంతరం నిలుస్తుంది.​—దాని. 2:44; హెబ్రీ. 12:28, 29.

3 విధేయులైన మానవులందరి సంక్షేమకరమైన కోరికలను ఆ రాజ్యం తీరుస్తుంది. యుద్ధం, నేరం, దౌర్జన్యం, పేదరికం వంటి వాటివల్ల కలిగే బాధల నుండి ఉపశమనాన్నిస్తుంది. (కీర్త. 46:8, 9; 72:12-14) అందరికీ సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. (కీర్త. 72:16; యెష. 25:6) వ్యాధులు, వైకల్యాలు కేవలం పాత జ్ఞాపకాలుగా అవుతాయి. (యెష. 33:24; 35:5, 6) మానవాళి పరిపూర్ణతకు చేరుకుంటుండగా ఈ భూమి ఒక పరదైసుగా రూపొందించబడుతుంది, ప్రజలు ఐక్యంగా కలిసిమెలిసి జీవిస్తారు.​—యెష. 11:6-9.

4 మనం ఆ దేవుని రాజ్య నివాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామని మన జీవనశైలి ద్వారా రుజువు చేస్తాం. రాజ్య సందేశం మన లక్ష్యాలను, మన జీవితంలో మనం ప్రథమ స్థానం ఇచ్చే విషయాలతో సహా మన పూర్తి జీవనశైలినే ప్రభావితం చేయాలి. ఉదాహరణకు మనకు మన కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉన్నప్పటికీ, భౌతిక సంపదల గురించిన చింతలు రాజ్యానికి మద్దతునిచ్చే విషయాలను స్తంభింపజేసేంతగా అనుమతించకూడదు. (మత్త. 13:22; 1 తిమో. 5:8) బదులుగా, యేసు ఇచ్చిన సలహాను పాటించాలి: “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు [జీవితపు భౌతికావసరాలు] మీకనుగ్రహింపబడును.”​—మత్త. 6:33.

5 సమయం మించిపోకముందే ప్రజలు రాజ్య సందేశాన్ని విని, చర్య తీసుకోవడం అత్యవసరం. కాబట్టి వారలా చేయడానికి మనం “దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు” వారికి సహాయం చేద్దాం.​—అపొ. 19:8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి